SNP
Virat Kohli, Kanpur Stadium, IND vs BAN: బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా సూపర్ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీకి ఓ వ్యక్తి ఊహించని షాకిచ్చాడు. మరి అదేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
Virat Kohli, Kanpur Stadium, IND vs BAN: బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా సూపర్ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీకి ఓ వ్యక్తి ఊహించని షాకిచ్చాడు. మరి అదేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
SNP
భారీ ఫ్యాన్ బేస్‌కి చిరునామా విరాట్ కోహ్లీ. మ్యాచ్ ఆడుతున్నా.. ప్రాక్టీస్ చేస్తున్నా.. బయట ఎక్కడైనా కనిపించినా.. ‘కోహ్లీ.. కోహ్లీ’ అంటూ అభిమానులు ఊగిపోతుంటారు. కానీ, కొంతమంది అభిమానులు మాత్రం.. కోహ్లీపై ఎక్స్‌ట్రీమ్ లవ్ అండ్ ఎఫెక్షన్‌ను చూపిస్తూ ఉంటారు. కొన్ని సార్లు ఆ ప్రేమ కోహ్లీని సైతం షాక్‌కు గురిచేస్తూ ఉంటుంది. తాజాగా అలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. ప్రాక్టీస్ కోసం వెళ్తున్న విరాట్ కోహ్లీకి ఓ అభిమాని ఊహించని షాకిచ్చాడు. బ్యాట్ పట్టుకొని.. గ్రౌండ్‌లోకి నడుచుకుంటూ వెళ్తున్న కోహ్లీ దగ్గరికి వేగంగా దూసుకొచ్చాడు. ఒక్కసారిగా కోహ్లీ కాళ్లపై పడిపోయాడు.. ఊహించని ఈ ఘటనతో కోహ్లీ ఒక్కసారిగా ఖంగుతిన్నాడు.
ఇలా క్రికెటర్ల కాళ్లు మొక్కడం అనే ఘటనలు గతంలో చాలానే జరిగాయి. సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోని, రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ కాళ్లను చాలా మంది క్రికెట్ అభిమానులు మొక్కారు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కూడా అయ్యాయి. తమ అభిమాన ఆటగాడిపై వారు చూపించే ఎఫెక్షన్ అలాంటిది. ఇప్పుడు బంగ్లాతో రెండో టెస్ట్ కంటే ముందు.. ఓ అభిమాని కోహ్లీపై అలాంటి ప్రేమాభిమానమే చూపించాడు. ఆ వ్యక్తి కాన్పూర్ గ్రౌండ్ స్టాఫ్‌గా పనిచేస్తుండటం విశేషం. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. కాన్పూర్ వేదికగా శుక్రవారం ప్రారంభమైన రెండో టెస్ట్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఫస్ట్ టెస్ట్ ఆడిన టీమ్‌తోనే బరిలోకి దిగాడు. వర్షం వచ్చే సూచనలు ఉండటంతో టాస్ గెలిచి.. బంగ్లాను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఆకాశ్ దీప్ ఆరంభంలోనే బంగ్లాదేశ్‌కు షాకిస్తూ.. ఆ జట్టు ఓపెనర్ జాకీర్ హసన్‌ను డకౌట్ చేశాడు. మొత్తంగా తొలి రోజు ఆట కేవలం 35 ఓవర్లు మాత్రమే సాగింది. వర్షం కారణంగా మ్యాచ్ త్వరగానే ముగిసింది. తొలి రోజు 35 ఓవర్ల ఆట తర్వాత బంగ్లాదేశ్ 3 వికెట్లు కోల్పోయి 107 పరుగులు చేసింది. మోమినుల్ 40, ముష్పికర్ రహీమ్ 6 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. మరి రెండో రోజు ఆట సాగే విధానం బట్టి.. మ్యాచ్‌పై ఎవరు పట్టు సాధిస్తారనే విషయం తెలుస్తుంది. మరి ఈ మ్యాచ్ కంటే ముందు కోహ్లీపై ఓ అభిమాని చూపించిన ప్రేమపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
VIRAT KOHLI – THE CROWD FAVOURITE.
– A groundstaff memeber touched Virat’s feet when he came to practice. 🥹❤️pic.twitter.com/MkC4zeewcO
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 27, 2024