SA vs AFG: కుప్పకూలిన ఆఫ్గాన్.. సఫారీ బౌలర్లకు దాసోహం!

టీ20 వరల్డ్ కప్ లోకి అండర్ డాగ్ గా బరిలోకి దిగిన ఆఫ్గానిస్తాన్.. అదే రేంజ్ లో ఆడుతూ, సెమీస్ కు చేరుకుంది. కానీ కీలకమైన సెమీ ఫైనల్ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా బౌలర్లకు దాసోహం అయ్యింది.

టీ20 వరల్డ్ కప్ లోకి అండర్ డాగ్ గా బరిలోకి దిగిన ఆఫ్గానిస్తాన్.. అదే రేంజ్ లో ఆడుతూ, సెమీస్ కు చేరుకుంది. కానీ కీలకమైన సెమీ ఫైనల్ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా బౌలర్లకు దాసోహం అయ్యింది.

టీ20 వరల్డ్ కప్ 2024లో సంచలనాలు నమోదు చేస్తూ.. సెమీస్ కు దూసుకొచ్చింది ఆఫ్గానిస్తాన్ జట్టు. కీలక మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై థ్రిల్లింగ్ విక్టరీని సాధించిన ఆ జట్టు.. సెమీ ఫైనల్ మ్యాచ్ లో మాత్రం దారుణంగా విఫలం అయ్యింది. గ్రూప్, సూపర్ 8 మ్యాచ్ ల్లో అద్భుత ప్రదర్శనతో అదరగొట్టిన ఆఫ్గాన్, సౌతాఫ్రికాతో జరుగుతున్న సెమీస్ లో చేతులెత్తేసింది. సఫారీ బౌలర్ల ధాటికి తట్టుకోలేక దాసోహం అయ్యింది. ప్రోటీస్ బౌలర్లు కలిసి కట్టుగా చెలరేగడంతో.. 11.5 ఓవర్లలో 56 పరుగులకే పేకమేడలా కుప్పకూలింది. దాంతో వరల్డ్ కప్ ఫైనల్ కు చేరాలన్న కల చెదిరినట్లు అయ్యింది.

టీ20 వరల్డ్ కప్ లోకి అండర్ డాగ్ గా బరిలోకి దిగిన ఆఫ్గానిస్తాన్.. అదే రేంజ్ లో ఆడుతూ, సెమీస్ కు చేరుకుంది. ఈ టోర్నీలో న్యూజిలాండ్, ఆస్ట్రేలియా లాంటి మేటి జట్లను ఓడించిన ప్రపంచ క్రికెట్ నే ఆశ్చర్యంలో ముంచెత్తింది. కానీ కీలకమైన సెమీ ఫైనల్లో మాత్రం తీవ్రంగా నిరాశపరిచింది. బ్రియన్ లారా స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది ఆఫ్గాన్. టోర్నీ ఆరంభం నుంచి అదిరిపోయే శుభారంభాలు ఇస్తున్న ఆఫ్గాన్ ఓపెనర్లు ముఖ్యమైన మ్యాచ్ లో విఫలం అయ్యారు. తొలి ఓవర్లోనే గుర్బాజ్(0)ను పెవిలియన్ కు పంపి షాకిచ్చిన మార్కో జాన్సన్, ఆ తర్వాతి ఓవర్లోనే గుల్బాదిన్ నైబ్(9)ను బౌల్డ్ చేశాడు.

ఇక ఇక్కడి నుంచి ప్రారంభం అయిన వికెట్ల పతనం ఏ దశలోనూ ఆగలేదు. జద్రాన్(2)ను రబాడ ఔట్ చేయగా.. ఆ తర్వాత వచ్చిన ఏ బ్యాటర్ కూడా క్రీజ్ లో పట్టుమని పది నిమిషాలు కూడా ఉండలేకపోయారు. ఓమర్జాయ్(10), నబీ(0), ఖరోట్(2), కరీం జనత్(8), రషీద్ ఖాన్(8), నూర్ అహ్మద్(0), నవీన్ ఉల్ హక్(2) వరుసగా తక్కువ స్కోర్లకే పెవిలియన్ చేరడంతో.. 11.5 ఓవర్లలోనే  ఆఫ్గాన్ 56 రన్స్ కు కుప్పకూలింది. సఫారీ బౌలర్లలో మార్కో జాన్సన్, తంబ్రైజ్ షంషీ తలా 3 వికెట్లు పడగొట్టారు. రబాడ, నోర్ట్జే చెరో 2 వికెట్లు తీశారు. దాంతో వరల్డ్ కప్ ఫైనల్లోకి వెళ్లాలన్న ఆఫ్గాన్ ల కల చెదిరింది.

Show comments