SNP
SNP
ప్రస్తుతం టీమిండియా ఫోకస్ అంతా మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న వన్డే వరల్డ్ కప్ పైనే ఉంది. అంతకంటే ముందు ఆస్ట్రేలియాతో మూడు వన్డేలు ఆడనుంది భారత జట్టు. వరల్డ్ కప్‌కి ముందు ఆస్ట్రేలియా లాంటి పెద్ద టీమ్‌తో మూడు వన్డేలు ఆడటం టీమిండియాకు మంచి ప్రాక్టీస్ అవుతుంది. ఈ నెల 22 నుంచి 27 వరకు భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డేల సిరీస్ జరగనుంది. అయితే.. ఈ సిరీస్‌లో యువ క్రికెటర్లకు ఎక్కువ గేమ్ టైమ్ ఇవ్వాలనే ఉద్దేశంతో కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు కీలక ఆటగాళ్లైన విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యాలకు రెస్ట్ ఇచ్చారు. రోహిత్, కోహ్లీ తొలి రెండు వన్డేలు ఆడరు. చివరిదైన మూడో వన్డే ఆడనున్నారు. ఈ సిరీస్ ముగిసిన వెంటనే వరల్డ్ కప్‌లో భాగంగా రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌లు కూడా ఉన్నాయి. అక్టోబర్ 5 నుంచి ప్రపంచ కప్ టోర్నీ ప్రారంభం కానుంది.
2011లో మహేంద్రసింగ్ ధోని సారథ్యంలో రెండో వన్డే వరల్డ్ కప్ నెగ్గిన టీమిండియా మళ్లీ కప్పును ముద్దాడలేదు. దీంతో ఈ సారి ఎలాగైన సరే ప్రపంచ కప్ గెలవాలనే కసితో ఉంది. పైగా ఈ వరల్డ్ కప్ మన దేశంలోనే జరుగుతుండటం టీమిండియాకు కలిసొచ్చే అంశం. 2011 వరల్డ్ కప్ సైతం ఇండియాలోనే జరిగిన విషయం తెలిసిందే. అయితే.. ప్రతిష్టాత్మక ఈ టోర్నీకి ఎంత పటిష్టమైన జట్టు ఉన్నా.. లాంగ్ టోర్నీలో టీమ్‌ను ప్రతిక్షణం మోటివేట్ చూస్తూ తగు సూచనలు ఇచ్చే మెంటర్లు కూడా ఉండాలని చాలా మంది క్రికెట్ నిపుణులు, మాజీ క్రికెటర్లు సైతం అభిప్రాయపడుతుంటారు.
తాజాగా ఆస్ట్రేలియా దిగ్గజ మాజీ క్రికెటర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. భారత వరల్డ్ కప్ టీమ్‌తో సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోని ఉండాల్సిన అవసరం ఉందని, జట్టుతో వారు కొంత సమయం గడిపేలా బీసీసీఐ అడగాలని అన్నాడు. వారిద్దరూ జట్టుతో ఉంటే టీమిండియాకు వరల్డ్ కప్ గెలిచే అవకాశాలు పెరుగుతాయని అభిప్రాయపడ్డాడు. ఇప్పటికే హెచ్ కోచ్ రూపంలో రాహుల్ ద్రవిడ్ లాంటి మాస్టర్ మైండ్ టీమిండియాలో భాగంగా ఉన్నాడు. అతనికి ధోని, సచిన్‌లు తోడైతే.. టీమిండియా ప్లస్ అవుతుందని అన్నాడు. అయితే.. 2021 టీ20 వరల్డ్ కప్‌లో ధోని టీమిండియాకు మెంటర్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. మరి సచిన్, ధోని.. వరల్డ్ కప్‌లో టీమిండియా మెంటర్లుగా వ్యవహరించాలని గిల్‌క్రిస్ట్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Adam Gilchrist said, “the BCCI should ask MS Dhoni and Sachin Tendulkar to spend time with the team India ahead of the World Cup”. pic.twitter.com/ZiuOvvWFvT
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 20, 2023
ఇదీ చదవండి: వరల్డ్ కప్: ICC కీలక నిర్ణయం! బ్యాటర్లకు బ్యాడ్ న్యూస్