Nidhan
ఆఫ్ఘానిస్థాన్ జట్టు ఇప్పుడు ఫుల్ జోష్‌లో ఉంది. టీ20 వరల్డ్ కప్‌లో వరుస విక్టరీలతో ఆ టీమ్ దుమ్మురేపుతోంది. సూపర్-8కు క్వాలిఫై అయిన ఆఫ్ఘాన్.. బిగ్ టీమ్స్‌కు షాకిచ్చేందుకు సిద్ధమవుతోంది.
ఆఫ్ఘానిస్థాన్ జట్టు ఇప్పుడు ఫుల్ జోష్‌లో ఉంది. టీ20 వరల్డ్ కప్‌లో వరుస విక్టరీలతో ఆ టీమ్ దుమ్మురేపుతోంది. సూపర్-8కు క్వాలిఫై అయిన ఆఫ్ఘాన్.. బిగ్ టీమ్స్‌కు షాకిచ్చేందుకు సిద్ధమవుతోంది.
Nidhan
ఆఫ్ఘానిస్థాన్ జట్టు ఇప్పుడు ఫుల్ జోష్‌లో ఉంది. టీ20 వరల్డ్ కప్‌లో వరుస విక్టరీలతో ఆ టీమ్ దుమ్మురేపుతోంది. సూపర్-8కు క్వాలిఫై అయిన ఆఫ్ఘాన్.. బిగ్ టీమ్స్‌కు షాకిచ్చేందుకు సిద్ధమవుతోంది. మెగా టోర్నీ మొదలవడానికి ముందు ఆఫ్ఘాన్‌పై పెద్దగా ఎవరికీ అంచనాలు లేవు. వెస్టిండీస్, న్యూజిలాండ్ లాంటి బలమైన జట్లు ఉన్న గ్రూప్‌లో ఆ టీమ్ ఎంతవరకు నెగ్గుకొస్తుందనే అనుమానాలు ఉండేవి. కానీ రషీద్ సేన అద్భుతం చేసింది. ఆడిన మూడు మ్యాచుల్లోనూ నెగ్గి సూపర్-8కు అర్హత సాధించింది. తొలి మ్యాచ్‌లో ఉగాండాను చిత్తు చేసిన ఆఫ్ఘాన్ యోధులు.. రెండో మ్యాచ్‌లో కివీస్‌కు ఝలక్ ఇచ్చారు. ఆ తర్వాతి మ్యాచ్‌లో పపువా న్యూ గినియాను మట్టికరిపించారు. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్ విభాగం కూడా అద్భుతంగా రాణిస్తుండటంతో జట్టుకు ఎదురే లేకుండా పోయింది.
ఆఫ్ఘాన్ విజయాల్లో కెప్టెన్ రషీద్ కీలకంగా మారాడు. తన స్పిన్ మ్యాజిక్‌తో అతడు ప్రత్యర్థి బ్యాటర్లను వణికిస్తున్నాడు. ఆడిన మూడు మ్యాచుల్లో 6 వికెట్లు తీసిన రషీద్.. పరుగులు కూడా కట్టడి చేస్తూ అపోజిషన్ టీమ్స్‌ను భయపెడుతున్నాడు. అలాంటోడి పరువు తీశాడు ఫజల్హక్ ఫారుకీ. పీఎన్జీపై విజయం తర్వాత ఇంటర్వ్యూ ఇచ్చాడు ఫారుకీ. అయితే ఇంగ్లీష్ మాట్లాడేందుకు తడబడిన అతడు.. షటప్ అంటూ రషీద్ మీద సీరియస్ అయ్యాడు. ఫారుకీ మాట్లాడుతున్న తరుణంలో కెమెరాల పక్కన నిలబడి అతడ్ని ఆటపట్టించాడు రషీద్. దీంతో ఏం చేయాలో పాలుపోని ఫారుకీ నవ్వుల్లో మునిగిపోయాడు. అతడు తనను మాట్లాడనివ్వట్లేదని అన్నాడు. షటప్ అంటూ సీరియస్ కూడా అయ్యాడు. అయితే అతడు సరదాగానే ఆ మాట అన్నాడు.
రషీద్ పరువు తీశాడంటూ కొందరు ఫారుకీపై సీరియస్ అవుతున్నారు. అయితే వాళ్లిద్దరి మధ్య ఫ్రెండ్షిప్, సరదాగానే ఆ కామెంట్ చేశాడని తెలిసి లైట్ తీసుకున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్స్ ఆఫ్ఘాన్ ప్లేయర్ల మధ్య స్నేహానికి ఇది నిదర్శనమని అంటున్నారు. రషీద్ కెప్టెన్ అయినా.. ఫారుకీని ఆటపట్టించడం, అతడితో ఉన్న స్నేహం కారణంగా షటప్ అంటూ ఆ పేసర్ అనడం హైలైట్ అని చెబుతున్నారు. ఈసారి ఆప్ఘాన్ ఆట చూస్తుంటే వాళ్లు సెమీస్‌కు వెళ్లడం పక్కా అని ప్రిడిక్షన్ చెబుతున్నారు. స్లో పిచ్‌లపై ఆ జట్టు స్పిన్నర్లు, పేసర్లు చెలరేగుతుండటం, కండీషన్స్‌కు తగ్గట్లు బ్యాటర్లు రాణిస్తుండటం, న్యూజిలాండ్ లాంటి బడా టీమ్‌కు కూడా షాక్ ఇవ్వడంతో ఆఫ్ఘాన్‌పై ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. ఆ టీమ్ కోచ్ జొనాథన్ ట్రాట్ మాటలు కూడా ప్రత్యర్థులను భయపెడుతున్నాయి. తమ టీమ్ ఇంకా బెస్ట్ గేమ్ ఆడలేదని, ఆటగాళ్లలోని అత్యుత్తమ ప్రతిభ బయటకు వస్తే ఆపడం ఎవరి వల్లా కాదంటూ అతడు చేసిన కామెంట్స్ అపోజిషన్ టీమ్స్‌ను ఆందోళనకు గురిచేస్తున్నాయి. మరి.. ఆఫ్ఘాన్ ఆటతీరుపై మీ ఒపీనియన్‌ను కామెంట్ చేయండి.
Rashid Khan is sledging Fazalhaq Farooqi while he does his best to conduct an interview in English
“He is trying to make me laugh but I am not laughing”
He even told Rashid to “shut up” whilst on microphone 🤣#T20WorldCup #AFGvPNG pic.twitter.com/WTQZrJzDvU
— 🏏Flashscore Cricket Commentators (@FlashCric) June 14, 2024