Cricket Facts: క్రికెట్‌లో ఎవ్వరూ నమ్మలేని నిజాలు! 7 ఇంట్రెస్టింగ్‌ ఫ్యాక్ట్స్‌

క్రికెట్‌లో ఒక ఆటగాడు సాధించిన రికార్డులు గురించి చాలా మందికి కొంత అవగాహన ఉండి ఉంటుంది. వాళ్లంతా పాపులర్‌ క్రికెటర్లు.. కానీ, క్రికెట్‌లో కొన్ని నమ్మలేని ఫ్యాక్ట్స్‌ లాంటి రికార్డులు ఉన్నాయి. వాటిలో ఓ 7 నమ్మలేని నిజాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

క్రికెట్‌లో ఒక ఆటగాడు సాధించిన రికార్డులు గురించి చాలా మందికి కొంత అవగాహన ఉండి ఉంటుంది. వాళ్లంతా పాపులర్‌ క్రికెటర్లు.. కానీ, క్రికెట్‌లో కొన్ని నమ్మలేని ఫ్యాక్ట్స్‌ లాంటి రికార్డులు ఉన్నాయి. వాటిలో ఓ 7 నమ్మలేని నిజాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

క్రికెట్‌లో ఎన్నో రికార్డులు నమోదు అవుతూ ఉంటాయి. క్రికెట్‌ సచిన్‌ టెండూల్కర్‌, విరాట్‌ కోహ్లీ లాంటి ఆటగాళ్లు క్రికెట్‌ చరిత్రలోనే కనీవినీ ఎరుగని రికార్డులను నెలకొల్పారు. ఓ ఆటగాడు వంద సెంచరీలు చేస్తాడని.. సచిన్‌ వంద సెంచరీలు చేయడానికి ముందు కనీసం ఎవరూ ఊహించి ఉండరు. కానీ, సచిన్‌ ఆ రికార్డును సాధించాడు. ఇప్పటికీ ఆ రికార్డు చెక్కుచెదరకుండా ఉంది. దాని దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు. మరో సచిన్‌గా పిలువబడే విరాట్‌ కోహ్లీ సైతం ప్రస్తుతం 80వ శతకం దగ్గరే ఉన్నాడు. కానీ, వన్డేల్లో మాత్రం కోహ్లీ సచిన్‌ను మించిపోయాడు. వన్డే క్రికెట్‌ చరిత్రలో ఏకంగా 50 సెంచరీలు చేసిన తొలి క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. వీటితో పాటు మరెన్నో రికార్డులు వివిధ ఆటగాళ్ల పేరిట ఉన్నాయి. కానీ, క్రికెట్‌లో కొన్ని ఇంట్రెస్టింగ్‌ ఫ్యాక్ట్స్‌ అయితే.. క్రికెట్‌ అభిమానులను ఆశ్చర్యపర్చుతాయి. ముఖ్యంగా ఈ ఏడు నిజాలు అయితే.. క్రికెట్‌ ఫ్యాన్స్‌ నమ్మడానికి కాస్త టైమ్‌ కూడా పట్టొచ్చు. ఇంతకీ ఆ ఏడు నమ్మలేని నిజాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఒకటో ఫ్యాక్ట్‌ ఏంటంటే.. టీ20 క్రికెట్‌లో అత్యధిక స్కోర్‌ గురించి. ఒక టీ20 మ్యాచ్‌లో అర్జెంటీనా ఉమెన్స్‌ టీమ్‌ ఏకంగా 427 పరుగులు చేసింది. ఇదే ఇప్పటి వరకు అత్యధిక టీ20 స్కోర్‌. రెండో నమ్మలేని నిజం ఏంటంటే.. టీమిండియా దిగ్గజ మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని కంటే న్యూజిలాండ్‌ బౌలర్‌ టిమ్‌ సౌథీ టెస్టుల్లో ఎక్కువ సిక్స్‌లు కొట్టాడు. ఇక మూడో ఫ్యాక్ట్‌ ఏంటంటే.. ప్రపంచ క్రికెట్‌లోనే గొప్ప స్పిన్‌ బౌలర్లలో ఒకడైన షేన్‌ వార్న్‌ గురించి. ఈ ఫ్యాక్ట​్‌ నిజంగా నమ్మడానికి కాస్త కష్టంగానే ఉంటుంది. అదేంటంటే.. దిగ్గజ బౌలర్‌ అయిన షేన్‌ వార్న్‌ కంటే సచిన్‌ టెండూల్కర్‌ వన్డేల్లో ఎక్కువ సార్లు ఐదు వికెట్ల హల్‌ సాధించాడు. ఇది విని మీరూ షాక్‌ అయ్యారు కదా. కానీ, ఇది నిజం. వన్డేల్లో షేన్‌ వార్న్‌కు కేవలం ఒకే ఒక్క ఐదు వికెట్ల హాల్‌ ఉంది. కానీ, సచిన్‌ రెండు సార్లు వన్డేల్లో ఈ ఫీట్‌ సాధించాడు.

క్రికెట్‌ అభిమానులను మరింత షాక్‌కు గురి చేసే నాలుగో ఫ్యాక్ట్‌ ఏంటంటే.. ఆస్ట్రేలియా స్టార్‌ బ్యాటర్‌ స్టీవ్‌ స్మిత్‌ టెస్ట్‌ క్రికెట్‌లో చేసిన 32 సెంచరీల్లో ఒక్కటి కూడా మ్యాచ్‌ నాలుగో ఇన్నింగ్స్‌లో చేయలేదు. అంటే.. టెస్ట్‌లో ఛేజింగ్‌ చేస్తూ సెంకడ్‌ ఇన్నింగ్స్‌లో స్మిత్‌ సెంచరీ చేయలేదు. ఐదో ఫ్యాక్ట్‌ ఏంటంటే.. టీమిండియా మాజీ క్రికెటర్‌ ఎంఎస్‌ ధోని.. ఆసియా ఖండం బయట ఆడిన ఒక్క మ్యాచ్‌లో కూడా సెంచరీ కొట్టలేదు. ఇక ఆరో ఫ్యాక్ట్‌ అయితే ఇంకా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఇంగ్లండ్‌ స్టార్‌ పేసర్‌ స్టువర్ట్‌ బ్రాడ్‌ ఆడిన టెస్టులు.. బంగ్లాదేశ్‌ టీమ్‌ ఆడిన మొత్తం టెస్టుల కంటే ఎక్కువ. ఇక లాస్ట్‌ది.. ఏడోవ ఇంట్రెస్టింగ్‌ ఫ్యాక్ట్‌ ఏంటంటే.. క్రికెట్‌ మక్కాగా పిలిచే ఇంగ్లండ్‌ లార్డ్స్‌ మైదానంలో దిగ్గజ బ్యాటర్లు అయిన సచిన్‌ టెండూల్కర్‌, రికీ పాంటింగ్‌, బ్రియన్‌ లారాల కంటే టీమిండియా బౌలర్‌ అజిత్‌ అగార్కర్‌కు ఎక్కువ సెంచరీలు ఉన్నాయి. ఇవన్నీ నమ్మేందుకు కాస్త కష్టంగా ఉన్నా.. ఇవన్ని నిజాలు. మరి ఈ ఇంట్రెస్టింగ్‌ ఫ్యాక్ట్స్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments