SNP
Abhishek Sharma, Rohit Sharma, IND vs ZIM: రోహిత్ శర్మ తర్వాతి.. అతని ఓపెనింగ్ స్థానం కోసం పోటీ పడుతున్న యువ క్రికెటర్ అభిషేక్ శర్మ.. తాజాగా ఆ రోహిత్ రికార్డునే బ్రేక్ చేశాడు. మరి ఆ రికార్డ్ ఏంటో ఇప్పుడు చూద్దాం..
Abhishek Sharma, Rohit Sharma, IND vs ZIM: రోహిత్ శర్మ తర్వాతి.. అతని ఓపెనింగ్ స్థానం కోసం పోటీ పడుతున్న యువ క్రికెటర్ అభిషేక్ శర్మ.. తాజాగా ఆ రోహిత్ రికార్డునే బ్రేక్ చేశాడు. మరి ఆ రికార్డ్ ఏంటో ఇప్పుడు చూద్దాం..
SNP
టీ20 వరల్డ్ కప్ 2024 గెలిచి.. రోహిత్ శర్మ టీ20 ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పిన తర్వాత భారత క్రికెట్ అభిమానులు కంగారు పడ్డారు. రోహిత్ వెళ్లిపోతే.. టీమిండియా ఓపెనర్ ఎలా అంటూ దిగులుపడ్డారు. అయితే.. రోహిత్ అలా వెళ్లిపోగానే.. ‘నేనున్నానే నాయనమ్మా’ అంటూ అభిషేక్ శర్మ అనే కుర్రాడు రోహిత్ పేస్ కోసం పోటీకి వచ్చాడు. రోహిత్ పేస్‌కు నామినేషన్ వేయడమే కాదు.. కేవలం రెండో టీ20 మ్యాచ్‌తోనే రోహిత్ శర్మ రికార్డును బద్దులు కొట్టాడు. మరి ఆ రికార్డ్ ఏంటో వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం..
జింబాబ్వేతో హరారే వేదికగా ఆదివారం జరిగిన రెండో టీ20లో అభిషేక్ శర్మ సెంచరీతో చెలరేగాడు. 46 బంతుల్లోనే సెంచరీ మార్క్ అందుకుని ఔరా అనిపించాడు. అయితే.. ఈ సెంచరీతోనే కొత్త చరిత్ర లిఖించాడు అభిషేక్. అంతర్జాతీయ టీ20ల్లో ఇన్నింగ్స్‌ల పరంగా అత్యంత వేగంగా తొలి సెంచరీ చేసిన మొదటి భారత క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. జింబాబ్వేతో ఐదు టీ20 సిరీస్ కోసం ఎంపికైన అభిషేక్.. తొలి టీ20లో డకౌట్ అయ్యాడు. కానీ, రెండో టీ20లో అద్భుతమైన బ్యాటింగ్‌తో కేవలం 46 బంతుల్లోనే 7 ఫోర్లు, 8 సిక్సులతో సెంచరీ చేశాడు. సెంచరీ చేసిన తర్వాతి బంతికి అవుట్ అయ్యాడు. అయితే.. ఈ సెంచరీతో దీపక్ హుడా, కేఎల్ రాహుల్‌లను అభిషేక్ శర్మ అధిగమించాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లోకి అడుగుపెట్టిన మూడో మ్యాచ్‌లో దీపక్ హుడా సెంచరీ చేశాడు, అలాగే కేఎస్ రాహుల్ తన నాలుగో మ్యాచ్‌లో సెంచరీ కొట్టాడు. వీరిద్దరిని దాటేసి.. కేవలం రెండో మ్యాచ్‌లోనే సెంచరీ చేసిన ప్లేయర్‌గా అభిషేక్ నిలిచాడు.
ఇక అత్యంత వేగంగా టీ20 సెంచరీ చేసిన నాలుగో భారత ప్లేయర్‌గా రికార్డు సృష్టించాడు అభిషేక్. ఈ జాబితాలో 38 బంతుల్లో సెంచరీతో రోహిత్ శర్మ అగ్రస్థానంలో ఉండగా.. సూర్యకుమార్ యాదవ్(45), కేఎల్ రాహుల్(46) రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. తాజాగా అభిషేక్ శర్మ 46 బంతుల్లో సెంచరీ చేసి నాలుగో స్థానంలో నిలిచాడు. ఇక ఈ మ్యాచ్‌లో 8 సిక్స్‌లు బాదిన అభిషేక్ శర్మ.. ఈ ఏడాది ప్రొఫెషనల్ టీ20 క్రికెట్‌లో అత్యధిక సిక్స్‌లు బాదిన ఇండియన్ బ్యాటర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో రోహిత్ శర్మ రికార్డును అభిషేక్ శర్మ బ్రేక్ చేశాడు. ఈ ఏడాది 18 టీ20 మ్యాచ్‌లు ఆడిన అభిషేక్ శర్మ 50 సిక్స్‌లు బాదగా.. రోహిత్ శర్మ 25 మ్యాచ్‌ల్లో 46 సిక్స్‌లతో రెండో స్థానంలోకి వెళ్లాడు. 25 మ్యాచ్‌లే ఆడిన విరాట్ కోహ్లీ 45 సిక్స్‌లతో మూడో స్థానంలో కొనసాగుతుండం విశేషం. మరి అభిషేక్ శర్మ.. రోహిత్ శర్మ రికార్డును బ్రేక్ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Mentored by Yuvraj Singh. Got to his maiden T20I hundred with 3 sixes! 🤌
That’s Abhishek Sharma for you 🇮🇳 became the only Indian Batter to score a T20I 💯 against Zimbabwe 🇿🇼 #INDvsZIM #AbhishekSharma pic.twitter.com/WYk7JJImD5
— Richard Kettleborough (@RichKettle07) July 7, 2024