SNP
New Zealand, T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్ 2024 నుంచి న్యూజిలాండ్ గ్రూప్ దశలోనే ఇంటి బాట పట్టింది. ఈ టోర్నీలో వారి వైఫల్యానికి కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
New Zealand, T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్ 2024 నుంచి న్యూజిలాండ్ గ్రూప్ దశలోనే ఇంటి బాట పట్టింది. ఈ టోర్నీలో వారి వైఫల్యానికి కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
SNP
టీ20 వరల్డ్ కప్ 2024లో న్యూజిలాండ్ తమ ప్రస్థానం ముగించింది. గ్రూప్ దశలో మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే ఆ జట్టు ఇంటి బాట పట్టింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓటమి పాలు కావడంతో.. బ్లాక్ క్యాప్స్ సూపర్ 8కు ఛాన్స్ లేదు. తొలి మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్ చేతుల్లో ఓడిన కివీస్.. తాజాగా మరో స్ట్రాంగ్ టీమ్ వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ ఓటమి పాలై.. టోర్నీ నుంచి నిష్క్రమించింది. మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో ఉగాండ, పీఎన్‌జీ లాంటి పసికూనలతో ఆడనుంది న్యూజిలాండ్. ఈ రెండు మ్యాచ్‌లు గెలిచినా ఎలాంటి ఉపయోగం ఉండదు. ఈ రెండు మ్యాచ్‌లు ఆడేసి.. న్యూజిలాండ్‌కు పయనం కానుంది. అయితే.. న్యూజిలాండ్ గ్రూప్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించడం టీ20 వరల్డ్ కప్ చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. మరి ఈ టీ20 వరల్డ్ కప్‌లో న్యూజిలాండ్ చేసిన 3 ప్రధాన తప్పులేంటో ఇప్పుడు విశ్లేషిద్దాం..
1. బౌలింగ్
ఈ టోర్నీలో న్యూజిలాండ్ బౌలింగ్ విఫలమైంది. అలాగే కెప్టెన్‌గా కేన్ విలియమ్సన్ కూడా దారుణంగా విఫలం అయ్యాడు. సరైన బౌలింగ్ మార్పులు చేయకుండా టీమ్ ఓటమికి కారణంగా నిలిచాడు. వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ప్రధాన బౌలర్లు ట్రెంట్ బౌల్ట్, టిమ్ సౌథీ, లుకీ ఫెర్గుసన్ 18 ఓవర్ల లోపే తన పూర్తి కోటను పూర్తి చేసుకున్నాడు. దీంతో ఇన్నింగ్స్‌ను ఇతర బౌలర్లు ముగించాల్సి వచ్చింది. ఇది టీమ్‌పై తీవ్ర ప్రభావం చూపింది. పవర్ ప్లేతో పాటు డెత్ ఓవర్స్‌లో న్యూజిలాండ్ బౌలర్లు తేలిపోయారు.
2. సరైన గేమ్ ప్రాక్టీస్ లేకపోవడం
న్యూజిలాండ్ జట్టులోని ప్రధాన ఆటగాళ్లకు ఈ టీ20 వరల్డ్ కప్ టోర్నీకి ముందు పెద్దగా ప్రాక్టీస్ లభించలేదు. అసలు టీ20 క్రికెట్ వాళ్లు పెద్దగా ఆడలేదు. కెప్టెన్ కేన్ విలియమ్సన్, డెవాన్ కాన్వె గాయాల నుంచి కోలుకుని నేరుగా టోర్నీకి వచ్చారు. అలాగే లుకీ ఫెర్గుసన్ ఐపీఎల్‌లో ఆర్సీబీ తరుఫున తక్కువ మ్యాచ్‌లే ఆడాడు. మిచెల్ సాంట్నర్ కూడా సీఎస్‌కే తరఫున తక్కువ మ్యాచ్‌లు ఆడాడు. గ్లెన్ ఫిలిప్స్‌ను ఎస్‌ఆర్‌హెచ్ అసలు పూర్తిగా పక్కనపెట్టేసింది. దీంతో.. సగం న్యూజిలాండ్ జట్టుకు ఈ మెగా టోర్నీకి ముందు సరైన టీ20 క్రికెట్ ప్రాక్టీస్ దక్కలేదు.
3. స్పిన్ ఆడటంలో విఫలం
మొదటి నుంచి న్యూజిలాండ్ స్పిన్ బౌలింగ్ ఆడటంలో చాలా ఇబ్బంది పడుతూ ఉంది. స్పిన్ బౌలింగ్ వీక్‌నెస్ ఇప్పుడు కూడా వారి కొంపముంచింది. స్పిన్‌కు సహకరించే పిచ్‌లపై ఆఫ్ఘనిస్థాన్, వెస్టిండీస్ స్పిన్నర్లు కట్టుదిట్టమైన బౌలింగ్ చేశారు. ఆఫ్ఘాన్‌తో జరిగిన మ్యాచ్‌లో రషీద్ ఖాన్ 4 వికెట్లు పడగొట్టి.. కివీస్ మెడలు వంచాడు. మొత్తంగా ఈ టీ20 వరల్డ్ కప్‌లో న్యూజిలాండ్ విఫలం అవ్వడానికి ఈ మూడు ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు. మరి ఈ అంశాలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
NEW ZEALAND OUT OF THE GROUP STAGE IN T20I WORLD CUP 2024…!!! pic.twitter.com/dKyQ4iDwNh
— Johns. (@CricCrazyJohns) June 14, 2024