SNP
RCB vs RR, Eliminator, IPL 2024: రాజస్థాన్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఓడిపోయి ఆర్సీబీ ఇంటి బాట పట్టింది. అయితే.. ఈ కీలక మ్యాచ్‌లో ఆర్సీబీ ఓటమికి 5 ప్రధాన కారణాలేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
RCB vs RR, Eliminator, IPL 2024: రాజస్థాన్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఓడిపోయి ఆర్సీబీ ఇంటి బాట పట్టింది. అయితే.. ఈ కీలక మ్యాచ్‌లో ఆర్సీబీ ఓటమికి 5 ప్రధాన కారణాలేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
SNP
ఐపీఎల్ 2024లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓటమి పాలైంది. బుధవారం అహ్మాదాబాద్‌లోని నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీపై ఆర్‌ఆర్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ ఓటమితో ఈ సీజన్‌లో ఆర్సీబీ ప్రస్థానం ముగిసింది. లీగ్ దశలో తొలి 8 మ్యాచ్‌ల్లో 7 మ్యాచ్‌ల్లో ఓడిపోయి.. దాదాపు టోర్నీకి దూరమైన ఆర్సీబీ అనూహ్యంగా పుంజుకుని వరుసగా 6 విజయాలు సాధించి.. ప్లే ఆఫ్స్‌కు చేరి అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. మరోవైపు రాజస్థాన్ రాయల్స్ లీగ్ ఆరంభం దశలో అద్భుతంగా ఆడి.. తర్వాత వరుసగా 4 మ్యాచ్‌ల్లో ఓడిపోయి.. ప్లే ఆఫ్స్‌కు చేరుకుంది. కానీ, కీలకమైన ఎలిమినేటర్‌లో ఆర్సీబీపై పైచేయి సాధించి.. క్వాలిఫైయర్-2కు అర్హత సాధించింది. శుక్రవారం చెన్నై వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఆర్‌ఆర్ తలపడనుంది. ఆ మ్యాచ్‌లో గెలిస్తే.. మే 26న కేకేఆర్‌తో ఫైనల్ మ్యాచ్ ఉంటుంది. అయితే.. ఎలిమినేటర్‌లో ఆర్సీబీ ఓటమికి ఐదు ప్రధాన కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
1. బ్యాటింగ్ వైఫల్యం
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన ఆర్సీబీ తొలుత బ్యాటింగ్‌కు దిగాల్సి వచ్చింది. ఓపెనర్లు విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్ తొలి వికెట్‌కు 37 పరుగులు జోడించి పర్వాలేదనిపించారు. డుప్టెసిస్ 17, కోహ్లీ 33 పరుగులు చేసి అవుట్ అయ్యారు. ఆ తర్వాత గ్రీన్, పాటిదార్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించే ప్రయత్నం చేసినా.. గ్రీన్ 27, పాటిదార్ 34 పరుగులు చేసి అవుట్ అయిన తర్వాత ఆర్సీబీ ఇన్నింగ్స్ ఒక్కసారిగా కొలాప్స్ అయింది. మ్యాక్స్‌వెల్ డకౌట్, దినేష్ కార్తీక్ 13 బంతుల్లో 11 రన్స్ చేయడం ఆర్సీబీపై తీవ్ర ప్రభావం చూపింది. వాళ్లిద్దరు కాస్త బాగా ఆడి మరో 20 పరుగులైనా చేయగలిగి ఉంటే.. ఆర్సీబీ పటిష్టస్థితిలో ఉండేది.
2. చెత్త ఫీల్డింగ్
అసలే తక్కువ స్కోర్‌ని డిఫెండ్ చేసుకోవడానికి బరిలోకి దిగిన ఆర్సీబీ.. మెరుపు ఫీల్డింగ్‌తో బౌలర్లకు అండగా నిలవాలి. కానీ, ఆర్సీబీ అందుకు భిన్నంగా క్యాచ్‌లు వదిలేస్తూ.. మిస్ ఫీల్డ్ చేస్తూ.. చేచేతులా మ్యాచ్‌ను తీసుకెళ్లి ఆర్‌ఆర్‌కు అప్పగించారు. జైస్వాల్ క్యాచ్‌ను గ్రీన్ వదిలేస్తే.. మరో ఓపెనర్ క్యాచ్‌ను మ్యాక్స్‌వెల్ నేలపాలు చేశాడు. గ్రీన్‌కు వచ్చిన క్యాచ్ కాస్త టఫ్ అయినప్పటికీ.. మ్యాక్సీకి మాత్రం చాలా సులువైన క్యాచ్ వచ్చింది. దాన్ని అతను జారవిడిచాడు.
3. కోహ్లీపై ఎక్కువ ఆధారపడటం
బ్యాటింగ్‌లో విరాట్ కోహ్లీపై ఆర్సీబీ చాలా ఎక్కువ ఆధారపడుతున్నట్లు మరోసారి రుజువైంది. ఈ సీజన్ ఆరంభం నుంచి బ్యాటింగ్ భారాన్ని మొత్తాన్ని తన భుజాలపై మోస్తున్న కోహ్లీకి.. భుజం కాసే వాళ్లు కరువయ్యారు. మధ్య విల్ జాక్స్, గ్రీన్, పాటిదార్ బ్యాట్‌తో రాణించినా.. కీలక మ్యాచ్‌లో కోహ్లీ, గ్రీన్, పాటిదార్ 40 లోపలే రన్స్ చేయడంతో ఆర్సబీ తక్కువ స్కోర్‌కే పరిమితం అయింది.
3. కెప్టెన్సీ
ఎలిమినేటర్‌లో ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ కెప్టెన్సీ కూడా సరిగా లేదు. బౌలింగ్‌కు తగ్గట్లు ఫీల్డింగ్‌ను సెట్ చేయలేకపోయాడు. చాలా పరుగులు.. రాజస్థాన్‌కు చాలా ఫ్రీగా, సులువుగా రన్స్ వచ్చినట్లు కనిపించింది. కెప్టెన్సీ వీక్‌గా ఉండటం కూడా ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ ఓటమికి ఒక కారణంగా చెప్పుకోచ్చు.
4. టాస్
ఇక ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ కొంపముంచిన ప్రధాన విషయం టాస్. అహ్మాదాబాద్ గ్రౌండ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండే పిచ్ అనే విషయం అందరికి తెలిసిందే. ఇక్కడ ఛేజింగ్ చాలా సులువుగా ఉంటుంది. తొలి క్వాలిఫైయర్‌లో ఎస్‌ఆర్‌హెచ్ కెప్టెన్ కమిన్స్ టాస్ గెలిచి తొలి బ్యాటింగ్ తీసుకుని దెబ్బ తిన్నాడు. కానీ, ఆ తప్పును రాజస్థాన్ కెప్టెన్ సంజు శాంసన్ చేయలేదు. టాస్ గెలవగానే బౌలింగ్ తీసుకున్నాడు. రెండో ఇన్నింగ్స్ సమయంలో గ్రౌండ్‌లో విపరీతమైన తేమ ఉండటంతో బౌలింగ్ కష్టమైంది. మరి ఆర్సీబీ ఓటమికి ఈ ఐదు కారణాలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
So many memories, good and bad, but it’s been a journey to remember and cherish! ♥️
We can say for sure that the RCB fans are super proud of the character you guys showed! 🫡
Once an RCBian, always an RCBian… 🤗#PlayBold #ನಮ್ಮRCB #IPL2024 pic.twitter.com/2cCfoWOB8n
— Royal Challengers Bengaluru (@RCBTweets) May 22, 2024