iDreamPost
android-app
ios-app

Sri Lanka: టీ20 వరల్డ్‌ కప్‌ నుంచి శ్రీలంక ఔట్‌! సౌతాఫ్రికా దరిద్రం ఈసారి లంకకు..!

  • Published Jun 12, 2024 | 3:30 PMUpdated Jun 12, 2024 | 3:30 PM

Sri Lanka, T20 World Cup 2024: టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో శ్రీలంక లాంటి టాప్‌ క్లాస్‌ జట్టు.. టోర్నీ నుంచి నిష్క్రమించేందుకు సిద్ధమైంది. అయితే.. వారి వైఫల్యానికి 3 ప్రధాన కారణాలేంటో ఇప్పుడు చూద్దాం..

Sri Lanka, T20 World Cup 2024: టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో శ్రీలంక లాంటి టాప్‌ క్లాస్‌ జట్టు.. టోర్నీ నుంచి నిష్క్రమించేందుకు సిద్ధమైంది. అయితే.. వారి వైఫల్యానికి 3 ప్రధాన కారణాలేంటో ఇప్పుడు చూద్దాం..

  • Published Jun 12, 2024 | 3:30 PMUpdated Jun 12, 2024 | 3:30 PM
Sri Lanka: టీ20 వరల్డ్‌ కప్‌ నుంచి శ్రీలంక ఔట్‌! సౌతాఫ్రికా దరిద్రం ఈసారి లంకకు..!

టీ20 వరల్డ్‌ కప్‌ 2024 టోర్నీలో గ్రూప్‌ స్టేజ్‌లోనే శ్రీలంక ఇంటి బాట పట్టడం దాదాపు ఖాయమైపోయింది. సౌతాఫ్రికా, బంగ్లాదేశ్‌ చేతిలో ఓటమి పాలైన లంకకు దరిద్రం మామూలుగా పట్టుకోలేదు. పసికూన నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దు అయింది. దీంతో.. లంక ఖాతాలో ఒకే ఒక్క పాయింట్‌ ఉంది. ఒక్క మ్యాచ్‌ మాత్రమే మిగిలి ఉంది. తమ చివరి మ్యాచ్‌లో నేపాల్‌పై లంక గెలిచినా.. మూడు పాయింట్లతో ఉంటుంది. బంగ్లాదేశ్‌తో తమ మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో ఒక్కటి గెలిచినా.. లంక ఇంటికే. సో.. ఇప్పుడున్న లెక్కల ప్రకారం అనధికారికంగా శ్రీలంక ఈ టీ20 వరల్డ్‌ కప్‌ టోర్నీ నుంచి ఇంటికి వెళ్లినట్లే.

అయితే.. ఈజీగా గెలవాల్సిన మ్యాచ్‌ల్లో వర్షం వచ్చి మ్యాచ్‌ రద్దు కావడం, లేదా ఓడిపోవడం, ఒత్తిడికి తట్టుకోలేక చిత్తుకావడం ఇలాంటివన్నీ సౌతాఫ్రికా విషయంలో జరుగుతూ ఉంటాయి. కానీ, ఇప్పుడు ఆ దరిద్రం లంకకు చుట్టుకున్నట్లు.. వారి ప్రదర్శన, ఎదురైన పరిస్థితులు చూస్తే అర్థమవుతుంది. దరిద్రం సంగతి ఎలా ఉన్నా.. ఈ టోర్నీలో లంక చేసిన మూడు ప్రధాన తప్పిదాలే ఆ జట్టును గ్రూప్ స్టేజ్‌లోనే ఇంటి బాటపట్టేలా చేస్తున్నాయి. ఆ మూడు అంశాలేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

1. చెత్త బ్యాటింగ్‌
ఈ టీ20 వరల్డ్‌ కప్‌ టోర్నీలో లంక బ్యాటర్లు దారుణంగా విఫలం అయ్యారు. సౌతాఫ్రికాతో జరిగిన తొలి మ్యాచ్‌లో లంక కేవలం 77 పరుగులకే కుప్పకూలింది. అలాగే బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా 124 పరుగులు మాత్రమే చేసింది. ఇలా రెండు మ్యాచ్‌ల్లోనూ లంక ప్రధానంగా బ్యాటింగ్‌లోనే విఫలమైంది. బ్యాటర్ల కాస్త మెరుగ్గా రాణించి ఉంటే ఈ రోజు లంకకు ఈ దుస్థితి వచ్చి ఉండేది కాదు.

2. మిడిల్‌ ఓవర్స్‌లో ఫేలవ బౌలింగ్‌
శ్రీలంక రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోవడానికి బ్యాటింగ్‌ ప్రధాన కారణం అయినా.. బౌలింగ్‌ డిపార్ట్‌మెంట్‌కు కూడా ఆ పాపంలో భాగం ఉంది. 77, 124 లాంటి స్కోర్లు డిఫెండ్‌ చేయడం అంత ఈజీ కాదుకానీ, పవర్‌ ప్లేలో అద్భుతంగా బౌలింగ్‌ చేసిన లంక బౌలర్లు మిడిల్‌ ఓవర్స్‌లో మాత్రం చేతులు ఎత్తేశారు. సౌతాఫ్రికాపై 77 రన్స్‌ డిఫెండ్‌ చేస్తూ.. పవర్‌ ప్లేలో కేవలం 27 రన్స్‌ ఇచ్చి రెండు వికెట్లు తీసుకున్నారు. కానీ, 7 నుంచి 15 ఓవర్ల మధ్య(మిడిల్‌ ఓవర్స్‌) పెద్దగా ప్రభావం చూపలేదు. అలాగే బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో 124 పరుగులను కాపాడుకునే క్రమంలో పవర్‌ ప్లేలో 3 వికెట్లు తీసి.. మిడిల్‌ ఓవర్స్‌లో పట్టువిడిచారు.

3. సీనియర్ల వైఫల్యం
పై రెండు కారణాల కంటే శ్రీలంకపై తీవ్ర ప్రభావం చూపింది సీనియర్‌ ప్లేయర్‌ వైఫల్యం. శ్రీలంక టీమ్‌లోని సీనియర్‌ ఆటగాళ్లు ఏంజిలో మ్యాథ్యూస్‌, కుసాల్‌ మెండిస్‌, డసన్‌ షనకాతో పాటు కెప్టెన్‌ వనిందూ హసరంగా పెద్దగా రాణించలేదు. జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో వీరిలో ఏ ఒక్కరు కూడా టీమ్‌ను రక్షించలేకపోయారు. టఫ్‌ కండీషన్స్‌లో సీనియర్‌ ఆటగాళ్లు టీమ్‌ను కాపాడాలని అదే ఇక్కడ లంక సీనియర్లు చేయలేకపోయారు. దాంతో.. లంక గ్రూప్‌ స్టేజ్‌లోనే ఇంటి బాట పట్టేందుకు సిద్ధమైంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి