టీమిండియా తరఫున ఒకేసారి ముగ్గురు యువ క్రికెటర్ల అరంగేట్రం!

IND vs ZIM, Abhishek Sharma, Riyan Parag: జింబాబ్వేతో తొలి టీ20 మ్యాచ్‌తో ఏకంగా ముగ్గురు యువ క్రికెటర్లు టీమిండియా తరఫున అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. వారి గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

IND vs ZIM, Abhishek Sharma, Riyan Parag: జింబాబ్వేతో తొలి టీ20 మ్యాచ్‌తో ఏకంగా ముగ్గురు యువ క్రికెటర్లు టీమిండియా తరఫున అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. వారి గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

టీ20 వరల్డ్‌ కప్‌ 2024 గెలిచిన తర్వాత.. సీనియర్‌ స్టార్‌ క్రికెటర్లు విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ, రవీంద్ర జడేజా అంతర్జాతీయ టీ20 కెరీర్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. ఇకపై టీమిండియా టీ20 భవిష్యత్తు అంతా యువ క్రికెటర్ల చేతుల్లోనే ఉంది. దేశవాళి క్రికెట్‌తో పాటు ఐపీఎల్‌లో అదరగొడుతూ.. టీమిండియాలోకి ఎంట్రీ ఇవ్వకముందే స్టార్‌డమ్‌ను సాధించిన కొంతమంది ఆటగాళ్లు తాజాగా టీమిండియా తరఫున అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లోకి అరంగేట్రం చేశారు. మరి ఆ ముగ్గురు ఎవరు? ఇప్పటి వరకు ఏం సాధించారో చూద్దాం..

జింబాబ్వేతో ఐదు టీ20ల సిరీస్‌ ఆడేందుకు భారత యువ జట్టు అక్కడికి వెళ్లింది. ఈ జట్టుకు కెప్టెన్‌గా శుబ్‌మన్‌ గిల్‌, కోచ్‌గా వీవీఎస్‌ లక్ష్మణ్‌లు వ్యవహరించనున్నారు. అయితే.. జింబాబ్వేతో తొలి మ్యాచ్‌ను ఈ రోజు(శనివారం) ఆడుతుంది భారత యువ జట్టు. ఈ మ్యాచ్‌తో అభిషేక్‌ శర్మ, రియాన్‌ పరాగ్‌, ధృవ్‌ జురెల్‌ అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. ధృవ్‌ జురెల్‌ ఇప్పటికే భారత టెస్టు జట్టు తరఫున ఎంట్రీ మంచి ప్రదర్శన కూడా కనబర్చాడు. పరాగ్‌, అభిషేక్‌ శర్మ దేశవాళి క్రికెట్‌తో పాటు ఐపీఎల్‌లో దుమ్మురేపుతున్నారు.

సీనియర్లు రిటైర్మెంట్‌ ప్రకటించడం, మిగతా కీలక ఆటగాళ్లు టీ20 వరల్డ్‌ కప్‌ గెలిచి రెస్ట్‌ మూడ్‌లో ఉండటంతో యువ క్రికెటర్లకు టీమ్‌లో ప్లేస్‌ లభించింది. కోహ్లీ, రోహిత్‌ లాంటి స్టార్లు టీ20 క్రికెట్‌కు వీడ్కోలు పలకడంతో ఇక భవిష్యత్తు అభిషేక్‌, పరాగ్‌ లాంటి క్రికెటర్లదే అని అంతా భావిస్తున్నారు. రియాన్‌ పరాగ్‌ ఐపీఎల్‌ 69 మ్యాచ్‌లు ఆడి 1173 పరుగులు చేశాడు. ఆరంభంలో ఓవర్‌ యాక్షన్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్న ఆ తర్వాత అద్భుతమైన ఆటతో ఆ మచ్చను చెరిపేసుకున్నాడు. ఇక అభిషేక్‌ శర్మ లెఫ్ట్‌ హ్యాండర్‌ కమ్‌ ఓపెనింగ్‌ బ్యాటర్‌గా టీమిండియాకు భవిష్యత్తు స్టార్‌ కానున్నాడు. జైస్వాల్‌తో అభిషేక్‌కు గట్టి పోటీ ఉండొచ్చు. ఇక అభిషేక్‌ ఐపీఎల్‌లో 63 మ్యాచ్‌లు ఆడి 1376 పరుగులు చేశాడు. మరి ఈ ముగ్గురు క్రికెటర్లు అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లోకి ఒకేసారి ఎంట్రీ ఇవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments