Somesekhar
తన మెరుపు బ్యాటింగ్ తో ఈ ఐపీఎల్ సీజన్లో ప్రత్యర్థి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాడు ఓ చిచ్చర పిడుగు. ఆ యంగ్ సెన్సేషన్ పై ఇంగ్లండ్ దిగ్గజం మైఖేల్ వాన్ ప్రశంసల వర్షం కురిపించాడు. లారా టెక్నిక్, యువరాజ్ విధ్వంసం అతడి బ్యాటింగ్ లో ఉన్నాయంటూ కితాబిచ్చాడు.
తన మెరుపు బ్యాటింగ్ తో ఈ ఐపీఎల్ సీజన్లో ప్రత్యర్థి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాడు ఓ చిచ్చర పిడుగు. ఆ యంగ్ సెన్సేషన్ పై ఇంగ్లండ్ దిగ్గజం మైఖేల్ వాన్ ప్రశంసల వర్షం కురిపించాడు. లారా టెక్నిక్, యువరాజ్ విధ్వంసం అతడి బ్యాటింగ్ లో ఉన్నాయంటూ కితాబిచ్చాడు.
Somesekhar
ఐపీఎల్ 2024లో టీమిండియా యంగ్ క్రికెటర్లతో పాటుగా విదేశీ యువ ఆటగాళ్లు కూడా సత్తాచాటుతున్నారు. మరీ ముఖ్యంగా భారత యంగ్ స్టర్స్ కు ఈ ఐపీఎల్ సీజన్ కలిసొచ్చిందనే చెప్పాలి. ఈ సీజన్ లో అద్భుతంగా రాణించిన ఆటగాళ్లకు టీ20 వరల్డ్ కప్ లో చోటు కూడా లభించింది. అయితే ఈ ఐపీఎల్ లో ఓ యువ సంచలనం మాత్రం అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. తన మెరుపు బ్యాటింగ్ తో ప్రత్యర్థి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాడు. ఆ చిచ్చర పిడుగుపై ఇంగ్లండ్ దిగ్గజం మైఖేల్ వాన్ ప్రశంసల వర్షం కురిపించాడు.
శివమ్ దూబే, శశాంక్ సింగ్, అభిషేక్ శర్మ, నితీశ్ రెడ్డి లాంటి టీమిండియా యంగ్ ప్లేయర్లు ఈ ఐపీఎల్ సీజన్ లో దుమ్మురేపుతున్నారు. తమ మెరుపు బ్యాటింగ్ తో బౌలర్లకు వణుకు పుట్టిస్తున్నారు. మరీ ముఖ్యంగా సన్ రైజర్స్ ఓపెనర్ అభిషేక్ శర్మ తన హార్డ్ హిట్టింగ్ తో అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు. తొలి ఓవర్ నుంచే పవర్ హిట్టింగ్ చేస్తూ.. జట్టుకు మెరుపు ఆరంభాలు ఇస్తున్నాడు. దాంతో సన్ రైజర్స్ భారీ స్కోర్లు చేస్తూ.. ముందుకు సాగుతోంది. ఇక అభిషేక్ బ్యాటింగ్ స్టైల్ కు ఫిదా అయ్యాడు ఇంగ్లండ్ దిగ్గజం, మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్. అభిషేక్ ను లెజెండ్స్ తో పోలుస్తూ ప్రశంసించాడు.
“అభిషేక్ శర్మకు టీమిండియాలో గొప్ప భవిష్యత్ ఉంది. అతడు యశస్వీ జైస్వాల్ లాగే మూడు ఫార్మాట్స్ లో దుమ్మురేపగలడు. పైగా అతడికి ఉన్న టెక్నిక్ అమోఘం. అభిషేక్ బ్యాటింగ్ లో బ్రియాన్ లారా టెక్నిక్, స్టైల్ ఉన్నాయి. అలాగే యువరాజ్ సింగ్ విధ్వంసం, ఫ్లెక్సిబిలిటీ కూడా ఉన్నాయి. అతడిని త్వరలోనే టీమిండియా జట్టులో చూడొచ్చు. అభిషేక్ చూడముచ్చటైన షాట్లను చూస్తున్న కొద్ది చూడబుద్ది అవుతుంది” అంటూ యంగ్ సెన్సేషన్ పై ప్రశంసల వర్షం కురిపించాడు ఇంగ్లండ్ లెజెండ్ మైఖేల్ వాన్. ఈ దిగ్గజమే కాకుండా ఇంకా చాలా మంది అభిషేక్ ఆటకు ఫిదా అయ్యి, పొగడ్తల వర్షం కురిపించారు. ఇప్పటిదాకా ఆడిన 14 మ్యాచుల్లో కలిపి 209 స్ట్రైక్ రేట్‌తో 467 పరుగులు చేశాడు. ఆరెంజ్ క్యాప్ లిస్ట్‌లో టాప్-10లో మరి ఈ ఐపీఎల్ లో చిచ్చర పిడుగులా చెలరేగుతున్న అభిషేక్ శర్మ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Michael Vaughan ” Abhishek Sharma could easily do the same like Yashasvi Jaiswal across all three formats. His technical side is excellent. He has got Brian Lara-esque and Yuvraj Singh-type swing of the willow.”pic.twitter.com/gt9jCzV3tC
— Sujeet Suman (@sujeetsuman1991) May 20, 2024