వీడియో: పొలార్డ్‌ భారీ సిక్స్‌.. గాయపడిన అమ్మాయి! పొలార్డ్‌ ఏం చేశాడో చూడండి!

Kieron Pollard, MLC 2024: తాను కొట్టిన ఓ సిక్స్‌తో గాయపడిన అమ్మాయి కోసం పోలార్డ్‌ చేసిన పని టాక్‌ ఆఫ్‌ ది క్రికెట్‌ టౌన్‌గా మారింది. మ్యాచ్‌ మొత్తం ఒక ఎత్తు.. మ్యాచ్‌ తర్వాత పోలార్డ్‌ చేసింది ఒక ఎత్తు. ఇంతకీ అతను ఏం చేశాడో ఇప్పుడు చూద్దాం..

Kieron Pollard, MLC 2024: తాను కొట్టిన ఓ సిక్స్‌తో గాయపడిన అమ్మాయి కోసం పోలార్డ్‌ చేసిన పని టాక్‌ ఆఫ్‌ ది క్రికెట్‌ టౌన్‌గా మారింది. మ్యాచ్‌ మొత్తం ఒక ఎత్తు.. మ్యాచ్‌ తర్వాత పోలార్డ్‌ చేసింది ఒక ఎత్తు. ఇంతకీ అతను ఏం చేశాడో ఇప్పుడు చూద్దాం..

వెస్టిండీస్‌ విధ్వంసకర వీరుడు కీరన్‌ పోలార్డ్‌ కొట్టిన ఓ భారీ సిక్స్‌.. స్టేడియంలో మ్యాచ్‌ చూస్తున్న ఓ లేడీ క్రికెట్‌ ఫ్యాన్‌ను గాయపర్చింది. పోలార్డ్‌ కొట్టిన ఆ సిక్స్‌ నేరుగా మిడ్‌ వికెట్‌ మీదుగా దూసుకెళ్లి.. పోలార్డ్‌ టీమ్‌కు సపోర్ట్‌ చేస్తున్న లేడీ ఫ్యాన్‌ చేతికి తాకింది. ఈ ఘటన అమెరికాలో జరుగుతున్న మేజర్‌ లీగ్ క్రికెట్‌ 2024లో భాగంగా లాస్‌ ఏంజిల్స్‌ నైట్‌ రైడర్స్‌, ఎంఐ న్యూయార్క్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో చోటు చేసుకుంది. అయితే.. గాయపడిన అమ్మాయి కోసం పోలార్డ్‌ చేసిన పని ఇక్కడ హైలెట్‌గా మారింది. మరి అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

లాస్‌ ఏంజిల్స్‌ నైట్‌ రైడర్స్‌ బౌలర్‌ స్పెన్సర్ జాన్సన్ వేసిన ఇన్నింగ్స్‌ 15వ ఓవర్‌లో పోలార్డ్‌ తన విశ్వరూపం చూపిస్తూ.. ఏకంగా మూడు వరుస సిక్సులతో విరుచుకుపడ్డాడు. అందులో ఓ సిక్స్‌ స్టేడియంలో మ్యాచ్‌ చూస్తూ ఎంజాయ్‌ చేస్తున్న ఓ లేడీ ఫ్యాన్‌కు తగిలింది. ఆమె పోలార్డ్‌ ఆడుతున్న ఎంఐ టీమ్‌కే సపోర్ట్‌ చేస్తుంది. అయితే.. గాయపడిన అమ్మాయిని మ్యాచ్‌ తర్వాత పోలార్డ్‌ కలిసి సారీ చెప్పి.. తన ఆటోగ్రాఫ్‌ చేసిన క్యాప్‌ను ఇవ్వడంతో ఆ అమ్మాయి నొప్పి మర్చిపోయి.. మురిసిపోయింది. పోలార్డ్‌ చేసిన పనికి అతనిపై ప్రశంసలు కురుస్తున్నాయి.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసి లాస్‌ ఏంజిల్స్‌ నైట్‌ రైడర్స్‌ 19.1 ఓవర్లలో 130 పరుగులకే ఆలౌట్‌ అయింది. ఓపెనర్‌ జెసన్‌ రాయ్‌ 27, ఆండ్రీ రస్సెల్‌ 35 పరుగులతో రాణించారు. మిగతా బ్యాటర్లంతా విఫలం కావడంతో నైట్‌ రైడర్స్‌ జట్టు తక్కువ స్కోర్‌కే పరిమితం అయింది. ఇక 131 పరుగుల స్వల్ప టార్గెట్‌తో బరిలోకి దిగిన ఎంఐ 17 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 134 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్‌ డెవాల్డ్‌ బ్రెవిస్‌ 27, నికోలస్‌ పూరన్‌ 35, కీరన్‌ పోలార్డ్‌ 33 పరుగులు చేసి రాణించారు. మరి ఈ మ్యాచ్‌లో పోలార్డ్‌ సిక్స్‌కు ఆ అమ్మాయి గాయపడటం, అందుకు పోలార్డ్‌ మ్యాచ్‌ తర్వాత ఆ అమ్మాయిని పరామర్శించడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments