SNP
Aaron Finch, Rohit Sharma, Hardik Pandya: ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా ఉన్న హార్ధిక్ పాండ్యా కోసం మాజీ కెప్టెన్ అయిన రోహిత్ శర్మ ఆ పని చేసి ఉండాల్సిందని ఓ స్టార్ క్రికెటర్ అన్నాడు. మరి ఆ పనేంటో ఇప్పుడు చూద్దాం..
Aaron Finch, Rohit Sharma, Hardik Pandya: ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా ఉన్న హార్ధిక్ పాండ్యా కోసం మాజీ కెప్టెన్ అయిన రోహిత్ శర్మ ఆ పని చేసి ఉండాల్సిందని ఓ స్టార్ క్రికెటర్ అన్నాడు. మరి ఆ పనేంటో ఇప్పుడు చూద్దాం..
SNP
ముంబై ఇండియన్స్ టీమ్ ఈ ఐపీఎల్ సీజన్‌లో అత్యంత చెత్త ప్రదర్శన చేస్తోంది. ఇప్పటి వరకు 12 మ్యాచ్‌లు ఆడిన ఆ జట్టు కేవలం 4 విజయాలు మాత్రమే సాధించి.. ఈ సీజన్ నుంచి ఎలిమినేట్ అయిన తొలి టీమ్‌గా అత్యంత చెత్త రికార్డును కూడా మూటగట్టకుంది. అయితే ఇదంతా కెప్టెన్సీ మార్పు వల్లే అనే విమర్శలు వినిపిస్తున్నాయి. రోహిత్ శర్మ స్థానంలో హార్ధిక్ పాండ్యాను కెప్టెన్ చేయడం, పాండ్యా కెప్టెన్‌గా విఫలం కావడంతోనే ముంబై ఓడిపోతుందనే చాలా మంది అభిప్రాయపడుతున్నారు. రోహిత్ ప్లేస్‌లో పాండ్యాను కెప్టెన్‌గా చేసిన సమయంలో ముంబై ఇండియన్స్ మేనేజ్‌మెంట్‌పై, అలాగే హర్ధిక్ పాండ్యాపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ముఖ్యంగా పాండ్యాను దారుణంగా ట్రోల్ చేశారు.
తమ అభిమాన ప్లేయర్‌ను ఉన్నపళంగా కెప్టెన్సీ నుంచి తప్పించి, వేరే టీమ్ నుంచి వచ్చిన ప్లేయర్‌ను ఎలా కెప్టెన్ చేస్తారంటూ.. రోహిత్ శర్మ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఎంఐ మేనేజ్‌మెంట్, పాండ్యాపై విరుచుకుపడ్డారు. పాండ్యాను అయితే.. మ్యాచ్ జరుగుతున్న సమయంలోనూ బో అంటూ దారుణంగా ట్రోల్ చేశారు. భారత దేశంలో ఓ టీమిండియా ఆటగాడు పట్ల ఈ రేంజ్‌లో వ్యతిరేకత వ్యక్తం కావడంతో గతంలో ఎప్పుడూ జరగలేదని క్రికెట్ నిపుణులు పేర్కొన్నారు. ఇదే విషయంపై ఆస్ట్రేలియా మాజీ క్రికెట్ ఆరోన్ ఫించ్ మాట్లాడుతూ.. హార్ధిక్ పాండ్యా విషయంలో రోహిత్ శర్మ ఆ పని చేసి ఉండాల్సిందని అభిప్రాయపడ్డాడు. మరి రోహిత్ చేయాల్సిన పని ఏంటో ఇప్పుడు చూద్దాం..
ముంబై ఇండియన్స్ మేనేజ్‌మెంట్ రోహిత్ శర్మ ప్లేస్‌లో హార్ధిక్ పాండ్యాను కెప్టెన్‌గా చేసింది. ఇందులో పాండ్యా తప్పేం లేదు. కానీ క్రికెట్ అభిమానులు మాత్రం పాండ్యానే ఏదో పెద్ద తప్పు చేసినట్లు అతనిపై పడ్డారు. సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేశారు. స్టేడియంలో పాండ్యా కనిపించినా, అతని పేరు వినిపించినా.. బో అంటూ స్టేడియం మొత్తం మారుమోగిపోయేది. అయితే.. రోహిత్ శర్మ ఒక ప్రెస్‌మీట్ పెట్టి, లేక ఒక ట్వీట్.. ఇది కెప్టెన్సీ మార్పు అనేది ముంబై ఇండియ్స్ మేనేజ్‌మెంట్ తీసుకున్న నిర్ణయం.. నా ఫుల్ సపోర్ట్ హార్ధిక్ పాండ్యాకు ఉంటుందని ఒక్క మాట చెప్పి ఉంటే.. హార్ధిక్ పాండ్యాపై అంత ట్రోలింగ్ జరిగేది కాదని ఫించ్ అభిప్రాయపడ్డాడు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Aaron Finch ” Rohit Sharma should have come and said something publicly when Hardik Pandya was getting booed.He could have said that this was part of the Mumbai Indians plan and Hardik pandya has got my full support.”pic.twitter.com/jDll50G4HY
— Sujeet Suman (@sujeetsuman1991) May 11, 2024