iDreamPost
android-app
ios-app

పాకిస్తాన్ అత్యంత చెత్త టీమ్.. 35 ఏళ్లలో పీకిందేం లేదు: ఆస్ట్రేలియా దిగ్గజం

  • Published Jan 09, 2024 | 6:48 PM Updated Updated Jan 09, 2024 | 6:48 PM

పాకిస్తాన్ తో జరిగిన మూడు టెస్ట్ ల సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది ఆస్ట్రేలియా టీమ్. ఈ నేపథ్యంలో.. పాక్ జట్టుపై నిప్పులు కురిపించాడు ఆస్ట్రేలియా దిగ్గజం, మాజీ ప్లేయర్ ఆడమ్ గిల్ క్రిస్ట్.

పాకిస్తాన్ తో జరిగిన మూడు టెస్ట్ ల సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది ఆస్ట్రేలియా టీమ్. ఈ నేపథ్యంలో.. పాక్ జట్టుపై నిప్పులు కురిపించాడు ఆస్ట్రేలియా దిగ్గజం, మాజీ ప్లేయర్ ఆడమ్ గిల్ క్రిస్ట్.

పాకిస్తాన్ అత్యంత చెత్త టీమ్.. 35 ఏళ్లలో పీకిందేం లేదు: ఆస్ట్రేలియా దిగ్గజం

ఆస్ట్రేలియా-పాకిస్తాన్ మధ్య మూడు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ ముగిసిన విషయం తెలిసిందే. పాక్ ను చిత్తు చేసి.. సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది కంగారూ టీమ్. మూడు మ్యాచ్ ల్లో పాక్ దారుణమైన ప్రదర్శన కనబర్చింది. వరల్డ్ కప్ లో చూపెట్టిన చెత్త ఆటనే ఆసీస్ టూర్ లో చూపించింది దాయాది దేశం. మరీ ముఖ్యంగా ఫీల్డింగ్ లో అయితే.. గల్లీ క్రికెటర్లను తలపించింది. సింపుల్ క్యాచ్ లను కూడా వదిలేస్తూ.. తీవ్ర విమర్శలపాలైంది. ఇక ఈ సిరీస్ లో ఘోరమైన ఓటమిని చవిచూసిన పాకిస్తాన్ టీమ్ పై నిప్పులు కురిపించాడు ఆస్ట్రేలియా దిగ్గజం, మాజీ ప్లేయర్ ఆడమ్ గిల్ క్రిస్ట్. ఆసీస్ గడ్డపై ఆడిన ఆసియా దేశాల్లో పాకిస్తాన్ అంత చెత్త టీమ్ మరోటి లేదంటూ ఏకిపారేశాడు. కామెంట్రీ ప్యానల్ లో ఉన్న గిల్ క్రిస్ట్ మ్యాచ్ సందర్భంగా విమర్శలు గుప్పించాడు.

పాకిస్తాన్ తో జరిగిన మూడు టెస్ట్ ల సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది ఆతిథ్య కంగారూ టీమ్. తొలి టెస్ట్ నుంచే పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన ఆసీస్ టీమ్.. పాక్ ను ఏ దశలోనూ కోలుకోనివ్వలేదు. వారి ఫీల్డింగ్ బలహీనతలను క్యాష్ చేసుకుంటూ.. సిరీస్ ను ఎగరేసుకుపోయింది. ఇటీవల ముగిసిన వరల్డ్ కప్ లో సైతం పాక్ దారుణ ప్రదర్శన కనబర్చింది. నాకౌట్ చేరకుండానే ఇంటిదారి పట్టి తీవ్ర విమర్శలపాలైంది. ఇక ఆ మెగాటోర్నీ తర్వాత ఆస్ట్రేలియాతో తొలి సిరీస్ ఆడేందుకు కంగారూ గడ్డపై అడుగుపెట్టింది పాక్ టీమ్. వరల్డ్ కప్ లో చూపెట్టిన తీసిపోయే ప్రదర్శనే ఈ టెస్ట్ సిరీస్ లో ప్రదర్శించింది. దీంతో పాక్ జట్టుపై ముప్పేటా విమర్శలు గుప్పిస్తున్నారు లెజెండ్ క్రికెటర్స్. తాజాగా ఈ జాబితాలోకి వచ్చిచేరాడు ఆసీస్ దిగ్గజం, మాజీ ప్లేయర్ ఆడమ్ గిల్ క్రిస్ట్.

“సౌతాఫ్రికాతో జరిగిన టెస్టులో 15 నిమిషాల్లో 5 వికెట్లు కోల్పోయింది టీమిండియా. అప్పుడు వారిని మీరు విమర్శించారు. అయితే భారత జట్టు ఆ మ్యాచ్ గెలిచింది. మరి మీరు ఏం చేశారు? ఆస్ట్రేలియా చేతిలో ఘోరంగా ఓడిపోయారు. భారత్ ఆస్ట్రేలియా గడ్డపై రెండు సిరీస్ లు గెలుచుకుంది. కానీ మీరు గత 35 సంవత్సరాలుగా ఏం గెలిచారు? నేను ఇప్పటి వరకు చూసిన ఆసియా జట్లలో పాకిస్తాన్ అత్యంత చెత్త జట్టు. ఆసీస్ గడ్డపై పాక్ రికార్డు దరిద్రంగా ఉంది” అంటూ ఏకిపారేశాడు గిల్ క్రిస్ట్. ప్రస్తుతం అతడు చేసిన విమర్శలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరి గిల్ క్రిస్ట్ పాక్ జట్టుపై చేసిన విమర్శలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.