iDreamPost
android-app
ios-app

ఆ భారత ప్లేయర్‌ కోసం ప్లాన్‌ చేశాం కానీ, అతన్ని ఆపడం మా వల్ల కాలేదు: కోచ్‌

  • Published Jun 22, 2024 | 1:34 PM Updated Updated Jun 22, 2024 | 2:39 PM

Jonathan Trott, IND vs AFG, Jasprit Bumrah, T20 World Cup 2024: టీమిండియాలోని ఓ ప్లేయర్‌ కోసం గట్టి స్కెచ్‌ వేశామని.. అయినా కూడా మ్యాచ్‌లో అతన్ని ఆపలేకపోయాం అంటూ ఆఫ్ఘాన్‌ కోచ్‌ అన్నాడు. మరి ఆ భారత ప్లేయర్‌ ఎవరో ఏంటో ఇప్పుడు చూద్దాం..

Jonathan Trott, IND vs AFG, Jasprit Bumrah, T20 World Cup 2024: టీమిండియాలోని ఓ ప్లేయర్‌ కోసం గట్టి స్కెచ్‌ వేశామని.. అయినా కూడా మ్యాచ్‌లో అతన్ని ఆపలేకపోయాం అంటూ ఆఫ్ఘాన్‌ కోచ్‌ అన్నాడు. మరి ఆ భారత ప్లేయర్‌ ఎవరో ఏంటో ఇప్పుడు చూద్దాం..

  • Published Jun 22, 2024 | 1:34 PMUpdated Jun 22, 2024 | 2:39 PM
ఆ భారత ప్లేయర్‌ కోసం ప్లాన్‌ చేశాం కానీ, అతన్ని ఆపడం మా వల్ల కాలేదు: కోచ్‌

ఓ టీమిండియా క్రికెటర్‌ గురించి ఆఫ్ఘనిస్థాన్‌ హెడ్‌ కోచ్‌ ఆఫ్ఘనిస్థాన్ జోనాథన్ ట్రాట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అతని కోసం మ్యాచ్‌కి ముందు చాలా ప్రణాళికల గురించి మాట్లాడుకుని.. ఒక పక్కా ప్లాన్‌తో బరిలోకి దిగినా.. ఆ ప్లేయర్‌ను అడ్డుకోలేకపోయాం అంటూ పేర్కొన్నాడు. ఇంతకీ ట్రాట్‌ ఎవరి గురించి చెప్పాడో తెలుసా.. ఇంకెవరూ మన బూమ్‌ బూమ్‌ బుమ్రా గురించి. టీ20 వరల్డ్ కప్‌ 2024లో భాగంగా గురువారం టీమిండియా, ఆఫ్ఘనిస్థాన్‌ మధ్య సూపర్‌ 8 మ్యాచ్‌ జరిగిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌లో టీమిండియా 47 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

అయితే.. ఈ మ్యాచ్‌కి ముందు ఆఫ్ఘనిస్థాన్‌ ఓపెనర్‌ రెహమనుల్లా గుర్బాజ్‌.. బుమ్రా బౌలింగ్‌లో హిట్టింగ్‌ చేస్తానని, ఒక్క బుమ్రా అనే కాదు.. టీమిండియాలోని అందరి బౌలర్లను టార్గెట్‌ చేసి కొడతా అంటూ భారీ స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు. అన్నట్లుగానే తొలి ఓవర్‌లోనే ఒక సిక్స్‌, ఫోర్‌తో ఛేజింగ్‌ మొదలుపెట్టాడు. కానీ, ఆ నెక్ట్స్‌ ఓవర్‌లోనే బుమ్రా గుర్బాజ్‌ను అవుట్‌ చేసి పెవిలియన్‌కు పంపాడు. బుమ్రాను ఎదుర్కొవడమంటే.. స్టేట్‌మెంట్‌లు ఇచ్చినంత ఈజీగా కాదనే విషయం గుర్బాజ్‌కు బోధపడింది.

టీమిండియాతో మ్యాచ్‌కి ముందు బుమ్రాను ఎలా ఎదుర్కొవాలి అనే విషయంపై ఆఫ్ఘనిస్థాన్‌ టీమ్‌లో తీవ్ర చర్చ జరిగినట్లు ఆ జట్టు కోచ్‌ తెలిపాడు. ఆ ప్రణాళికల్లో భాగంగానే బుమ్రాపై ఒత్తిడి పెంచడానికి లేదా రెచ్చగొట్టడానికి గుర్బాజ్‌ ఆ కామెంట్ల చేసినట్లు తెలుస్తోంది. అయినా కూడా బుమ్రాను ఎలా ఎదుర్కొవాలో అని మేం వేసుకున్న ప్రణాళికలను మ్యాచ్‌లో సరిగ్గా అమలు చేయలేకపోయాం అంటూ ఆఫ్ఘాన్‌ కోచ్‌ ట్రాట్‌ వెల్లడించాడు. మ్యాచ్‌లో బుమ్రాను మరింత మెరుగ్గా ఎదుర్కొవాల్సిందిగా ఆయన ఒప్పుకున్నాడు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.