Tillu Square Review: సిద్ధు జొన్నలగడ్డ ‘టిల్లు స్క్వేర్’ మూవీ రివ్యూ!

Tillu Square Review & Rating in Telugu: సిద్ధు జొన్నలగడ్డ మరోసారి తన హ్యూమర్​తో ఆడియెన్స్​ను కడుపుబ్బా నవ్వించడానికి ‘టిల్లు స్క్వేర్’తో వచ్చేశారు. మరి.. సీక్వెల్​తో స్టార్ బాయ్ హిట్ కొట్టాడా? లేదా? ఇప్పుడు తెలుసుకుందాం..

Tillu Square Review & Rating in Telugu: సిద్ధు జొన్నలగడ్డ మరోసారి తన హ్యూమర్​తో ఆడియెన్స్​ను కడుపుబ్బా నవ్వించడానికి ‘టిల్లు స్క్వేర్’తో వచ్చేశారు. మరి.. సీక్వెల్​తో స్టార్ బాయ్ హిట్ కొట్టాడా? లేదా? ఇప్పుడు తెలుసుకుందాం..

టిల్లు స్క్వేర్

20240329, యాక్షన్, రొమాంటిక్, డ్రామా, 2h 3m U/A
U/A
  • నటినటులు:సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ‌, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్
  • దర్శకత్వం:మల్లిక్ రామ్
  • నిర్మాత:నాగ వంశీ
  • సంగీతం:రామ్ మిరియాల, అచ్చు రాజమణి
  • సినిమాటోగ్రఫీ:సాయిప్రకాష్, ఉమ్మడిసింగు

Rating

3.25

ఒకే ఒక్క సినిమాతో ఓవర్​నైట్ స్టార్​డమ్ తెచ్చుకున్న హీరోగా స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డను చెప్పొచ్చు. ‘డీజే టిల్లు’ మూవీతో యూత్​ ఆడియెన్స్​లో ఫుల్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు సిద్ధు. తెలంగాణ యాసలో ఆయన చెప్పే డైలాగులు, కామెడీకి ప్రేక్షకులు ఫుల్ ఫిదా అయిపోయారు. ఇన్నాళ్లూ ఎక్కడ ఉన్నావ్ బాస్? అంటూ ఆయనకు ఫ్యాన్స్​గా మారిపోయారు. అలాంటి సిద్ధు మరోమారు ఆడియెన్స్ ముందుకు వచ్చేశారు. ఆయన యాక్ట్ చేసిన ‘టిల్లు స్క్వేర్’ శుక్రవారం రిలీజ్ అయింది. మరి. ఈ సినిమా ఎక్స్​పెక్టేషన్స్​ను అందుకుందా? లేదా? అనేది రివ్యూలో చూద్దాం..

కథ:

రాధికా ఎపిసోడ్ నుంచి కోలుకున్న టిల్లు (సిద్ధు జొన్నలగడ్డ) తన ఫ్యామిలీ, ఫ్రెండ్స్​తో కలసి టిల్లు ఈవెంట్స్ మొదలుపెడతాడు. వెడ్డింగ్ ప్లానింగ్​లు, అలాగే డీజీ ఈవెంట్స్ చేస్తుంటాడు. ఈ క్రమంలో ఓ రోజు అతడి లైఫ్​లోకి లిల్లీ జోసెఫ్ (అనుపమ పరమేశ్వరన్) ఎంటర్ అవుతుంది. అక్కడి నుంచి టిల్లు మళ్లీ గేర్ మారుస్తాడు. ఇద్దరూ ప్రేమలో పడతారు. అయితే బర్త్ డే నాడు టిల్లును సాయం కోరుతుంది లిల్లీ. ఆల్రెడీ రాధికా చేతిలో దెబ్బ తిన్న టిల్లు ఏం చేస్తాడు? వీళ్ల స్టోరీలోకి మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ మెహబూబ్ అలీ (మురళీశర్మ) ఎలా వచ్చాడు? ఇండియన్ స్పెషల్ ఫోర్స్ ఎందుకు వచ్చింది? చివరికి ఏమైంది అనేది సిల్వర్ స్క్రీన్ మీద చూసి తెలుసుకోవాలి.

విశ్లేషణ:

‘డీజే టిల్లు’లో అన్నింటి కంటే ఎక్కువగా హీరో క్యారెక్టరైజేషన్ హైలైట్ అయింది. ఆ పాత్ర చెప్పే డైలాగులు, పండించే వినోదం సూపర్బ్​గా వర్కౌట్ అయింది. అందుకే సీక్వెల్​లో కూడా దీన్నే ఫాలో అయ్యారు మేకర్స్. ఫస్ట్ సీన్ నుంచి టిల్లు క్యారెక్టర్​తో హిలేరియస్​ ఎంటర్​టైన్​మెంట్​ను సెట్ చేశారు. అది బాగా వర్కౌట్ అయింది. రాధిక రీఎంట్రీ, క్లైమాక్స్​లో రీరికార్డింగ్ అదిరిపోయాయి. అయితే టిల్లు క్యారెక్టర్​ నుంచి ఆశించిన వినోదం, హీరోహీరోయిన్ల మధ్య కెమెస్ట్రీ వర్క్ అవడం ఓకే. కానీ స్టోరీ పరంగా కొత్తదనం మాత్రం లేదు. ఇంటర్వెల్ తర్వాత కామెడీ డోస్ తగ్గింది. కొన్ని పంచ్ డైలాగులు నవ్విస్తాయి.. గానీ ట్విస్టులు మాత్రం అంతగా వర్కౌట్ కాలేదు.

నటీనటులు-టెక్నికల్ పనితీరు:

టిల్లు క్యారెక్టర్​కు ఉన్న వైబ్​ను మరింత పెంచడంలో సినిమాటోగ్రఫీ కీ రోల్ ప్లే చేసింది. అలాగే రామ్ మిరియాల కంపోజ్ చేసిన ‘డీజే టిల్లు..’ రీమిక్స్ పాట అదిరిపోయింది. ‘రాధికా రాధికా’ సాంగ్ కూడా బాగుంది. అచ్చు రాజమణి అందించిన ‘ఓ మై లిల్లీ’ పాట కూడా మంచి అటెన్షన్ తీసుకుంది. ఈ సినిమాకు రీరికార్డింగ్ మరో బలం అని చెప్పొచ్చు. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ప్రతి ఫ్రేమ్​లో రిచ్​నెస్ కనిపించింది.

టిల్లు పాత్రలో సిద్ధు జొన్నలగడ్డ మరోసారి చెలరేగిపోయారు. ఆయన ఎనర్జీ, డైలాగ్ డెలివరీ, ప్రతిదీ పర్ఫెక్ట్​ నోట్​లో ఉండటం విశేషం. అయితే ఈ మూవీలో సర్​ప్రైజ్ ప్యాకేజ్ అంటే హీరోయిన్ అనుపమనే. టీజర్, ట్రైలర్​లో ఆమె గ్లామర్​తో అట్రాక్ట్ చేసినా సినిమాలో మాత్రం ట్విస్టులు, క్యారెక్టర్ ట్రాన్స్​ఫర్మేషన్​తో సర్​ప్రైజ్ చేస్తారు అనుపమ. గెస్ట్ రోల్​లో రాధికగా కనిపించి అలరించారు నేహాశెట్టి. ఆమె ఎంట్రీ సీన్ సూపర్బ్. టిల్లు తండ్రిగా మురళీధర్ గౌడ్, మార్కస్​గా ప్రణీత్ రెడ్డి నవ్వించారు. ప్రిన్స్, మురళీశర్మ రోల్స్ చాలా లిమిటెడ్.

బలాలు:

  • ఎంటర్​టైన్​మెంట్
  •  సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ యాక్టింగ్
  •  మ్యూజిక్

బలహీనతలు:

  • రొటీన్ కాన్సెప్ట్
  • ఎగ్జైట్ చేయని ట్విస్ట్​లు
  •  క్లైమాక్స్

చివరిగా: ‘టిల్లు స్క్వేర్’ ఔట్ అండ్ ఔట్ ఎంటర్​టైనర్!

రేటింగ్: 3.25/5

(*గమనిక: ఈ రివ్యూ సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)
Show comments