iDreamPost
android-app
ios-app

World Cup: ఇండియా vs కివీస్‌ మ్యాచ్‌తో ఎన్ని రికార్డులు బ్రేక్‌ అయ్యాయో తెలుసా?

  • Published Oct 23, 2023 | 9:46 AM Updated Updated Oct 23, 2023 | 3:37 PM

ఈ వరల్డ్‌ కప్‌ టోర్నీలో టీమిండియాకు వరుసగా ఐదో విజయం దక్కగా.. న్యూజిలాండ్‌కు తొలి ఓటమి ఎదురైంది. నిన్నటి వరకు ఓటమి ఎరుగని జట్లుగా ఉన్న ఇండియా-న్యూజిలాండ్‌ మధ్య మ్యాచ్‌లో పలు రికార్డులు బ్రేక్‌ అయ్యాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

ఈ వరల్డ్‌ కప్‌ టోర్నీలో టీమిండియాకు వరుసగా ఐదో విజయం దక్కగా.. న్యూజిలాండ్‌కు తొలి ఓటమి ఎదురైంది. నిన్నటి వరకు ఓటమి ఎరుగని జట్లుగా ఉన్న ఇండియా-న్యూజిలాండ్‌ మధ్య మ్యాచ్‌లో పలు రికార్డులు బ్రేక్‌ అయ్యాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

  • Published Oct 23, 2023 | 9:46 AMUpdated Oct 23, 2023 | 3:37 PM
World Cup: ఇండియా vs కివీస్‌ మ్యాచ్‌తో ఎన్ని రికార్డులు బ్రేక్‌ అయ్యాయో తెలుసా?

వన్డే వరల్డ్‌ కప్‌ 2023లో టీమిండియా వరుసగా ఐదో విజయంతో టేబుల్‌ టాపర్‌గా అవతరించింది. ధర్మశాల వేదికగా పటిష్టమైన న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బౌలింగ్‌లో స్టార్‌ పేసర్‌ మొహమ్మద్‌ షమీ అద్భుత ప్రదర్శనతో ఐదు వికెట్ల హాల్‌ సాధించి.. న్యూజిలాండ్‌ను పెద్ద స్కోర్‌ చేయనివ్వకుండా దెబ్బతీస్తే.. ఛేజింగ్‌లో మన ఛేజ్‌మాస్టర్‌ కింగ్‌ కోహ్లీ అద్భుతంగా ఆడి.. టీమిండియాకు విజయాన్ని అందించాడు. ఇక ఈ మ్యాచ్‌తో పలు రికార్డులు బ్రేక్‌ అయ్యాయి. నిన్న జరిగిన మ్యాచ్‌ కంటే ముందు.. టీమిండియా, న్యూజిలాండ్‌ చెరో నాలుగేసి మ్యాచ్‌లు ఆడేసి. ఆడిని అన్ని మ్యాచ్‌ల్లో విజయం సాధించి, ఓటమి ఎరుగని జట్లుగా ఉన్నాయి. అలాంటి జట్ల మధ్య మ్యాచ్‌ కావడంతో చాలా టఫ్‌గానే సాగింది. మ్యాచ్‌ ప్రారంభంలో టీమిండియా డామినేట్‌ చేస్తే.. తర్వాత బ్లాక్‌ క్యాప్స్‌ ఆధిపత్యం చెలాయించారు. మళ్లీ టీమిండియా మ్యాచ్‌లోకి దూసుకొచ్చింది. ఇలా ఆధిపత్యం చేతులు మారుతూ.. క్రికెట్‌ అభిమానులకు మంచి వినోదాన్ని అందించింది మ్యాచ్‌. ఈ వరల్డ్‌ కప్‌లో టీమిండియా సాధించిన మంచి విజయాల్లో ఇది కూడా ఒకటని చెప్పుకోవాలి. అయితే.. ఈ మ్యాచ్‌తో నమోదైన రికార్డులు, బద్దలైన రికార్డులపై ఒకసారి లుక్కేద్దాం..

ఈ మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లీ 95 పరుగులతో అద్భుత ప్రదర్శన చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఈ ఇన్నింగ్స్‌తో కోహ్లీ వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో నాలుగో స్థానానికి చేరుకున్నాడు. నిన్నటి వరకు నాలుగో స్థానంలో ఉన్న శ్రీలంక దిగ్గజ మాజీ క్రికెటర్‌ సనత్‌ జయసూర్యను వెనక్కి నెట్టి నాలుగో ప్లేస్‌ను ఆక్రమించాడు. జయసూర్య 13430 పరుగులు చేస్తే.. ఆ రికార్డును అధిగమించిన కోహ్లీ.. ప్రస్తుతం 13437 రన్స్‌తో ఫోర్త్‌ ప్లేస్‌లో ఉన్నాడు. కోహ్లీ కంటే ముందు.. 3వ స్థానంలో రికీ పాంటింగ్‌(13704), 2వ ప్లేస్‌లో కుమార సంగక్కర(14234), ఇక అగ్రస్థానంలో క్రికెట్‌ దేవుడు సచిన్‌ టెండూల్కర్‌(18426) రన్స్‌తో ఎవరీ అందనంత ఎత్తులో ఉన్నాడు. ఇక మరో రికార్డు గురించి మాట్లాడుకుంటే.. వరల్డ్‌ కప్స్‌లో టీమిండియా ఛేదించిన అత్యధిక టార్గెట్స్‌లో ఈ మ్యాచ్‌ నాలుగో స్థానంలో నిలిచింది. 2015 వరల్డ్‌ కప్‌లో జింబాబ్వేపై 288 పరుగుల టార్గెట్‌ను ఛేజ్‌ చేసింది టీమిండియా. వరల్డ్‌ కప్స్‌లో ఇదే అత్యధికంగా. ఆ తర్వాత 2011 వరల్డ్‌ కప్‌ ఫైనల్‌లో శ్రీలంకపై 275, 2003లో పాకిస్థాన్‌పై 274 పరుగులు ఛేదించింది. ఇప్పుడు మళ్లీ 274 పరుగుల టార్గెట్‌ను విజయవంతంగా పూర్తి చేసింది. ఇదే వరల్డ్‌ కప్‌లో ఆఫ్ఘనిస్థాన్‌పై ఛేదించిన 273 పరుగుల రికార్డును తాజాగా టీమిండియా అధిగమించింది.

అలాగే.. వరల్డ్‌ కప్స్‌లో టీమిండియా తరఫున 6వ వికెట్‌కు జోడించిన అత్యధిక రన్స్‌ జాబితాలో ఈ మ్యాచ్‌లో కోహ్లీ-జడేజా పార్ట్నర్‌షిప్‌ 4వ స్థానంలో నిలిచింది. 1983లో కపిల్‌ దేవ్‌-సయ్యద్‌ కిర్మాణీ 6వ వికెట్‌కు 126 పరుగులు జోడించారు. 2019లో ధోని-జడేజా జోడీ 116 పరుగులు చేసింది. 1987లో కపిల్‌ దేవ్‌-కిరణ్‌ మోరే 82 రన్స్‌ జోడించింది. మళ్లీ ఇప్పుడు న్యూజిలాండ్‌పై కోహ్లీ-జడేజా కలిసి 78 పరుగులు చేశారు. 2011లో యువరాజ్‌ సింగ్‌-రైనా ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 6వ వికెట్‌కు జోడించిన 74 పరుగులు రికార్డును ఇప్పుడు కోహ్లీ-జడేజా బ్రేక్‌ చేశారు. వీటితో పాటు ఈ మ్యాచ్‌లో మరో అరుదైన ప్రపంచ రికార్డు కూడా నమోదైంది. టీమిండియా యువ స్టార్‌ బ్యాటర్‌ శుబ్‌మన్‌ గిల్‌ అత్యంత వేగంగా వన్డేల్లో 2 వేల పరుగులు పూర్తి చేసుకున్న తొలి బ్యాటర్‌గా నిలిచాడు. కేవలం 38 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఫీట్ సాధించాడు గిల్. శుబ్‌మన్‌ కంటే ముందు సౌతాఫ్రికా మాజీ క్రికెటర్‌ హషీమ్ ఆమ్లా అత్యంత వేగంగా వన్డేల్లో 2 వేల పరుగులు పూర్తి చేసుకున్న బ్యాటర్‌గా ఉన్నాడు. అతను 40 ఇన్నింగ్స్‌ల్లో ఆ రికార్డు సాధించాడు. ఇప్పుడు దాదాపు 12 ఏళ్ల తర్వాత గిల్‌ ఆ రికార్డును బద్దలు కొట్టాడు. మరి ఈ మ్యాచ్‌తో బ్రేక్‌ అయిన రికార్డులపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: World Cup: 4 మ్యాచ్‌లు ఆడించకపోవడంపై స్పందించిన షమీ! ఏమన్నాడంటే..