iDreamPost

స్కోర్‌ తక్కువే అయినా.. ఆసీస్‌కు అంత ఈజీగా కాదు! ఎందుకంటే?

  • Published Nov 19, 2023 | 6:24 PMUpdated Nov 19, 2023 | 6:24 PM

వన్డే వరల్డ్‌ కప్‌లో టీమిండియా తమ స్థాయికి తగ్గట్లు బ్యాటింగ్‌ చేయలేదని చాలా మంది భావిస్తున్నారు. కానీ, పిచ్‌ బ్యాటింగ్‌కు చాలా కష్టంగా ఉంది. అందుకే భారత్‌.. 240 రన్స్‌ మాత్రమే చేసింది. అయినా కూడా ఇంకా మనదే కప్పు. ఎందుకో ఇప్పుడు చూద్దాం..

వన్డే వరల్డ్‌ కప్‌లో టీమిండియా తమ స్థాయికి తగ్గట్లు బ్యాటింగ్‌ చేయలేదని చాలా మంది భావిస్తున్నారు. కానీ, పిచ్‌ బ్యాటింగ్‌కు చాలా కష్టంగా ఉంది. అందుకే భారత్‌.. 240 రన్స్‌ మాత్రమే చేసింది. అయినా కూడా ఇంకా మనదే కప్పు. ఎందుకో ఇప్పుడు చూద్దాం..

  • Published Nov 19, 2023 | 6:24 PMUpdated Nov 19, 2023 | 6:24 PM
స్కోర్‌ తక్కువే అయినా.. ఆసీస్‌కు అంత ఈజీగా కాదు! ఎందుకంటే?

వన్డే వరల్డ్‌ కప్‌ 2023 ఫైనల్‌లో టీమిండియా బ్యాటింగ్‌ అంచనాలకు తగ్గట్లు సాగలేదు. టాస్‌ గెలిచి తొలుత ఫీల్డింగ్‌ ఎంచుకున్న ఆస్ట్రేలియా అద్భుతంగా బౌలింగ్‌ వేసి, అంతకంటే గొప్పగా ఫీల్డింగ్‌ చేసింది. అందుకే పటిష్టమైన భారత బ్యాటింగ్‌ లైనప్‌ కేవలం 240 పరుగులకే పరిమితం అయింది. ఈ టోర్నీలో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఎలాగైతే వేగంగా ఆడాడో ఈ ఫైనల్‌లో కూడా అదే అగ్రెసివ్‌ ఇంటెంట్‌ను చూపించాడు. కానీ, మరో ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌ దారుణంగా విఫలం అయ్యాడు. ఆరంభం నుంచే ఇబ్బంది పడుతూ ఆడి గిల్‌.. కేవలం 7 బంతుల్లో 4 పరుగులు చేసి అవుట్‌ అయ్యాడు. కోహ్లీ హాఫ్‌ సెంచరీతో టీమిండియాను ఆదుకునే ప్రయత్నం చేశాడు.

ఒక వికెట్ పడినా.. రోహిత్‌ శర్మ వేగంగా ఆడే ప్రయత్నంలోనే వికెట్‌ పారేసుకున్నాడు. 47 పరుగులు చేసి అవుట్‌ అయ్యాడు. ఆ వెంటనే ఇన్‌ ఫామ్‌ బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌ సైతం అవుట్‌ కావడంతో టీమిండియా కష్టాల్లో పడింది. ఇక్కడి నుంచి కోహ్లీ-కేఎల్‌ రాహుల్‌ జోడీ భారత్‌ను ఆదుకున్నారు. నిదానంగా ఆడినా.. స్కోర్‌ను ముందుకు నడిపించాడు. పిచ్‌ స్లోగా ఉండటం, బ్యాటింగ్‌కు అంతగా అనుకూలంగా లేకపోవడం, ఆస్ట్రేలియా సూపర్‌ ఫీల్డింగ్‌తో పరుగులు రాకుండా కట్టడి చేయడంతో.. టీమిండియాపై తీవ్ర ఒత్తిడి పెరిగింది. ఇక కోహ్లీ అవుట్‌ అయిన తర్వాత.. టీమిండియా కోలుకోలేదు. కేఎల్‌ రాహుల్‌ 107 బంతుల్లో 66 పరుగులు చేసి.. సరిగ్గా స్కోరింగ్‌ రేట్‌ పెంచాల్సిన సమయంలో అవుట్‌ అయ్యాడు. జడేజా(9) రన్స్‌కే వెనుదిరిగాడు. ఇక సూర్య కుమార్‌యాదవ్‌ సైతం 18 పరుగులు మాత్రమే చేసి విఫలం అయ్యాడు. చివర్లో బౌలర్లు.. షమీ(6), బుమ్రా(1), కుల్దీప్‌ యాదవ్‌ (10) పరుగులు చేసి అవుట్‌ అయ్యారు. సిరాజ్‌ 9 రన్స్‌తో నాటౌట్‌గా నిలిచాడు.

అయితే.. టీమిండియా తక్కువ స్కోర్‌ మాత్రమే చేసినా.. మన బౌలింగ్‌ ఎటాక్‌ ఈ టోర్నీలో నంబర్‌ వన్‌ బౌలింగ్‌ ఎటాక్‌గా ఉంది. షమీ, బుమ్రా, సిరాజ్‌, కుల్దీప్‌ యాదవ్‌, జడేజా సూపర్‌ ఫామ్‌లో ఉన్నారు. వీరింతా వారి స్థాయికి తగ్గట్లు బౌలింగ్‌ చేస్తే.. ఆస్ట్రేలియాకు 241 పరుగులు చేయడం అంత సులువైన విషయం కాదు. అయితే.. గ్రౌండ్‌లో డ్యూ(తేమ) రాకుంటే.. టీమిండియా బౌలర్లకు కూడా పిచ్‌ నుంచి మద్దతు లభించే అవకాశం ఉంది. డ్యూ వస్తే ఆస్ట్రేలియాకు కాస్త హెల్ప్‌ లభించే ఛాన్స్‌ ఉంది. ఏది ఏమైనా.. టీమిండియా బౌలింగ్‌ ఎటాక్‌ను తట్టుకుని ఆసీస్‌ 241 పరుగులు చేయడం అంత సులువు కాదని క్రికెట్‌ నిపుణులు సైతం పేర్కొంటున్నారు. సో.. క్రికెట్‌ ఫ్యాన్స్‌ పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇప్పటికీ కూడా టీమిండియా విజయావకాశాలు పుష్కలంగానే ఉన్నాయి. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి