Virat Kohli: కోహ్లీని విమర్శించే స్థాయి మీకుందా? దిగ్గజాలపై ABD ఫైర్!

తాజాగా విరాట్ స్ట్రైక్ రేట్ పై వస్తున్న విమర్శలపై ఆర్సీబీ మాజీ ప్లేయర్, సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. కోహ్లీని విమర్శించే స్థాయి మీకుందా? అని ఘాటు వ్యాఖ్యలు చేశాడు.

తాజాగా విరాట్ స్ట్రైక్ రేట్ పై వస్తున్న విమర్శలపై ఆర్సీబీ మాజీ ప్లేయర్, సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. కోహ్లీని విమర్శించే స్థాయి మీకుందా? అని ఘాటు వ్యాఖ్యలు చేశాడు.

విరాట్ కోహ్లీ.. టీమిండియా రన్ మెషిన్ గా వరల్డ్ వైడ్ గా కోట్లాది అభిమానులను సంపాదించుకున్నాడు. ఇక ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ లో పరుగులు వరద పారిస్తున్నాడు. ఈ సీజన్ లో ఇప్పటి వరకు ఆడిన 10 మ్యాచ్ ల్లో 500 పరుగులు చేసి, లీడింగ్ స్కోరర్ల ప్లేయర్ల జాబితాలో రెండోప్లేస్ లో కొనసాగుతున్నాడు. అయితే ఈ ఐపీఎల్ లో కోహ్లీ స్ట్రైక్ రేట్ పై మాజీ క్రికెటర్లు, నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక ఆ విమర్శలపై కోహ్లీ కౌంటర్ కూడా ఇచ్చాడు. తాజాగా విరాట్ స్ట్రైక్ రేట్ పై వస్తున్న విమర్శలపై ఆర్సీబీ మాజీ ప్లేయర్, సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

ఈ ఐపీఎల్ సీజన్ లో అద్భుతంగా రాణిస్తున్నప్పటికీ విరాట్ కోహ్లీపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. స్లో బ్యాటింగ్ చేస్తున్నాడని, తక్కువ స్ట్రైక్ రేట్ తో ఆర్సీబీ ఓటములకు ఒక విధంగా కారణం అవుతున్నాడని క్రీడా దిగ్గజాలు విమర్శిస్తున్నారు. అయితే ఈ విమర్శలకు కోహ్లీ తన బ్యాట్ తోనే కౌంటర్ ఇస్తున్నాడు. ఇక తాజాగా ఈ విషయంపై ఘాటుగా స్పందించాడు సౌతాఫ్రికా మాజీ దిగ్గజం ఏబీ డివిలియర్స్. కోహ్లీని విమర్శించే స్థాయి మీకుందా? అసలు అతడు ఆడిన మ్యాచ్ ల్లో సగమైనా మీరు ఆడారా? అంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.

“ఈ సీజన్ లో విరాట్ కోహ్లీ స్ట్రైక్ రేట్ పై వస్తున్న విమర్శలు వినీ వినీ విసిగిపోయాను. దాంతో కాస్త ఘాటుగానే ఈ విషయంపై స్పందించాలని డిసైడ్ అయ్యా. వరల్డ్ లోనే బెస్ట్ ప్లేయర్లలో కోహ్లీ ఒకడు. ఈ విషయం అతడి గణాంకాలు చూస్తే అర్దమవుతుంది. కానీ ఇప్పుడు అతడి స్ట్రైక్ రేట్ గురించి విమర్శించే వారు అతడు ఆడిన మ్యాచ్ ల్లో పావు వంతైనా ఆడారా? అసలు వారు ఎన్ని మ్యాచ్ లు ఆడారు? ఐపీఎల్ లో ఎన్ని శతకాలు చేశారు? ఇలా అర్దం పర్దం లేకుండా మాట్లాడే వారికి క్రికెట్ పై కనీస అవగాహన ఉందా?” అని విమర్శించే వారిపై ప్రశ్నల వర్షం కురిపించాడు. ఇక ఈ సీజన్ లో 10 మ్యాచ్ లు ఆడిన ఆర్సీబీ కేవలం 3 విజయాలు సాధించి, మిగతా మ్యాచ్ ల్లో ఓడిపోయింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉంది. మరి విరాట్ కోహ్లీకి మద్ధతు ఏబీడీ నిలవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments