iDreamPost
android-app
ios-app

హార్ధిక్‌ కాళ్లు మొక్కిన ఫ్యాన్! ఎవడీడు.. జూనియర్ ఆర్టిస్టా? అంటూ ట్రోల్స్

  • Published Mar 27, 2024 | 4:42 PM Updated Updated Mar 27, 2024 | 4:42 PM

Hardik Pandya, MI vs SRH, IPL 2024: బుధవారం హైదరాబాద్‌ వేదికగా ముంబై వర్సెస్‌ ఎస్‌ఆర్‌హెచ్‌ మ్యాచ్‌ జరగనుంది. ఈ మ్యాచ్‌లో కోసం ముంబై టీమ్‌ హైదరాబాద్‌ వచ్చింది. ఈ క్రమంలోనే ఓ కుర్రాడు హార్ధిక్‌ పాండ్యా కాళ్లు మొక్కాడు. దాని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

Hardik Pandya, MI vs SRH, IPL 2024: బుధవారం హైదరాబాద్‌ వేదికగా ముంబై వర్సెస్‌ ఎస్‌ఆర్‌హెచ్‌ మ్యాచ్‌ జరగనుంది. ఈ మ్యాచ్‌లో కోసం ముంబై టీమ్‌ హైదరాబాద్‌ వచ్చింది. ఈ క్రమంలోనే ఓ కుర్రాడు హార్ధిక్‌ పాండ్యా కాళ్లు మొక్కాడు. దాని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

  • Published Mar 27, 2024 | 4:42 PMUpdated Mar 27, 2024 | 4:42 PM
హార్ధిక్‌ కాళ్లు మొక్కిన ఫ్యాన్! ఎవడీడు.. జూనియర్ ఆర్టిస్టా? అంటూ ట్రోల్స్

ఇండియన్‌ క్రికెటర్స్‌లో హార్ధిక్‌ పాండ్యాపై జరిగినంత ట్రోలింగ్‌ మరే క్రికెటర్‌పై జరగలేదు. పాపం అతను ఏం చేసినా దానిపై ట్రోలింగ్‌కు గురి అవుతున్నాడు. కొన్ని సార్లు పాండ్యా చేసే పనులు అలాగే ఉంటాయి. కానీ, మరికొన్ని సార్లు అతని ఇన్‌వాల్‌మెంట్‌ లేకపోయినా.. కూడా ట్రోలింగ్‌ జరుగుతోంది. తాజాగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో మ్యాచ్‌ ఆడేందుకు ముంబై ఇండియన్స్‌ జట్టు హైదరాబాద్‌ వచ్చింది. ఈ క్రమంలోనే హార్ధిక్‌ పాండ్యాను ఓ కుర్రాడు కలిశాడు. అతను హార్ధిక్‌ పాండ్యాకు వీరాభిమాని. చేతిపై పాండ్యా ముఖచిత్రాన్ని టాటోగా కూడా వేయించుకున్నాడు. ఆ టాటోను పాండ్యాకు చూపించి, అతని కాళ్లు మొక్కాడు. వెంటనే పాండ్యా అతన్ని పైకి లేపి, అతనితో ఫొటో దిగాడు.

ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. గతంలో సచిన్‌ టెండూల్కర్‌, ధోని, విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ అభిమానులు ఇలా వాళ్ల కాళ్లు మొక్కేవాళ్లు. కొన్ని సార్లు గ్రౌండ్‌లోకి దూసుకొచ్చి మరీ.. ఈ స్టార​్‌ క్రికెటర్ల కాళ్లపై పడుతుంటారు అభిమానులు. ఇప్పుడు పాండ్యా విషయంలో కూడా అదే జరిగింది కానీ, అతనో జూనియర్‌ ఆర్టిస్ట్‌ అంటూ కొంతమంది ట్రోలింగ్‌కు దిగుతున్నారు. ‘ఎవడీడు ఓవర్‌ యాక్షన్‌ చేస్తున్నాడు? జూనియర్‌ ఆర్టిస్టా?’ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. పైగా ఈ ఘటన జరిగింది మన హైదరాబాద్‌లోనే కావడం విశేషం.

రోహిత్‌ శర్మ ప్లేస్‌లో కెప్టెన్‌ అయినప్పటి నుంచి హార్దిక్‌ పాండ్యాపై దారుణమైన ట్రోలింగ్‌ జరుగుతుంది. పైగా గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఓడిపోవడం, ఆ మ్యాచ్‌లో రోహిత్‌ శర్మను బౌండరీ లైన్‌ వద్ద ఫీల్డింగ్‌కు పంపడంతో పాండ్యాను అంతా తిట్టిపోస్తున్నారు. కానీ, హార్ధిక్‌ పాండ్యా కూడా చాలా పేద కుటుంబం నుంచి ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చిన ఆటగాడు. ఎంతో మంది యువతకు పాండ్యా జీవితం స్ఫూర్తిదాయకం. అందులో భాగంగా ఓ కుర్రాడు కూడా పాండ్యాను తన రోల్‌మోడల్‌గా తీసుకుని, అతని ఫొటోను టాటోగా వేయించుకున్నాడు. తన అభిమాన క్రికెటర్‌ను కలిసే అవకాశం రావడంతో ఆ సంతోషంలో పాండ్యా కాళ్లు మొక్కాడు. ఈ విషయం అర్థం కాక కొంతమంది పాండ్యాను, ఆ కుర్రాడిని ట్రోల్‌ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.