టీ20 వరల్డ్‌ కప్‌ ముందు డేంజర్‌ బెల్స్‌.. జైస్వాల్‌ వీక్‌నెస్‌ తెలిసిపోయింది!

Yashasvi Jaiswal, RR vs PBKS, IPL 2024: టీ20 వరల్డ్‌ కప్‌కి ముందు టీమిండియా క్రికెట్‌ అభిమానులను ఓ విషయం కలవరపెడుతోంది. అది కూడా యశస్వి జైస్వాల్‌ గురించి.. అదేంటో ఇప్పుడు చూద్దాం..

Yashasvi Jaiswal, RR vs PBKS, IPL 2024: టీ20 వరల్డ్‌ కప్‌కి ముందు టీమిండియా క్రికెట్‌ అభిమానులను ఓ విషయం కలవరపెడుతోంది. అది కూడా యశస్వి జైస్వాల్‌ గురించి.. అదేంటో ఇప్పుడు చూద్దాం..

ఐపీఎల్‌ 2024లో భాగంగా రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ విజయం సాధించింది. బుధవారం గౌహతిలోని బర్సపరా క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో విజయంతో పంజాబ్‌ ఈ సీజన్‌లో ఐదో విజయం సాధించింది. కాగా ఈ విజయంతో పంజాబ్‌కు వచ్చిందేమీ లేదు. కానీ, రాజస్థాన్‌కు కాస్త నష్టం జరిగిందనే చెప్పాలి. ఎందుకంటే.. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే.. ఆర్‌ఆర్‌ రెండో ప్లేస్‌లో ప్లే ఆ‍ఫ్స్‌కు వెళ్లేది. ఇక ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌ జైస్వాల్‌ ఆడిన తీరు.. రాజస్థాన్‌ ఫ్యాన్స్‌కే కాదు. మొత్తం టీమిండియా అభిమానులనే కంగారు పెడుతోంది.

యశస్వీ జైస్వాల్ టీ20 వరల్డ్‌ కప్‌ 2024 కోసం భారత జట్టుకు ఎంపికయ్యాడు. రోహిత్‌ శర్మతో ఓపెనర్‌గా బరిలోకి దిగనున్నాడు. కానీ మెల్లమెల్లగా అతని వీక్‌నెస్‌ ఏంటో బయటపడుతోంది. ప్రత్యర్థి జట్లు జైస్వాల్‌ బలహీనతను ఢీ‌కోడ్ చేస్తున్నాయి. జైస్వాల్‌ ఎక్కువగా ఎడమ చేతి వాటం బౌలర్ల చేతిలోనే అవుట్‌ అవుతున్నాడు. జైస్వాల్‌ బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో ప్రత్యర్ధి జట్లు లెఫ్ట్ఆర్మ్ ఫాస్ట్ బౌలర్లతోనే బౌలింగ్‌ చేయిస్తున్నారు. ఈ సీజన్‌లో లెఫ్ట్‌ ఆర్మ్‌ ఫాస్ట్‌ బౌలర్ల చేతిలో జైస్వాల్ ఏకంగా ఆరు సార్లు అవుటై.. పెవిలియన్‌ చేరాడు.

ఈ సీజన్‌లో లెఫ్ట్‌ ఆర్మ్‌ పేసర్లు 72 బంతులు ఎదుర్కొన్న జైస్వాల్ 16 సగటుతో 99 పరుగులు సాధించాడు. 29 డాట్‌ బాల్స్‌ ఉన్నాయి. అందులోనే ఆరు సార్లు అవుట్‌ అయ్యాడు. పంజాబ్‌ కింగ్స్‌ కెప్టెన్‌ సామ్‌ కరన్‌ కూడా జైస్వాల్ బలహీనతను గ్రహించి.. అవుట్‌ సైడ్‌ ది ఆఫ్‌ సైడ్‌ బంతులు వేసి జైస్వాల్‌ను నాలుగో బంతికి అవుట్‌ చేశాడు. ఈ బలహీనతను జైస్వాల్‌ వీలైనంత త్వరగా అధిగమించాలని క్రికెట్‌ అభిమానులు కోరుకుంటున్నారు. లేదంటే.. టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో టీమిండియా ఇబ్బందులు తప్పవని అంటున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments