Virat Kohli: వీడియో: విరాట్‌ కోహ్లీ అభిమానికి సన్మానం! ఎందుకో తెలిస్తే షాక్‌ అవుతారు!

టీమిండియా సూపర్‌ స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ వీరాభిమానిని అతని స్నేహితులు పూల మాల వేసి ఘనంగా సన్మానించారు. అయితే.. ఆ అభిమానిని ఎందుకు సన్మానించారో తెలుసుకుంటే.. మీరూ ఆశ్చర్యపోతారు. ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు చూద్దాం..

టీమిండియా సూపర్‌ స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ వీరాభిమానిని అతని స్నేహితులు పూల మాల వేసి ఘనంగా సన్మానించారు. అయితే.. ఆ అభిమానిని ఎందుకు సన్మానించారో తెలుసుకుంటే.. మీరూ ఆశ్చర్యపోతారు. ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు చూద్దాం..

టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీకి ప్రపంచ వ్యాప్తంగా కొన్ని కోట్ల మంది క్రికెట్‌ అభిమానులున్నారు. కేవలం కోహ్లీ ఆట చూసేందుకే చాలా మంది స్టేడియానికి వస్తారంటే అతిశయోక్తి కాదు. కేవలం ఇండియాలోనే కాదు.. కోహ్లీ ప్రపంచంలో ఏ మూలన క్రికెట్‌ ఆడినా.. చూసేందుకు అభిమానులు ఎగబడుతుంటారు. కోహ్లీని అంతలా ఇష్టపడే క్రికెట్‌ ఫ్యాన్స్‌.. జీవితంలో ఒక్కసారైనా కోహ్లీని నేరుగా చూడాలని, అతనితో కలవాలని, మాట్లాడాలని, వీలైతే ఆటోగ్రాఫో, ఫొటోగ్రాఫో తీసుకోవాలని కలలు కంటారు. అలాంటి ఛాన్స్‌ వస్తే ఎగిరిగంతులేస్తారు. అయితే.. కొంతమంది అభిమానులను మాత్రం అలా ఫార్మల్‌గా కాకుండా చాలా మాస్‌గా కోహ్లీని కలుస్తుంటారు.

అది ఎలాగంటే.. మ్యాచ్‌ జరుగుతున్న సమయంలో బారిగేట్స్‌ దూకొచ్చి కోహ్లీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్లి అతని కాళ్లపై పడిపోతుంటారు. ఇలాంటి క్రేజీ అభిమానులను కోహ్లీకి కూడా నిరాశపర్చకుండా.. వారిని పైకి లేపి.. ఒక హగ్‌ ఇచ్చి మరీ పంపిస్తుంటాడు. అలాంటి సంఘటనే తాజాగా ఆఫ్ఘనిస్థాన్‌తో ఇండోర్‌ వేదికగా జరిగిన రెండో టీ20లో చోటు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లీ బౌండరీ లైన్‌ వద్ద ఫీల్డింగ్‌ చేస్తున్న సమయంలో ఒక వీరాభిమాని సడెన్‌గా దూసుకొచ్చి.. కోహ్లీ కాళ్లపై పడిపోయాడు.

అతన్ని పైకి లేపిన కోహ్లీ.. అతనికి ఒక హగ్‌ ఇచ్చి.. పంపించాడు. ఆ కుర్రాడిని సెక్యూరిటీ సిబ్బంది లాక్కెళ్తుంటే.. కాస్త జాగ్రత్త అంటూ కోహ్లీ వారికి చెప్పడం విశేషం. అయితే.. ఇప్పుడా కుర్రాడికి సన్మానం చేశారు. ఎందుకో తెలుసా..? విరాట్‌ కోహ్లీని హగ్‌ చేసుకున్నందుకు. అవును నిజం. కోహ్లీని అంత రిస్క్‌ చేసి హగ్‌ చేసుకున్నందుకు ఆ కుర్రాడిని అతని స్నేహితులు పూల మాల వేసి సన్మానించారు. ప్రస్తుతం ఈ సన్మానికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మరి ఈ సన్మానంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments