iDreamPost

IND vs USA: అమెరికాపై టీమిండియా విజయానికి 5 ప్రధాన కారణాలు!

  • Published Jun 13, 2024 | 10:38 AMUpdated Jun 13, 2024 | 10:38 AM

IND vs USA, T20 World Cup 2024: అమెరికాపై విజయం సాధించి.. గ్రూప్‌ దశలో మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే టీమిండియా సూపర్‌ 8కు అర్హత సాధించింది. మరి అమెరికాపై విజయానికి కారణమైన 5 ప్రధాన అంశాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

IND vs USA, T20 World Cup 2024: అమెరికాపై విజయం సాధించి.. గ్రూప్‌ దశలో మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే టీమిండియా సూపర్‌ 8కు అర్హత సాధించింది. మరి అమెరికాపై విజయానికి కారణమైన 5 ప్రధాన అంశాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Jun 13, 2024 | 10:38 AMUpdated Jun 13, 2024 | 10:38 AM
IND vs USA: అమెరికాపై టీమిండియా విజయానికి 5 ప్రధాన కారణాలు!

టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో టీమిండియా వరుసగా మూడో విజయం సాధించింది. బుధవారం న్యూయార్క్‌ వేదికగా యూఎస్‌ఏతో జరిగిన మ్యాచ్‌లో రోహిత్‌ సేన 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో టీమిండియా సూపర్‌ 8కు క్వాలిఫై అయిపోయింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా స్టార్‌ బ్యాటర్లు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ విఫలమైనా.. సూర్య, దూబే రాణించి గెలిపించారు. అంతకు ముందు బౌలింగ్‌లో అర్షదీప్‌ సింగ్‌ దుమ్మురేపాడు. మరి పసికూన అమెరికాపై టీమిండియా విజయం సాధించడానికి దోహదం చేసిన ఐదు ప్రధాన అంశాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

1. బౌలింగ్‌
టీ20 వరల్డ్‌ కప్‌లో భారత్‌ ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్‌లను కూడా న్యూయార్క్‌లోనే ఆడింది. ఈ మూడు మ్యాచ్‌లు బౌలింగ్‌ బలంతోనే నెగ్గిన రోహిత్‌ శర్మ. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన అమెరికాను 110 పరుగులకే కట్టడి చేసి.. భారత బౌలర్లు టీమిండియాకు 70 శాతం విజయం ఖరారు చేశారు. అర్షదీప్‌ సింగ్‌, హార్ధిక్‌ పాండ్యా అద్భుతంగా బౌలింగ్‌ చేశారు. ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలిచిందంటే బౌలింగ్‌ ప్రధాన కారణం.

2. పిచ్‌ కండీషన్స్‌
న్యూయార్క్‌లోని నసావు పిచ్‌ బ్యాటింగ్‌కు చాలా కష్టంగా ఉంది. ఈ పిచ్‌పై టీమిండియా బ్యాటర్లు పూర్తిగా తేలిపోతున్నారు. పాక్‌పై 119 పరుగులు మాత్రమే చేసిన విషయం తెలిసిందే. ఐర్లాండ్‌ 97, ఇప్పుడు యూఎస్‌ఏపై 111 పరుగులు ఛేజ్‌ చేశారు. అయితే.. పిచ్‌ కండీషన్స్‌ను ఉపయోగించుకుంటూ టీమిండియా బౌలర్లు మంచిగా బౌలింగ్‌ చేయడం, తర్వాత బ్యాటింగ్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌, శివమ్‌ దూబే నిదానంగా టైమ్‌ తీసుకొని ఆడటంతో విజయం సులువైంది.

3. టాస్‌
ఈ మ్యాచ్‌లో టీమిండియా విజయానికి​ పూర్తిగా కాకపోయినా.. టాస్‌ కూడా కీలకంగా వ్యవహరించింది. పాకిస్థాన్‌తో మ్యాచ్‌ ఓడి.. తొలుత బ్యాటింగ్‌కు దిగి 119 పరుగులకే కుప్పకూలిన ఇండియా.. ఈ మ్యాచ్‌లో మాత్రం టాస్‌ నెగ్గి ఛేజింగ్‌ చేసింది. ఈ పిచ్‌లో ఛేజింగ్‌ కాస్త బెటర్‌ అనిపించడంతో రోహిత్‌ శర్మ ఛేజింగ్‌ తీసుకున్నాడు. పాక్‌ బ్యాటింగ్‌లో పూర్తిగా విఫలం కావడం, టీమిండియా కట్టుదిట్టమైన బౌలింగ్‌ చేయడంతో ఛేజింగ్‌ చేసినా పాక్‌ మనపై గెలవలేకపోయింది. కానీ, ఇప్పుడు రోహిత్‌ సేన ఆ తప్పు చేయలేదు.

4. సూర్య-దూబే పార్ట్నర్‌షిప్‌
ఈ మ్యాచ్‌లో 111 పరుగులు ఛేజ్‌ చేస్తూ కూడా టీమిండియా కాస్త తడబడిందనే చెప్పాలి. విరాట్‌ కోహ్లీ డకౌట్‌, రోహిత్‌ శర్మ 3 రన్స్‌ మాత్రమే చేసి అవుట్‌ అయ్యారు. కానీ, సూర్యకుమార్‌ యాదవ్‌, శివమ్‌ దూబే తన సహజ శైలిని పక్కనపెట్టి.. స్లోగా ఆడి టీమిండియాను గెలిపించారు. సూర్య 50, దూబే 31 పరుగులు చేసి మంచి పార్ట్నర్‌సిప్‌ను నెలకొల్పారు. ఇది టీమిండియా విజయాన్ని సులువు చేసింది.

5. అర్షదీప్‌ సింగ్‌
అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో ఎక్కువ క్రెడిట్‌ ఇవ్వాల్సింది టీమిండియా యువ బౌలర్‌ అర్షదీప్‌ సింగ్‌కు అద్భుతమైన బౌలింగ్‌తో యూఎస్‌ఏను కుప్పకూల్చాడు. 4 ఓవర్లలో కేవలం 9 పరుగులు మాత్రమే ఇచ్చి.. 4 వికెట్లు పడగొట్టి అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చాడు. అమెరికాపై టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. మరి యూఎస్‌ఏపై టీమిండియా గెలుపునకు దోహదం చేసిన ఈ ఐదు ప్రధాన కారణాలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి