iDreamPost
android-app
ios-app

వీడియో: అమెరికాలో పాక్‌ స్టార్‌ క్రికెటర్‌ పరువుతీసిన లేడీ ఫ్యాన్స్‌!

  • Published May 30, 2024 | 12:38 PM Updated Updated May 30, 2024 | 12:38 PM

Shadab Khan, Pakistan, T20 World Cup 2024: అమెరికా, వెస్టిండీస్‌ సంయుక్త వేదికగా జరిగే టీ20 వరల్డ్‌ కప్‌ కోసం పాక్‌ టీమ్‌ అమెరికాలో ల్యాండ్‌ అయింది. అమెరికా వీధుల్లో తిరుగుతున్న పాక్‌ ప్లేయర్‌ పరువుతీసింది ఓ లేడీ ఫ్యాన్‌. ఆ ఘటన గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

Shadab Khan, Pakistan, T20 World Cup 2024: అమెరికా, వెస్టిండీస్‌ సంయుక్త వేదికగా జరిగే టీ20 వరల్డ్‌ కప్‌ కోసం పాక్‌ టీమ్‌ అమెరికాలో ల్యాండ్‌ అయింది. అమెరికా వీధుల్లో తిరుగుతున్న పాక్‌ ప్లేయర్‌ పరువుతీసింది ఓ లేడీ ఫ్యాన్‌. ఆ ఘటన గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published May 30, 2024 | 12:38 PMUpdated May 30, 2024 | 12:38 PM
వీడియో: అమెరికాలో పాక్‌ స్టార్‌ క్రికెటర్‌ పరువుతీసిన లేడీ ఫ్యాన్స్‌!

టీ20 వరల్డ్‌ కప్‌ 2024 కోసం ఏకంగా ఆర్మీ ట్రైనింగ్‌ తీసుకొని మరీ అమెరికాకు వెళ్లింది పాకిస్థాన్‌ టీమ్‌. ఆ జట్టులో స్టార్‌ ప్లేయర్‌ అయిన షాదాబ్‌ ఖాన్‌.. తాజాగా అమెరికా వీధుల్లో చక్కర్లు కొట్టాడు. ఈ సమయంలోనే కొంతమంది పాకిస్థాన్‌ అభిమానులు అతన్ని చుట్టుముట్టి.. అతనితో ఫొటోలు దిగారు. ఇలా ఫొటోలు దిగుతూనే.. ఓ లేడీ ఫ్యాన్స్‌ షాదాబ్‌ ఖాన్‌ పరువుతీసింది. ఇంతకీ ఆమె ఏం చెప్పిందో ఇప్పుడు చూద్దాం.. గత కొంత కాలంగా షాదాబ్‌ సరైన ఫామ్‌లో లేడు. టీ20 వరల్డ్‌ కప్‌ 2024కి ముందు తాజాగా ఇంగ్లండ్‌తో ముగిసిన సిరీస్‌లోనూ విఫలం అయ్యాడు. ఇదే విషయాన్ని ఆమె ప్రస్తావిస్తూ.. ‘ఎందుకు మీరు సిక్సులు కొట్టించుకుంటున్నారు?.. ఫామ్‌లోకి తిరిగి రండీ’ అంటూ పేర్కొంది.

ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. షాదాబ్‌ ఖాన్‌ మంచి ఆల్‌రౌండర్‌ అనే విషయం తెలిసిందే. కానీ, కొంతకాలంగా తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. అందుకే ఆ లేడీ ఫ్యాన్‌ కూడా హర్ట్‌ అయినట్లు తెలుస్తోంది. అయితే.. ఎందుకు అన్ని సిక్సులు కొట్టించుకుంటున్నారు.. అని అనడమే ఇక్కడ నవ్వుతెప్పిస్తుంది. అయితే.. ఆమె చెప్పిన దానికి షాదాబ్‌ ఖాన్‌ ఏం మాట్లాడకుండా సైలెంట్‌గా ఉండిపోయాడు. కనీసం ఆమె చెప్పిన దానికి ఎలాంటి రియాక్షన్‌ కూడా ఇవ్వలేదు.

అయితే.. జూన్‌ 2 నుంచి ప్రారంభం కానున్న టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో పాకిస్థాన్‌ జట్టు జూన్‌ 6న అమెరికాతో తమ తొలి మ్యాచ్‌ ఆడనుంది. ఇక యావత్‌ క్రికెట్‌ ప్రపంచం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇండియా-పాకిస్థాన్‌ మ్యాచ్‌.. జూన్‌ 9న న్యూయార్క్‌లో జరగనుంది. ఈ మ్యాచ్‌ కోసం రెండు దేశాల క్రికెట్‌ అభిమానులే కాకుండా.. అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ టీ20 వరల్డ్‌ కప్‌ టోర్నీకే ఇండియా-పాకిస్థాన్‌ మ్యాచ్‌ హైలెట్‌గా నిలవనుంది. భారత్‌-పాక్‌ మ్యాచ్‌కు ఉండే క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మరి ఇండియా-పాకిస్థాన్‌ మ్యాచ్‌తో పాటు.. షాదాబ్‌ ఖాన్‌తో ఓ లేడీ ఫ్యాన్‌ అడిగిన ప్రశ్నపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

gamdomCasibomJojobet Girişmarsbahis girişGrandpashabet Giriş