గెలిచే మ్యాచ్‌ టై! హెడ్‌ కోచ్‌​ గంభీర్‌ చేసిన 3 తప్పులు ఇవే!

గెలిచే మ్యాచ్‌ టై! హెడ్‌ కోచ్‌​ గంభీర్‌ చేసిన 3 తప్పులు ఇవే!

Gautam Gambhir, IND vs SL: టీమిండియా హెడ్‌ కోచ్‌గా గౌతమ్‌ గంభీర్‌ తీసుకున్న ఓ మూడు నిర్ణయాలు.. శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌ టై అయ్యేందుకు కారణం అంటూ సోసల్‌ మీడియాలో కామెంట్స్‌ వినిపిస్తున్నాయి అవేంటో ఇప్పుడు చూద్దాం..

Gautam Gambhir, IND vs SL: టీమిండియా హెడ్‌ కోచ్‌గా గౌతమ్‌ గంభీర్‌ తీసుకున్న ఓ మూడు నిర్ణయాలు.. శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌ టై అయ్యేందుకు కారణం అంటూ సోసల్‌ మీడియాలో కామెంట్స్‌ వినిపిస్తున్నాయి అవేంటో ఇప్పుడు చూద్దాం..

కొలంబో వేదికగా శుక్రవారం భారత్‌-శ్రీలంక మధ్య జరిగిన తొలి వన్డే మ్యాచ్‌ టైగా ముగిసిన విషయం తెలిసిందే. చాలా ఈజీగా గెలవాల్సిన మ్యాచ్‌ను టై చేసుకోని ఒక విధంగా టీమిండియా ఓడిపోయిందనే చెప్పాలి. చేతిలో రెండు వికెట్లు పెట్టుకుని, 15 బంతుల్లో ఒక్క రన్‌.. కేవలం ఒక్కటంటే ఒక్క రన్‌ చేయలేక.. మ్యాచ్‌ను టైగా ముగించింది. స్కోర్స్‌ లెవెల్‌ అయిన తర్వాత.. ఒక్క రన్‌ చేయాల్సిన సమయంలో శివమ్‌ దూబే, అర్షదీప్‌ సింగ్‌ వరుస బంతుల్లో అవుట్‌ కావడంతో.. మ్యాచ్‌ టై అయింది. ఓడిపోతాం అనుకున్న మ్యాచ్‌ను టై చేసుకొని శ్రీలంక సంబురాలు చేసుకుంది. అయితే.. ఈ మ్యాచ్‌ టైకి గంభీర్‌ చేసిన మూడు తప్పులు కూడా కారణమంటూ సోషల్‌ మీడియాలో విమర్శలు వస్తున్నాయి.

శ్రీలంకపై 231 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన టీమిండియాకు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అద్భుతమైన స్టార్ట్‌ అందించాడు. టీ20 స్టైల్లో బ్యాటింగ్‌ చేస్తూ.. ఆరంభ ఓవర్లలో మంచి స్కోర్‌ రాబట్టాడు. 47 బంతుల్లో 58 పరుగులు చేసి అవుట్‌ అయ్యాడు. అంతకంటే ముందు ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌ 16 రన్స్‌ చేసి అవుట్‌ అయ్యాడు. రోహిత్‌ అవుట్‌ అయిన తర్వాత శ్రేయస్‌ అయ్యర్‌ని కాకుండా.. లెఫ్ట్‌ రైట్‌ కాంబినేషన్‌ కోసం లోయర్‌ ఆర్డర్‌లో ఆడే వాషింగ్టన్‌సుందర్‌ను పంపించాడు గంభీర్‌. ఈ స్ట్రాటజీ ఫలించలేదు. సుందర్‌ 4 బంతుల్లో 5 రన్స్‌ చేసి పెవిలియన్‌ చేరాడు. దీన్ని ఒక బ్లండర్‌ మిస్టేక్‌గా క్రికెట్‌ నిపుణులు భావిస్తున్నాడు. లెఫ్ట్‌ రైట్‌ కాంబినేషన్‌ కావాలనుకుంటే.. సుందర్‌ స్థానంలో అక్షర్‌ పటేల్‌ లేదా శివమ్‌ దూబేను పంపితే బాగుండేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

అలాగే శివమ్‌ దూబేను ఏకంగా 8వ స్థానంలో బ్యాటింగ్‌కు దింపడం కూడా మ్యాచ్‌పై ప్రభావం చూపిందని ఫ్యాన్స్‌ అంటున్నారు. స్పిన్‌ను బాగా ఆడే దూబేను బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ముందు పంపి ఉంటే.. భారీ షాట్లు ఆడిన మ్యాచ్‌ అంత చివరి వరకు వెళ్లకుండా ఉండేదని, ప్రెషర్‌ కూడా క్రియేట్‌ అయ్యేదని కాదని అంటున్నారు. ఇక చివర్లో ఒక్క రన్‌ అవసరమైన సమయంలో బ్యాటింగ్‌కు వెళ్తున్న అర్షదీప్‌ సింగ్‌తో గంభీర్‌ మాట్లాడకపోవడం కూడా తప్పేనంటున్నారు క్రికెట్‌ పండితులు. పరిస్థితిని వివరిస్తూ.. అతను ఏం చేయాలో అర్థమయ్యేలా చెప్పి.. అతన్ని కామ్‌ డౌన్‌ చేసి పంపాల్సిందని ఫ్యాన్స్‌ కూడా అంటున్నారు. హెడ్‌ కోచ్‌గా గంభీర్‌ ఈ విషయాల్లో ఫెయిల్‌ అయ్యాడని చాలా మంది కామెంట్స్‌ చేస్తున్నారు.

ఇదే శ్రీలంకపై సూర్యకుమార్‌ యాదవ్‌ కెప్టెన్సీలోని యంగ్‌ టీమిండియా సిరీస్‌ను ‍క్లీన్‌స్వీప్‌ చేసిన విషయం తెలిసిందే. హెడ్‌ కోచ్‌గా గంభీర్‌కు అదే ఫస్ట్‌ టీ20 సిరీస్‌. 3-0తో లంకపై సిరీస్‌ గెలవడంతో హెడ్‌కోచ్‌గా గంభీర్‌కు మంచి స్టార్ట్‌ లభించింది. కానీ, వన్డేల్లో మాత్రం అలాంటి స్టార్ట్‌ను అందుకోలేకపోయాడు. వన్డే ఫార్మాట్‌లో హెడ్‌ కోచ్‌గా తొలి మ్యాచ్‌లో.. గెలవాల్సిన టీమిండియా టైతో సరిపెట్టుకుంది. ఇది ఒకరకంగా గంభీర్‌కు అవమానంగా భావించాల్సిందే. అయితే.. ఈ మ్యాచ్‌ టై అవ్వడానికి గంభీర్‌ తీసుకున్న పై మూడు నిర్ణయాలు కారణం అంటూ వస్తున్న విమర్శలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments