సాధారణంగా చాలా మంది కోరుకున్న రంగంలో స్థిరపడాలని కలలు కంటూ ఉంటారు. కానీ అలా కలలు కన్నట్లుగా అందరు సక్సెస్ కాలేరు. ఇక ఈ విషయాన్ని గమనించిన కొందరు వ్యక్తులు వేరే రంగాల్లోకి వెళ్లి విజయం సాధించిన సంఘటనలు దేశంలో అనేకం ఉన్నాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యక్తి కథ కూడా ఇలాంటిదే. క్రికెట్ లో స్థిరపడాలని వచ్చిన ఆ వ్యక్తి.. దాంట్లో రాణించలేనని తెలిసి మరో రంగాన్ని ఎంచుకుని అక్కడ సక్సెస్ అయ్యాడు. సచిన్, గంగూలీ, ద్రవిడ్ లాంటి దిగ్గజాలతో కలిసి ఆడిన ఆ వ్యక్తి పేరు అమయ్ ఖురేసియా. ఇప్పుడు అతడు ఓ IAS ఆఫీసర్. అమయ్ క్రికెటర్ నుంచి IAS ఆఫీసర్ గా ఎలా మారాడో తెలియాలి అంటే ఈ కథనం చదవాల్సిందే.
అమయ్ ఖురేసియా.. 1972లో మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ లో పుట్టాడు. చిన్నతనం నుంచే ఇటు క్రికెట్ లో.. అటు చదువులో రెండింట్లో అదరగొట్టేవాడు. దాంతో 1990లో 17ఏళ్లకే మధ్యప్రదేశ్ నుంచి ఫస్ట్ క్లాస్ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత తన ఆటతో తక్కువ కాలంలోనే టీమిండియాలోకి వచ్చాడు. సచిన్, సెహ్వాగ్, గంగూలీ, అజయ్ జడేజా, ద్రవిడ్ లాంటి స్టార్ ప్లేయర్లతో కూడిన టీమిండియా జట్టులో సభ్యుడిగా అమయ్ ఉన్నాడు. ఆడిన తొలి మ్యాచ్ లోనే దుమ్మురేపిన అతడు.. శ్రీలంకపై 45 బంతుల్లోనే 57 పరుగులు చేశాడు. పెప్సీ కప్ లో రాణించడం ద్వారా.. 1999 వరల్డ్ కప్ కు ఎంపికైయ్యాడు. కానీ ఈ మెగా టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. అదీకాక ఈ టోర్నీ తర్వాత జట్టులో మళ్లీ చోటు దక్కలేదు. కొంతకాలం నిరీక్షణ తర్వాత.. తన కెరీర్ ఇది కాదని 2007లో క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు.
ఇక ఇండియా తరపున అమయ్ కేవలం 12 వన్డేలు మాత్రమే ఆడాడు. క్రికెట్ కు వీడ్కోలు పలికిన తర్వాత అతడు సివిల్స్ వైపు తన అడుగులు వేశాడు. ఇక్కడ అసలు విషయం ఏంటంటే? క్రికెట్ లోకి అడుగుపెట్టక ముందే యూపీఎస్సీ పరీక్ష క్లియర్ చేశాడు అమయ్. క్రికెట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత యూపీఎస్సీ లో ర్యాంక్ సాధించాడు. ప్రస్తుతం ఆయన ఇండియన్ కస్టమ్స్ & సెంట్రల్ ఎక్త్సైజ్ డిపార్ట్ మెంట్ లో పనిచేస్తున్నారు. ఐఏఎస్ గా ఒకవైపు బ్యూరోక్రాట్ గా విధులు నిర్వర్తిస్తూనే.. టీమిండియాలోని కొందరు యంగ్ ప్లేయర్లకు కోచ్ గా, మెంటర్ గా పనిచేస్తున్నారు. అమయ్ ఖురేసియా దగ్గర రజత్ పాటిదార్, ఆవేశ్ ఖాన్ లాంటి యువ ప్లేయర్స్ మెలకువలు నేర్చకుంటున్నారు. ప్రస్తుత యంగ్ జనరేషన్ కు అమయ్ ఖురేసియా ఓ ఇన్స్పిరేషన్ అనే చెప్పాలి. ఒక రంగంలో రాణించకపోతే.. మరే ఇతర రంగంలో కూడా రాణించలేం అని తమ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు చాలా మంది యువత. వారికి అమయ్ ఖురేసియా జీవితం ఓ నేర్చుకోదగ్గ పాఠం. మరి క్రికెటర్ నుంచి ఐఏఎస్ గా మారిన అమయ్ ఖురేసియాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.