iDreamPost
android-app
ios-app

వీడియో: హుక్కా తాగుతూ కనిపించిన ధోనీ.. వీడియోలో నిజమెంత?

  • Published Jan 07, 2024 | 1:24 PM Updated Updated Jan 07, 2024 | 1:24 PM

MS Dhoni Viral Video: టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీకి చెందిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. అయితే ఈ వీడియోపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

MS Dhoni Viral Video: టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీకి చెందిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. అయితే ఈ వీడియోపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

  • Published Jan 07, 2024 | 1:24 PMUpdated Jan 07, 2024 | 1:24 PM
వీడియో: హుక్కా తాగుతూ కనిపించిన ధోనీ.. వీడియోలో నిజమెంత?

టీమిండియా మాజీ కెప్టెన్.. మిస్టర్ కూల్ ఎంఎస్ ధోనీ మరోసారి వార్తల్లో నిలిచారు. అయితే ఈసారి క్రికెట్, ఫామ్ హౌస్, బైక్స్, వ్యాపారాలు, యాడ్స్ కి సంబంధించి కాదు. ఒక వివాదాస్పదమైన వీడియోలో ఎంఎస్ ధోనీ కనిపించాడు. హుక్కా తాగుతూ ఎంఎస్ ధోనీ కెమెరాకి చిక్కాడు. అందుకు సంబంధిచింన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఆ దృశ్యాలకు సంబంధించి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ధోనీ ఇలా ఎప్పుడూ చూడలేదంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ వీడియో విషయంలో కొన్ని అనుమానాలు, భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

ఎంఎస్ ధోనీ అనగానే కెప్టెన్ కూల్ అనే కాదు.. ఫిట్ నెస్ కూడా గుర్తొస్తుంది. ఇప్పటికీ ఐపీఎల్ లో ఆడుతున్నాడంటే ధోనీ ఫిట్ నెస్ గురించి, దానిపై ఆయనకున్న కమిట్మెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటి ధోనీకి సంబంధించిన హుక్కా తాగుతున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. అయితే ఇది ఎప్పుడు జరిగింది? ఎక్కడ జరిగింది? అనే సమాచారం మాత్రం స్పష్టంగా లేదు. కానీ, ఇటీవల జరిగిన విషయంలాగానే తెలుస్తోంది. ఈ వీడియోపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇది ఏదో యాడ్ షూట్ అయి ఉంటుందని కొందరు అభిమానులు కామెంట్ చేస్తున్నారు. అలాగే ఈ వీడియోలో సన్నీ సింగ్ కూడా ఉన్నట్లు కనిపిస్తున్నాడు. ఇటీవలే ఎంసీ స్టాన్ తో కలిసి ఎంస్ ధోనీ యాడ్ షూట్ లో పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ వీడియోలో ఉన్న స్మోక్ కూడా సింథటిక్ స్మోక్ అయి ఉంటుందని కామెంట్స్ వస్తున్నాయి.

అయితే మరికొందరు మాత్రం ఇది పంత్ సోదరి రిసెస్పషన్ సమయంలోది అంటున్నారు. ఎందుకంటే ఆ వైరల్ వీడియోలో, పంత్ ఫంక్షన్ లో ఒకే డ్రెస్ లో ధోనీ కనిపిస్తున్నాడు. అందుకే ఇది ఆ ఫంక్షన్ లోనే జరిగిన విషయంగా చెబుతున్నారు. మరికొంత మంది అభిమానులు మాత్రం ధోనీకి మద్దతుగా నిలుస్తున్నారు. ఇది పూర్తిగా అతని వ్యక్తిగత విషమని.. ఇలా వీడియోలు వైరల్ చేసి మరీ కామెంట్స్ చేయాల్సిన అవసరం లేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. కొందరు ధోనీపై పెదవి విరుస్తున్నారు. ఎంతో మందికి ఆదర్శంగా ఉన్న ధోనీ ఇలాంటి పనులు చేస్తే ఎలా అంటూ ప్రశ్నిస్తున్నారు? ఈ సందర్భంలోనే ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్, సీఎస్కే ఆటగాడు జార్జ్ బెయిలీ గతంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

జార్జ్ బెయిలీ ధోనీ గురించి మాట్లాడుతూ.. ధోనీకి హుక్కా తాగడం ఇష్టం అంటూ చెప్పుకొచ్చాడు. అతని గదిలో ఎప్పుడూ ఆ సెటప్ ఉంటుందని చెప్పాడు. అతనిదంతా ఓపెన్ డోర్ పాలసీ అని చెప్పుకొచ్చాడు. ఎవరైనా ఎప్పుడైనా వెళ్లి ధోనీ గదిలో క్రికెట్ గేమ్ గురించి మాట్లాడచ్చు అని తెలిపాడు. యంగ్ ప్లేయర్స్ ఎప్పుడూ ధోనీ గదిలో క్రికెట్ గేమ్ గురించి మరిన్ని ఆసక్తికర విషయాల గురించి చర్చిస్తూ కనిపిస్తారని చెప్పాడు. ప్రస్తుతం ఆ కామెంట్స్ కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అయితే ఎంఎస్ ధోనీ హుక్కా తాగుతున్న వీడియో నిజమా? యాడ్ షూటా? అసలు అది ఎక్కడ జరిగింది? అనే విషయాలపై మాత్రం ఎలాంటి క్లారిటీ లేదు. ధోనీ అభిమానులు మాత్రం అతనకి మద్దతుగా నిలుస్తున్నారు. మరి.. ఎంఎస్ ధోనీ వైరల్ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcioJojobet