iDreamPost

కివీస్‌పై టీమిండియాదే విజయం! 12 ఏళ్ల నుంచి అదే సెంటిమెంట్‌

  • Published Nov 11, 2023 | 6:41 PMUpdated Nov 11, 2023 | 9:18 PM

వరుసగా 8 విజయాలు సాధించినా కూడా.. న్యూజిలాండ్‌తో సెమీస్‌ అనగానే.. ఇండియన్‌ క్రికెట్‌ ఫ్యాన్స్‌లో అలజడి మొదలైంది. ఎక్కడ 2019 తరహా ఫలితం రిపీట్‌ అవుతుందేమోనని, కానీ, ఆ దిగులు మీకు అక్కర్లేదు. ఎందుకంటే.. 12 ఏళ్ల సెంటిమెంట్‌ టీమిండియాకు అనుకూలంగా ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం..

వరుసగా 8 విజయాలు సాధించినా కూడా.. న్యూజిలాండ్‌తో సెమీస్‌ అనగానే.. ఇండియన్‌ క్రికెట్‌ ఫ్యాన్స్‌లో అలజడి మొదలైంది. ఎక్కడ 2019 తరహా ఫలితం రిపీట్‌ అవుతుందేమోనని, కానీ, ఆ దిగులు మీకు అక్కర్లేదు. ఎందుకంటే.. 12 ఏళ్ల సెంటిమెంట్‌ టీమిండియాకు అనుకూలంగా ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం..

  • Published Nov 11, 2023 | 6:41 PMUpdated Nov 11, 2023 | 9:18 PM
కివీస్‌పై టీమిండియాదే విజయం! 12 ఏళ్ల నుంచి అదే సెంటిమెంట్‌

వన్డే వరల్డ్‌ కప్‌ 2023 తుది దశలకు చేరుకుంది. ఆదివారం ఇండియా-నెదర్లాండ్స్‌ మధ్య చివరి లీగ్‌ మ్యాచ్‌ తర్వాత.. కేవలం రెండు సెమీ ఫైనల్స్‌, ఫైనల్‌ మాత్రమే మిగిలి ఉన్నాయి. వాటితో ఈ మెగా టోర్నీ ముగుస్తుంది. ఇప్పటికే టీమిండియా, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా అధికారికంగా సెమీస్‌కు అర్హత సాధించాయి. ఇక నాలుగో స్థానంలో న్యూజిలాండ్‌ సెమీస్‌కు చేరింది. ర్యాంకింగ్స్‌ ప్రకారం.. మొదటి స్థానంలో ఉన్న టీమిండియా, నాలుగో ప్లేస్‌లో ఉన్న కివీస్‌తో తొలి సెమీస్‌లో తలపడనుంది. రెండు, మూడు స్థానాల్లో నిలిచిన సౌతాఫ్రికా, ఆసీస్‌ రెండో సెమీ ఫైనల్‌లో ఆడతాయి. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఈ వరల్డ్‌ కప్‌లో టీమిండియాకు ఓటమి అనేదే తెలియదు. జట్టు సూపర్‌ ఫామ్‌లో ఉంది. అయినా కూడా న్యూజిలాండ్‌తో సెమీస్‌ అనగానే భారత క్రికెట్‌ అభిమానుల్లో ఒకింత ఆందోళన నెలకొంది.

అందుకు కారణం.. 2019 వన్డే వరల్డ్‌ కప్‌లో సెమీ ఫైనల్‌లోనే న్యూజిలాండ్‌ చేతిలో టీమిండియా ఓటమి పాలు కావడం. 2019 అనే కాదు.. మెగా టోర్నీల్లో న్యూజిలాండ్‌పై టీమిండియా అంత మంచి రికార్డ్‌ లేదు. ముఖ్యంగా నాటౌట్‌ మ్యాచ్‌లు న్యూజిలాండ్‌తో పడితే.. టీమిండియా ఇబ్బంది పడుతుంది. ఇప్పుడు కూడా 2019 సీన్‌ రిపీట్‌ అవుతుందేమో అని ఇండియన్‌ క్రికెట్‌ ఫ్యాన్స్‌ ఆందోళన చెందుతున్నారు. వాళ్లందరిని కాస్త కూల్‌ చేసే విషయం ఒకటుంది. ఒకటి కాదు రెండు కాదు దాదాపు 12 ఏళ్ల నుంచి కొనసాగుతున్న ఓ సెంటిమెంట్‌ టీమిండియాకు అనుకూలంగా ఉంది. అదే మళ్లీ రిపీట్‌ అయితే.. రాసిపెట్టుకోండి కివీస్‌పై టీమిండియాదే విజయం.

ఆ సెంటిమెంట్‌ ఏంటంటే? 2011 వన్డే వరల్డ్‌ కప్‍లో న్యూజిలాండ్‌ సెమీ ఫైనల్‌లో శ్రీలంక చేతిలో ఓడిపోయింది. ఆ మ్యాచ్‌ శ్రీలంకలోని కొలంబోలో జరిగింది. 2011 వన్డే వరల్డ్‌ కప్‌ను ఇండియా, శ్రీలంక, బంగ్లాదేశ్‌ సంయుక్తంగా నిర్వహించాయి. అలాగే 2015 వన్డే వరల్డ్‌ కప్‌ ఫైనల్‌లో న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. ఆ మ్యాచ్‌ మెల్‌బోర్న్‌లో జరిగింది. ఇక 2019 వన్డే వరల్డ్‌ కప్‌లో కూడా ఫైనల్‌ ఆడిన న్యూజిలాండ్‌ ఇంగ్లండ్‌ చేతిలో ఓటమి పాలైంది. ఆ మ్యాచ్‌ లండన్‌లో జరిగింది.

ఈ మూడు వరల్డ్‌ కప్స్‌లో కామన్‌ పాయింట్‌ ఒకటుంది. అదేంటంటే.. వరల్డ్‌ కప్‌ టోర్నీకి ఆతిథ్యం ఇచ్చిన జట్టు చేతిలో న్యూజిలాండ్‌.. సెమీ ఫైనల్‌ ఆడినా, ఫైనల్‌ ఆడిన ఓటమి పాలవుతోంది. సో.. ఇప్పుడు ఇండియా-న్యూజిలాండ్‌ సెమీ ఫైనల్‌ ముంబైలోని వాంఖడే క్రికెట్‌ స్టేడియంలో జరగనుంది. మరి ఈ వరల్డ్‌ కప్‌కు ఇండియానే ఆతిథ్యం ఇస్తుంది కనక.. ఈ సెమీస్‌లో కూడా న్యూజిలాండ్‌కు ఓటమి తప్పదు. మొత్తం మీద హోస్ట్‌ కంట్రీపై సెమీస్‌, ఫైనల్‌లో న్యూజిలాండ్‌ గెలిచి దాదాపు 12 ఏళ్లు అవుతుంది. ఇప్పుడ ఇదే సెంటిమెంట్‌ భారత క్రికెట్‌ అభిమానుల్లో జోష్‌ నింపుతోంది. మరి ఈ సెంటిమెంట్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి