iDreamPost
android-app
ios-app

Rohit Sharma: బంగ్లా బెండు తీసేందుకు రోహిత్ మాస్టర్​ప్లాన్.. ఏ కెప్టెన్ చేయని సాహసం ఇది!

  • Published Sep 14, 2024 | 8:02 PM Updated Updated Sep 14, 2024 | 8:02 PM

IND vs BAN, Rohit Sharma, Gautam Gambhir: బంగ్లాదేశ్​తో ఫస్ట్ టెస్ట్​కు సిద్ధమవుతోంది టీమిండియా. చెన్నై వేదికగా జరిగే ఈ మ్యాచ్​లో విజయం సాధించి సిరీస్​లో బోణీ కొట్టాలని చూస్తోంది. అందుకోసం కెప్టెన్ రోహిత్ శర్మ గట్టిగానే ప్లానింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

IND vs BAN, Rohit Sharma, Gautam Gambhir: బంగ్లాదేశ్​తో ఫస్ట్ టెస్ట్​కు సిద్ధమవుతోంది టీమిండియా. చెన్నై వేదికగా జరిగే ఈ మ్యాచ్​లో విజయం సాధించి సిరీస్​లో బోణీ కొట్టాలని చూస్తోంది. అందుకోసం కెప్టెన్ రోహిత్ శర్మ గట్టిగానే ప్లానింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

  • Published Sep 14, 2024 | 8:02 PMUpdated Sep 14, 2024 | 8:02 PM
Rohit Sharma: బంగ్లా బెండు తీసేందుకు రోహిత్ మాస్టర్​ప్లాన్.. ఏ కెప్టెన్ చేయని సాహసం ఇది!

బంగ్లాదేశ్​తో ఫస్ట్ టెస్ట్​కు సిద్ధమవుతోంది టీమిండియా. చెన్నై వేదికగా జరిగే ఈ మ్యాచ్​లో విజయం సాధించి సిరీస్​లో ముందడుగు వేయాలని చూస్తోంది. ఈ మ్యాచ్​కు ఆతిథ్యం ఇస్తున్న చెపాక్ స్టేడియానికి ఇప్పటికే చేరుకున్న భారత జట్టు ఆటగాళ్లు మొదటి రోజు ప్రాక్టీస్ సెషన్​లో తీవ్రంగా చెమటోడ్చారు. రెండో రోజు కూడా అంతే తీవ్రతతో సాధన చేశారు. చాన్నాళ్లు గ్యాప్ రావడంతో ప్రతి ప్లేయర్ గంటల కొద్దీ నెట్స్​లో బ్యాటింగ్, బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తూ గడిపారు. తొలి టెస్ట్​లో బంగ్లా బెండు తీయాలని చూస్తున్న మెన్ ఇన్ బ్లూ.. అందుకు తగ్గట్లే గట్టి ప్లానింగ్​ చేస్తున్నట్లు తెలుస్తోంది. రోహిత్ శర్మ అయితే స్వదేశంలో టెస్టుల్లో ఏ కెప్టెన్ కూడా చేయని సాహసానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. అతడి రిస్క్ వర్కౌట్ అయితే మాత్రం బంగ్లాకు దబిడిదిబిడేనని అంటున్నారు. అసలు రోహిత్ ప్లాన్ ఏంటనేది ఇప్పుడు చూద్దాం..

ఫస్ట్ టెస్ట్​కు ఆతిథ్యం ఇస్తున్న చెపాక్ పిచ్​ను పూర్తి పేస్ వికెట్​గా తయారు చేయిస్తున్నాడట రోహిత్. కోచ్ గౌతం గంభీర్​తో కలసి సమాలోచనలు చేశాకే ఈ నిర్ణయానికి వచ్చాడని వినికిడి. సాధారణంగా ఇక్కడ కనిపించే బ్లాక్ సాయిల్ వికెట్​కు బదులు రెడ్ సాయిల్ వికెట్​ను రెడీ చేయిస్తున్నారట. ఈ విషయం బయట పడకుండా ఉండేందుకు మీడియా సహా ఎవర్నీ పిచ్ దగ్గరకు రానివ్వడం లేదట. పేస్​తో బంగ్లా బెండు తీయాలని రోహిత్-గంభీర్ స్కెచ్ వేశారట. పేసుగుర్రం జస్​ప్రీత్ బుమ్రా సహా మరో ముగ్గురు స్పీడ్​స్టర్స్​ను తుదిజట్టులోకి తీసుకోవాలని చూస్తున్నారట. ఇందులో భాగంగానే దులీప్ ట్రోఫీలోనూ పేస్ ఫ్రెండ్లీ వికెట్ల మీద భారత స్టార్లను ఆడించారని సమాచారం.

తొలి టెస్ట్​కు ఆతిథ్యం ఇస్తున్న చెపాక్ పిచ్ నార్మల్​గా స్పిన్​కు అనుకూలిస్తుంది. మన దేశంలోని మంచి టర్నింగ్ ట్రాక్స్​లో ఇదొకటి. బౌలర్లకు స్వర్గధామం లాంటి ఈ పిచ్ మీద నిలబడి పరుగులు చేయాలంటే టాప్ బ్యాటర్స్ కూడా జడుసుకుంటారు. సుడులు తిరిగే బంతులను అడ్డుకొని వికెట్ కాపాడుకోవడమే గొప్ప.. అలాంటిది పరుగులు చేయాలంటే ఎంతో ఓపిక, డిఫెన్స్ టెక్నిక్​ అవసరం ఉంటుంది. దీంతో బంగ్లాతో మ్యాచ్​లో స్పిన్నర్లు పండుగ చేసుకోవడం ఖాయమని అంతా అనుకున్నారు. ఈ మధ్య భారత బ్యాటర్లు స్పిన్​ ఆడటంలో ఇబ్బంది పడుతుండటంతో వాళ్లను ఇదే అస్త్రంతో కొట్టాలని బంగ్లాదేశ్ భావిస్తోంది. దీన్ని పసిగట్టిన రోహిత్-గంభీర్ అనూహ్యంగా పిచ్​ను మార్చాలని డిసైడ్ అయ్యారని సమాచారం.

పేస్ వెపన్​తో అపోజిషన్ టీమ్​కు షాక్ ఇవ్వాలని రోహిత్-గౌతీ అనుకుంటున్నారట. అయితే ఇది బెడిసికొడితే మొదటికే మోసం వచ్చే ఛాన్స్ ఉంది. రోహిత్ చేస్తున్న రిస్క్​లో సక్సెస్​తో పాటు ఫెయిల్ అయ్యే ప్రమాదం కూడా పొంచి ఉందని ఎక్స్​పర్ట్స్ అంటున్నారు. అయితే ఏదైనా ఒకటికి పదిసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకునే హిట్​మ్యాన్.. ఈ విషయంలోనూ మేధోమథనం చేసే ఉంటాడు. బంగ్లాను ఇక్కడ పేస్ అస్త్రంతో కొట్టి.. దీని రిజల్ట్​ను బట్టి నెక్స్ట్ టెస్ట్​లో ఎలా వెళ్లాలో చూస్తున్నట్లు కనిపిస్తోంది. బంగ్లాను బురిడీ కొట్టించడంలో అతడు ఎంత వరకు విజయవంతం అవుతాడో చూడాలి. మరి.. బంగ్లాను చిత్తు చేసేందుకు ఏ పిచ్ అయితే పర్ఫెక్ట్​గా ఉంటుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి.