టీ20 వరల్డ్‌ కప్‌లో తొలి మ్యాచ్‌కి ముందే టీమిండియాకు బ్యాడ్‌న్యూస్‌!

India vs Ireland, Rain, T20 World Cup 2024: టీ20 వరల్డ్‌ కప్‌లో తొలి మ్యాచ్‌కు సిద్ధం అవుతున్న టీమిండియా గట్టి ఎదురుదెబ్బ తిగిలేలా ఉంది. మరి ఆ షాక్‌ ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

India vs Ireland, Rain, T20 World Cup 2024: టీ20 వరల్డ్‌ కప్‌లో తొలి మ్యాచ్‌కు సిద్ధం అవుతున్న టీమిండియా గట్టి ఎదురుదెబ్బ తిగిలేలా ఉంది. మరి ఆ షాక్‌ ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో టీమిండియా తమ తొలి మ్యాచ్‌కు సిద్ధం అయింది. బుధవారం పసికూన ఐర్లాండ్‌తో రోహిత్‌ సేన మ్యాచ్‌ ఆడనుంది. న్యూయార్క్‌లోని నసావు క్రికెట్‌ స్టేడియంలో ఈ మ్యాచ్‌ జరగనుంది. ఈ మ్యాచ్‌తోనే రోహిత్‌ సేన తమ వరల్డ్‌ కప్‌ వేటను మొదలుపెట్టనుంది. అయితే.. ఈ మ్యాచ్‌కి ముందు టీమిండియాకు ఆందోళన పరిచే ఒక బ్యాడ్‌ న్యూస్‌ తెలుస్తుంది. అదేంటంటే.. ఇండియా, ఐర్లాండ్‌ మధ్య జరిగే మ్యాచ్‌ వర్షం గండం ఉన్నట్లు అక్కడి వాతావరణ శాఖ వెల్లడించింది. ఒక వేళ వర్షం వచ్చి మ్యాచ్‌ రద్దు అయితే.. అది టీమిండియాకు పెద్ద ఎదురుదెబ్బగా మారనుంది. అది ఎలాగో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

ఇండియా – ఐర్లాండ్‌ మధ్య ఈ రోజు(జూన్‌ 5, బుధవారం) న్యూయార్క్‌లోని నసావు కౌంటీ క్రికెట్‌ స్టేడియంలో మ్యాచ్‌ జరగనుంది. అక్కడి లోకల్‌ టైమ్‌ ప్రకారం ఉదయం 10 గంటలకు, మన ఇండియా టైమ్‌ ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభం కానుంది. ఈ సమయంలో అక్కడ వర్షం వచ్చే అవకాశం 25 శాతం ఉన్నట్లు సమాచారం. ఒకవేళ వర్షం వస్తే.. మ్యాచ్‌ రద్దు అవుతుందా? లేక తక్కువ ఓవర్లతో మ్యాచ్‌ జరుగుతుందా? అని క్రికెట్‌ అభిమానులు కంగారు పడుతున్నారు. కాగా, ఒక వేళ వర్షం కారణంగా ఈ మ్యాచ్‌ రద్దు అయితే టీమిండియాకే నష్టం అని క్రికెట్‌ నిపుణులు అంటున్నారు.

ఈ టీ20 వరల్డ్‌ కప్‌లో టీమిండియా ఒకే ఒక వామప్‌ మ్యాచ్‌ ఆడింది. అది కూడా బంగ్లాదేశ్‌ లాంటి చిన్న టీమ్‌తో. దీంతో.. రోహిత్‌ సేనకు పెద్దగా ప్రాక్టీస్‌ దొరకలేదు. జూన్‌ 9న ఇదే నసావు క్రికెట్‌ స్టేడియంలో పాకిస్థాన్‌తో టీమిండియా మ్యాచ్‌ ఆడనుంది. వరల్డ్‌ కప్‌ టోర్నీల్లో పాక్‌పై టీమిండియాకు మంచి రికార్డ్‌ ఉన్నా.. టీ20 క్రికెట్‌లో పాక్‌ను తక్కువ అంచనా వేయకూడదు. అయితే.. పాక్‌తో ఎంతో కీలకమైన మ్యాచ్‌కి ముందు ఐర్లాండ్‌తో మ్యాచ్‌ జరిగిన మంచి ప్రాక్టీస్‌ దొరికినట్లు అవుతుందని టీమిండియా క్రికెటర్లు భావించారు. అది కాస్త వర్షం కారణంగా రద్దు అయితే.. ఎలా అని ఆందోళన చెందుతున్నారు. మరి వర్షం కారణంగా ఐర్లాండ్‌తో మ్యాచ్‌ జరగకపోతే.. టీమిండియాపై ఎలాంటి ప్రభావం ఉంటుందో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments