SNP
Suryakumar Yadav, Sreesanth, Kapil Dev, IND vs SA: టీ20 వరల్డ్ కప్ 2024 గెలవడానికి సూర్య పట్టిన క్యాచ్ ఒక కారణం.. అలాంటి ఐకానిక్ క్యాచ్‌లు మరో రెండు ఉన్నాయి. ఆ రెండు కూడా మనకు వరల్డ్‌కప్‌లు అందించాయి. వాటి గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
Suryakumar Yadav, Sreesanth, Kapil Dev, IND vs SA: టీ20 వరల్డ్ కప్ 2024 గెలవడానికి సూర్య పట్టిన క్యాచ్ ఒక కారణం.. అలాంటి ఐకానిక్ క్యాచ్‌లు మరో రెండు ఉన్నాయి. ఆ రెండు కూడా మనకు వరల్డ్‌కప్‌లు అందించాయి. వాటి గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
SNP
సౌతాఫ్రికాతో జరిగిన టీ20 వరల్డ్ కప్ 2024 ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించి.. వరల్డ్ ఛాంపియన్‌గా అవతరించింది. 17 ఏళ్ల తర్వాత రెండోసారి ఈ పొట్టి ప్రపంచ కప్‌ను ముద్దాడింది భారత జట్టు. అయితే.. ఈ వరల్డ్ కప్ మనకు దక్కడానికి సౌతాఫ్రికా ఇన్నింగ్స్ చివరి ఓవర్ తొలి బంతికి సూర్యకుమార్ యాదవ్ పట్టిన క్యాచ్ కారణం అని చాలా మంది క్రికెట్ అభిమానులు అంటున్నారు. నిజానికి అది వాస్తవం కూడా. సౌతాఫ్రికా విజయానికి చివరి 6 బంతుల్లో 16 పరుగులు అవసరమైన సమయంలో డేంజరస్ బ్యాటర్ డేవిడ్ మిల్లర్.. పాండ్యా వేసిన ఇన్నింగ్స్ 20వ ఓవర్ తొలి బంతిని లాంగ్ ఆఫ్ దిశగా భారీ షాట్ ఆడాడు. అది ఆల్‌మోస్ట్ సిక్స్‌గా వెళ్లింది. కానీ, సూర్యకుమార్ మెరుపులా వచ్చి ఆ బాల్‌ను పట్టుకుని.. బౌండరీ లైన్ దాటుతూ.. బంతిని గాల్లోకి విసిరి మళ్లీ గ్రౌండ్‌లోకి వచ్చి క్యాచ్‌ను పూర్తి చేశాడు. దాంతో మిల్లర్ అవుట్ అయ్యాడు. మ్యాచ్ టీమిండియా చేతుల్లోకి వచ్చేసింది. ఆ బాల్ సిక్స్ వెళ్లి ఉంటే.. ఈక్వేషన్ 5 బంతుల్లో 10 పరుగులు అయ్యేది. మిల్లర్ స్ట్రైక్‌లో ఉండటంతో.. మ్యాచ్ ఫలితం వేరేలా ఉండేది.
అందుకే సూర్య అందుకుంది క్యాచ్ కాదు.. వరల్డ్ కప్ అంటూ అంతా ప్రశంసిస్తున్నారు. అయితే.. ఇలాంటి ఓ రెండు క్యాచ్‌లు కూడా గతంలో టీమిండియాకు రెండు వరల్డ్ కప్‌లు అందించాయనే విషయం చాలా మందికి తెలిసి ఉండదు. ఇప్పటి వరకు టీమిండియా నాలుగు వరల్డ్ కప్‌లు సాధించింది. రెండు వన్డే వరల్డ్ కప్‌లు, రెండు టీ20 వరల్డ్ కప్‌లు కైవసం చేసుకుంది. 1983లో కపిల్ దేవ్ కెప్టెన్సీలో తొలి వన్డే వరల్డ్ కప్, 2011లో ధోని కెప్టెన్సీలో రెండో వన్డే వరల్డ్ కప్ గెలిచింది. అలాగే 2007లో తొలి టీ20 వరల్డ్ కప్‌ను ధోని కెప్టెన్సీలో, ఇప్పుడు రోహిత్ శర్మ కెప్టెన్సీలో రెండో టీ20 వరల్డ్ కప్ సాధించింది. అయితే.. ఈ నాలుగు వరల్డ్ కప్‌లలో మూడు సార్లు మూడు అద్భుతమైన క్యాచ్‌లతో మూడు వరల్డ్ కప్‌లు మన సొంతం అయ్యాయి. అందులో ప్రస్తుతం టీ20 వరల్డ్ కప్ కాగా.. మిగిలిన రెండు ఏవో.. ఆ సమయంలో ఎవరు క్యాచ్‌లు అందుకున్నారో వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం..
సౌతాఫ్రికా వేదికగా 2007లో మొట్ట మొదటి టీ20 వరల్డ్ కప్ జరిగింది. ఆ టోర్నీకి ధోని కెప్టెన్సీలో యంగ్ టీమిండియా వెళ్లింది. ఎలాంటి అంచనాలు లేకుండా అండర్ డాగ్స్‌లా ఆ టోర్నీలో అడుగుపెట్టిన టీమిండియా.. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. ఛాంపియన్‌గా నిలిచింది. ఫైనల్ మ్యాచ్ పాకిస్థాన్‌తో జరిగింది. అత్యంత ఉత్కంఠగా సాగిన ఆ మ్యాచ్‌లో పాక్ ఆటగాడు మిస్బా ఉల్ హక్ ఒంటిచేత్తో పాక్‌ను గెలిపించేలా ఉన్నాడు. పాక్ విజయానికి చివరి ఓవర్లో 12 పరుగులు మాత్రమే కావాలి. అప్పుడు మిస్బా ఉన్న ఫామ్‌కి మ్యాచ్ పాక్‌దే అని అంతా ఫిక్స్ అయ్యారు. చివరి ఓవర్ వేసేందుకు ధోని.. జోగిందర్ శర్మకు బంతి అందించాడు. ఆ నిర్ణయంతో అంతా షాక్ అయ్యారు. తొలి రెండు బంతుల్లో మిస్బా 7 పరుగులు బాదేశాడు. ఇక పాకిస్థాన్ విజయానికి 4 బంతుల్లో 6 పరుగులు మాత్రమే కావాలి. ఆ టైమ్‌లో జోగిందర్ శర్మ వేసిన బంతిని స్ట్రైక్‌లో ఉన్న మిస్బా స్కూప్ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ, షార్ట్ ఫైన్ లెగ్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న శ్రీశాంత్ చేతుల్లో వెళ్లి పడింది. ఆ క్యాచ్‌తో పాకిస్థాన్ చివరి వికెట్ కోల్పోయింది.. టీమిండియా 5 పరుగుల తేడాతో విజయం సాధించి. కప్పును కైవసం చేసుకుంది. శ్రీశాంత్ పట్టిన ఆ క్యాచ్ క్రికెట్ అభిమానుల హృదయాల్లో ఎప్పటికీ నిలుచిపోతుంది.
1983లో కపిల్ దేవ్ కెప్టెన్సీలో భారత జట్టు తొలిసారి వన్డే వరల్డ్ కప్‌ను గెలుచుకుంది. ఫైనల్ మ్యాచ్‌లో అప్పటికే రెండు సార్లు విశ్వవిజేతగా నిలిచిన అరివీర భయంకరమైన వెస్టిండీస్‌తో తలపడింది. భారత వరల్డ్ కప్ గెలుస్తుందని ఎవరికీ నమ్మకం లేదు. అసలు ఫైనల్‌కు రావడమే గొప్ప అనే ఫీలింగ్‌లో అప్పుడు అంతా ఉన్నారు. కానీ, ప్రపంచం మొత్తాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తూ.. కపిల్ డేవిల్స్ ఛాంపియన్స్‌గా నిలిచారు. అయితే, ఈ మ్యాచ్‌లో కపిల్ దేవ్ అందుకున్న ఓ సూపర్ క్యాచ్ టీమిండియాకు వరల్డ్ కప్ అందించింది. ఆ ఫైనల్‌లో వెస్టిండీస్‌కు 184 పరుగుల టార్గెట్ ఇచ్చింది టీమిండియా. అంత చిన్న టార్గెట్‌ను వెస్టిండీస్ లాంటి భీకరమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న టీమ్ సులువుగా గెలుస్తుందని అంతా భావించారు. కానీ, విండీస్ టీమ్‌కు బ్యాటింగ్ వెన్నుముక అయిన వివ్ రిచర్డ్స్ ఇచ్చిన క్యాచ్‌ని కపిల్ దేవ్ అందుకోవడంతో మ్యాచ్ మలుపు తిరిగింది. ఆ పట్టును టీమిండియా మరింత బిగించి పట్టడంతో కప్పు మన వశమైంది. ఇలా సూర్యకుమార్ యాదవ్, శ్రీశాంత్, కపిల్ దేవ్‌లు అందుకున్న మూడు సూపర్ క్యాచ్‌లు మనకు మూడు వరల్డ్ కప్‌లు తెచ్చిపెట్టాయి. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
History repeat kar do 🙌🙌🙌🙌🙌
Tab bhi 183 hi runs hue theyy
Kapil Dev’s running catch made Viv Richards to leave the ground in 1983 World Cup
VC owner from u tube account pic.twitter.com/d9egK8VPby— Geet@Maan 🫶🫶 (@Mayuri302) November 19, 2023
#OnThisDay in 2007!
The @msdhoni-led #TeamIndia created history as they lifted the ICC World T20 Trophy. 🏆 👏
Relive that title-winning moment 🎥 👇 pic.twitter.com/wvz79xBZJv
— BCCI (@BCCI) September 24, 2021