SNP
RCB vs SRH, IPL 2024: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓటమి పాలైంది. అయితే.. ఈ మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ ఓటమికి గల కారణాలేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
RCB vs SRH, IPL 2024: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓటమి పాలైంది. అయితే.. ఈ మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ ఓటమికి గల కారణాలేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
SNP
ఐపీఎల్ 2024లో భాగంగా గురువారం ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించింది. ఈ మ్యాచ్ కంటే ముందు భీకర ఫామ్‌లో ఉన్న ఎస్‌ఆర్‌హెచ్.. ఆర్సీబీపై చాలా ఈజీగా గెలుస్తుందని క్రికెట్ అభిమానులు భావించారు. కానీ, అందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. ఆర్సీబీ ఎస్‌ఆర్‌హెచ్‌ను ఓడించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 206 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఈ టార్గెట్‌ను ఎస్‌ఆర్‌హెచ్ ఊదేస్తుందని భావించినా.. కేవలం 171 పరుగులకే పరిమితం అయి.. 35 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. మరి ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓటమికి ప్రధానంగా 5 కారణాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
1. లెక్క తప్పిన కెప్టెన్ కమిన్స్
ఈ సీజన్‌లో సన్‌రైజర్స్‌ను సూపర్ సక్సెస్‌ఫుల్‌గా నడిపిస్తున్న ప్యాట్ కమిన్స్.. ఎందుకో ఈ మ్యాచ్‌లో కాస్త లెక్క తప్పినట్లు కనిపించాడు. ముఖ్యంగా బౌలింగ్ మార్పుల విషయంలో కాస్త తడబడ్డాడు. అలాగే విరాట్ కోహ్లీపై ఎక్కువ దృష్టి పెట్టి.. రజత్ పాటిదార్‌ను ఫ్రీగా వదిలేసినట్లు కనిపించాడు. పాటిదార్ ఆడిన ఇన్నింగ్స్.. ఆర్సీబీ బ్యాటింగ్‌పై మంచి ప్రభావం చూపించింది. అలాగే ఎస్‌ఆర్‌హెచ్‌పై ఒత్తిడి పెంచింది. జట్టులో సీనియర్ బౌలర్ అయిన భువన్వేశర్ కుమార్‌తో కేవలం ఒకే ఓవర్ బౌలింగ్ చేయించడం కూడా కెప్టెన్‌గా కమిన్స్ వైఫల్యాన్ని సూచిస్తోంది.
2. బౌలింగ్ వైఫల్యం
ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు విఫలం అయ్యారనే చెప్పాలి. ఆర్సీబీ 65 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన తర్వాత.. కొత్త బ్యాటర్ రజత్ పాటిదార్, అలాగే సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీని కంట్రోల్ చేయలేకపోయారు. కోహ్లీ నిదానంగా ఆడుతూ.. పాటిదార్‌కు స్ట్రైక్ ఇస్తుంటే.. సింగిల్స్‌ను ఆపలేకపోయారు. అలాగే.. కీలక సమయంలో వికెట్లు పడినా.. తర్వాత వచ్చే బ్యాటర్లపై ఒత్తిడి తెచ్చేలా బౌలింగ్ చేయలేకపోయారు. మొత్తంగా ఈ మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ బౌలింగ్‌లో విఫలం అయింది.
3. ట్రావిస్ హెడ్
సన్‌రైజర్స్ బలం ఏంటంటే.. ఎవరైనా చెప్పే మాట ఓపెనింగ్ జోడి. అభిషేక్ శర్మ- ట్రావిస్ హెడ్ ఇద్దరు అగ్రెసివ్ బ్యాటింగ్‌తో ప్రత్యర్థి బౌలర్లపై ఆరంభంలోనే ఎదురుదాడికి దిగుతున్నారు. పవర్ ప్లే లోనే వీలైనన్ని పరుగులు రాబడుతున్నారు. ఇప్పటి వరకు ఇదే ఎస్‌ఆర్‌హెచ్‌కు ప్లస్‌గా మారింది. కానీ, ఈ మ్యాచ్లో ట్రావిస్ హెడ్ తొలి ఓవర్‌లోనే అవుట్ కావడం ఆ జట్టుపై తీవ్ర ప్రభావం చూపింది. ఆ తర్వాత అభిషేక్ శర్మ వేగంగా ఆడే ప్రయత్నం చేసినా.. ఫలితం దక్కలేదు.
4. టాప్ 4 బ్యాటర్లు అవుట్ కావడం
ఇప్పటి వరకు తమ విధ్వంసకర బ్యాటింగ్‌తో ప్రత్యర్థి జట్లను భయపెట్టిన ఎస్‌ఆర్‌హెచ్, ఈ మ్యాచ్‌లో మాత్రం తేలిపోయింది. ముఖ్యంగా ఆ జట్టులోని టాప్ ఫోర్ బ్యాటర్లు.. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఎడెన్ మార్కరమ్, హెన్రిచ్ క్లాసెన్.. తక్కువ స్కోర్లకే అవుట్ కావడం, 56 పరుగులకే ఈ నలుగురు పెవిలియన్ చేరడంతో ఎస్‌ఆర్‌హెచ్ ఓటమి లాంఛనమైంది. పైగా ఈ నలుగురిపైనే ఎస్‌ఆర్‌హెచ్ ఎక్కువగా ఆధారపడుతుందనే విషయం ఈ మ్యాచ్‌తో మరోసారి రుజువైంది.
5. ఆర్సీబీ స్పిన్ బౌలింగ్
ఈ మ్యాచ్‌లో ఎక్కువ మార్కుల ఇవ్వాల్సింది ఆర్సీబీ స్పిన్ బౌలర్లకు, అలాగే వారిని అద్భుతంగా వినియోగించిన ఆర్సీబీ కెప్లెన్ ఫాఫ్ డుప్లెసిస్‌కు. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీలోని విల్ జాక్స్, కరణ్ శర్మ, స్వప్నిల్ సింగ్ అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఈ మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ ఓడిపోయింది అంటే.. అందుకు కారణం ఈ ముగ్గురే అని చెప్పవచ్చు. జాక్స్ 1, కరణ్, స్వప్నిల్ రెండేసి వికెట్లు పడగొట్టి.. ఎస్‌ఆర్‌హెచ్ ఓటమికి కారణంగా నిలిచారు. మరి ఆర్సీబీపై సన్‌రైజర్స్ ఓటమి గల కారణాలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Encouraging words from Patty on a tough night in Hyderabad 🙌 #PlayWithFire #SRHvRCB pic.twitter.com/0UXeBvOyw2
— SunRisers Hyderabad (@SunRisers) April 25, 2024