SNP
Gautam Gambhir, Head Coach, CAC: టీమిండియా హెడ్ కోచ్ పదవి కోసం ఇంటర్వ్యూకి అటెండ్ అయిన గౌతమ్ గంభీర్‌ను సీఏసీ సభ్యులు అడిగి ఓ 3 ప్రధాన ప్రశ్నలు ఇవే అంటూ రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఆ ప్రశ్నలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
Gautam Gambhir, Head Coach, CAC: టీమిండియా హెడ్ కోచ్ పదవి కోసం ఇంటర్వ్యూకి అటెండ్ అయిన గౌతమ్ గంభీర్‌ను సీఏసీ సభ్యులు అడిగి ఓ 3 ప్రధాన ప్రశ్నలు ఇవే అంటూ రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఆ ప్రశ్నలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
SNP
రాహుల్ ద్రవిడ్ స్థానంలో టీమిండియా హెడ్ కోచ్‌గా గంభీర్ నియామకం లాంఛనమే అయిపోయనట్లు కనిపిస్తోంది. ఈ పోస్ట్ కోసం తాజాగా గంభీర్ ఇంటర్వ్యూలో కూడా పాల్గొన్నాడు. టీ20 వరల్డ్ కప్ 2024 తర్వాత టీమిండియా హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పదవీ కాలం ముగియనుండటంతో.. అతని స్థానంలో కొత్త కోచ్‌ను నియమించేందుకు రెడీ అయింది బీసీసీఐ. దరఖాస్తులు ఆహ్వానించి.. ఇప్పుడు గంభీర్‌ను ఇంటర్వ్యూ కూడా చేసింది. మరి ఆ ఇంటర్వ్యూలో గంభీర్‌ను అడిగి ప్రశ్నల్లో ఈ మూడు ప్రశ్నలు హైలెట్ అంటూ కొన్ని జాతీయ వార్తా సంస్థలు పేర్కొంటున్నాయి. మరి ఆ 3 ప్రధాన ప్రశ్నలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
హెడ్ కోచ్ పోస్ట్ జరిగిన ఇంటర్వ్యూలో గంభీర్‌ని క్రికెట్ అడ్వైజరీ కమిటీ పలు ప్రశ్నలు అడిగింది. వాటిలో మూడు ముఖ్యమైన ప్రశ్నలు.. 1.జట్టు కోచింగ్ సిబ్బందికి సంబంధించి మీ ఆలోచనలు ఏమిటి?, 2. జట్టులో ఉన్న సీనియర్ స్టార్ ప్లేయర్లు, మీతో పాటు కలిసి ఆడిన వాళ్లు ఉన్నారు.. వారితో మీరు ఎలా కమ్యూనికేట్ చేస్తారు?, 3. స్ప్లిట్ కెప్టెన్సీ, వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్, ఫిట్‌నెస్ పారామీటర్‌తో పాటు.. టీమిండియా ICC ట్రోఫీలను గెలవడంలో విఫలం అవుతుండటంపై మీ అభిప్రాయాలు ఏమిటి? అని సీఏసీ సభ్యులు గంభీర్‌ను ప్రశ్నించారు.
ఈ ప్రశ్నలకు గంభీర్ తనదైన స్టైల్‌లో సమాధానం చెప్పినట్లు.. గంభీర్ ఇచ్చిన జవాబుతో సీఏసీ సభ్యులు కూడా సంతృప్తి చెందినట్లు సమాచారం. దీంతో.. టీమిండియా హెడ్ కోచ్‌గా గంభీర్ ఎంపిక లాంఛనమే అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే.. తాను హెడ్ కోచ్‌గా ఉండాలంటే.. గంభీర్ బీసీసీఐకి కొన్ని కండీషన్లు పెట్టాడని కూడా తెలుస్తోంది. కెప్టెన్సీ మార్పు, తనతో పాటు కొత్త సపోర్టింగ్ స్టాఫ్, వేర్వేరు ఫార్మాట్లకు వేర్వేరే కెప్టెన్లు.. ఇలా పలు డిమాండ్లు బీసీసీఐ ముందు ఉంచాడు గంభీర్. వీటికి బీసీసీఐ కూడా ఓకే చెప్పినట్లు సమాచారం. మరి ఇంటర్వ్యూలో గంభీర్‌ను అడిగిన ప్రశ్నలు ఇవే అంటూ వస్తున్న రిపోర్ట్‌లపై అలాగే ఆ ప్రశ్నలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
— Sayyad Nag Pasha (@nag_pasha) June 19, 2024