iDreamPost

క్వాలిఫైయర్‌-2లో అదరగొట్టిన SRH.. విజయానికి 5 ప్రధాన కారణాలు!

  • Published May 25, 2024 | 8:46 AMUpdated May 25, 2024 | 8:46 AM

SRH vs RR, IPL 2024, Qualifier 2: రాజస్థాన్‌తో జరిగిన క్వాలిఫైయర్‌ 2లో గెలిచిన సన్‌రైజర్స్‌ ఫైనల్‌కు దూసుకెళ్లింది. అయితే.. ఈ మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ విజయానికి కారణమైన ఐదు ప్రధాన అంశాలేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

SRH vs RR, IPL 2024, Qualifier 2: రాజస్థాన్‌తో జరిగిన క్వాలిఫైయర్‌ 2లో గెలిచిన సన్‌రైజర్స్‌ ఫైనల్‌కు దూసుకెళ్లింది. అయితే.. ఈ మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ విజయానికి కారణమైన ఐదు ప్రధాన అంశాలేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

  • Published May 25, 2024 | 8:46 AMUpdated May 25, 2024 | 8:46 AM
క్వాలిఫైయర్‌-2లో అదరగొట్టిన SRH.. విజయానికి 5 ప్రధాన కారణాలు!

ఐపీఎల్‌ 2024లో భాగంగా క్వాలిఫైయర్‌-2లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఘన విజయం సాధించింది. చెన్నైలోని చిదంబరం క్రికెట్‌ స్టేడియంలో శుక్రవారం రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ 36 పరుగుల తేడాతో గెలిచి.. ఫైనల్‌కు దూసుకెళ్లింది. తొలి క్వాలిఫైయర్‌లో కేకేఆర్‌ చేతిలో ఓడినా.. ఉన్న మరో ఛాన్స్‌ను అద్భుతంగా వాడుకుని.. ఫైనల్‌ పోరుకు అర్హత సాధించింది. ఈ నెల 26న అంటే ఆదివారం ఇదే స్టేడియంలో కేకేఆర్‌తో టైటిల్‌ కోసం తలపడనుంది ఎస్‌ఆర్‌హెచ్‌. మరి రాజస్థాన్‌ రాయల్స్‌పై క్వాలిఫైయర్‌-2లో ఎస్‌ఆర్‌హెచ్‌ విజయానికి కారణమైన ఐదు ప్రధాన అంశాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

1. పవర్‌ ప్లే హిట్టింగ్‌
ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌.. పిచ్‌ కాస్త స్పిన్‌కు అనుకూలిస్తూ, బ్యాటింగ్‌కు టఫ్‌గా ఉంటుందని భావించిన ఎస్‌ఆర్‌హెచ్‌ ఓపెనర్లు.. తమకు అలవాటైన హిట్టింగేనే ఇక్కడ కూడా ఉపయోగించారు. అది సూపర్‌ సక్సెస్‌ అయింది. వేగంగా ఆడే క్రమంలో అభిషేక్‌ శర్మ 5 బంతుల్లో 12 పరుగులు చేసి అవుటైనా.. ట్రావిస్‌ హెడ్‌, రాహుల్‌ త్రిపాఠి.. పవర్‌ ప్లేలో మంచి స్కోర్‌ సాధించారు. ఒక వైపు వికెట్లు పడినా.. సన్‌రైజర్స్‌ 10 ఓవర్లలో నే 99 పరుగులు చేసింది. తొలి నుంచి స్టోగా ఆడి ఉంటే.. చాలా తక్కువ స్కోర్‌ వచ్చేది. అలా కాకుండా పవర్‌ ప్లేను వీలైనంత బాగా యూజ్‌ చేసుకోవడం ప్లస్‌ అయింది.

2. క్లాసెన్‌ ఇన్నింగ్స్‌
57 పరుగుల వద్ద మార్కరమ్‌ మూడో వికెట్‌గా అవుటైన తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన హెన్రిచ్‌ క్లాసెన్‌ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో ఎస్‌ఆర్‌హెచ్‌ను ఆదుకున్నాడు. 34 బంతుల్లో 50 పరుగులు చేసి అదరగొట్టాడు. సాధారణంగా ఫోర్లు సిక్సులతో విరుచుకుపడే క్లాసెన్‌.. ఈ మ్యాచ్‌లో మాత్రం కాస్త ఆచీతూచి ఆడి కీలక ఇన్నింగ్స్‌ నిర్మించాడు. అతనితో పాటు రాహుల్‌ త్రిపాఠి ఇన్నింగ్స్‌ కూడా ఎస్‌ఆర్‌హెచ్‌ స్కోర్‌లో కీలక పాత్ర పోషించింది. వీరిద్దరు ఆదుకోకపోయి ఉంటే.. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు అంత స్కోర్‌ వచ్చి ఉండేది కాదు.

3. బౌలింగ్‌
ఈ మ్యాచ్‌ సన్‌రైజర్స్‌ గెలిచి ఫైనల్‌కు దూసుకెళ్లింది అంటే ఆ క్రెడిట్‌ బౌలింగ్‌ డిపార్ట్‌మెంట్‌కు ఇవ్వాలి. బ్యాటింగ్‌ బలంతోనే ఈ సీజన్‌లో నెట్టుకొచ్చిన ఎస్‌ఆర్‌హెచ్‌.. కీలక సమయాల్లో బౌలింగ్‌ పదును కూడా చూపించింది. ఈ మ్యాచ్‌లో భువనేశ్వర్‌ కుమార్‌ ఒక్కడే కాస్త ఎక్స్‌పెన్సీవ్‌గా ప్రూవ్‌ అయ్యాడు. కమిన్స్‌, నటరాజ్‌, జయదేవ్‌ ఉనద్కట్‌, షాబాజ్‌ అహ్మద్‌, అభిషేక్‌ శర్మ అద్భుతంగా బౌలింగ్‌ వేశాడు. షాబాజ్‌ 3, అభిషేక్‌ 2, కమిన్స్‌, నటరాజన్‌ చెరో వికెట్‌ పడగొట్టారు. నటరాజన్‌ 3 ఓవర్లలో కేవలం 13 రన్స్‌ మాత్రమే ఇవ్వడం విశేషం.

4. కమిన్స్‌ కెప్టెన్సీ
ఇక సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ను ఎంత మెచ్చుకున్న తక్కువే. సరైన టైమ్‌లో బౌలింగ్‌ ఛేజెంస్‌ చేస్తూ.. టీమ్‌ను అద్భుతంగా ముందుకు నడిపించాడు. పిచ్ కండీషన్స్‌కు తగ్గట్లు పార్ట్‌టైమ్‌ బౌలర్లతోనే ఫుల్‌ కోటా బౌలింగ్‌ వేయించి అద్భుత ఫలితాలు రాబట్టాడు. అభిషేక్‌ శర్మతో బౌలింగ్‌ వేయించాలని కెప్టెన్‌గా కమిన్స్‌ తీసుకున్న నిర్ణయం ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌కు విజయం అదించిందని చెప్పాలి. బౌలింగ్‌కు తగ్గట్లు ఫీల్డింగ్‌ సెట్‌ చేయడంలో కూడా కెప్టెన​్‌ కమిన్స్‌ సూపర్‌ సక్సెస్‌ అయ్యాడు.

5. స్పిన్నర్లు
చెన్నై పిచ్‌ అంటేనే స్పిన్నర్లకు స్వర్గధామం లాంటిది. కానీ, ఈ పిచ్‌పై కూడా ఎలాంటి బౌలింగ్‌ చేయాలో తెలిసుండాలి. రాజస్థాన్‌ వద్ద కూడా రవిచంద్రన్‌ అశ్విన్‌, యుజ్వేంద్ర చాహల్‌ లాంటి మేటి స్పిన్నర్లు ఉన్నా.. వారు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. స్పిన్‌కు అనుకూలించే పిచ్‌పై వారిద్దరికి ఒక్కటంటే ఒక్క వికెట్‌ కూడా దక్కలేదు. వాళ్లిద్దరిని ఎస్‌ఆర్‌హెచ్‌ బ్యాటర్లు పక్కా ప్లాన్‌ ప్రకారం సమర్థవంతంగా ఎదురుకున్నారు. కానీ, సన్‌రైజర్స్‌ బౌలర్ల అవుట్‌ ఆఫ్‌ ది సబ్జెక్ట్‌లా ఆర్‌ఆర్‌ బ్యాటర్లను వణికించారు. ముఖ్యంగా షాబాజ్‌ అహ్మద్‌, అభిషేక్‌ శర్మ మ్యాచ్‌ను గెలిపించారు. మరి సన్‌రైజర్స్‌ విజయానికి కారణమైన ఈ ఐదు అంశాలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి