Tiger Nageswararao Review: రవితేజ ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమా రివ్యూ

మాస్ మహారాజ రవితేజ సినిమా అంటే థియేటర్లలో మాస్ రచ్చ మొదలవుతుంది. పైగా వరుస విజయాలతో జోరు మీదున్న రవితేజ.. ఇప్పుడు భారతదేశ అతిపెద్ద దొంగ అయిన టైగర్ నాగేశ్వరరావు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు

మాస్ మహారాజ రవితేజ సినిమా అంటే థియేటర్లలో మాస్ రచ్చ మొదలవుతుంది. పైగా వరుస విజయాలతో జోరు మీదున్న రవితేజ.. ఇప్పుడు భారతదేశ అతిపెద్ద దొంగ అయిన టైగర్ నాగేశ్వరరావు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు

Tiger Nageswararao

20231020, యాక్షన్, డ్రామా , 3h 2min U/A
U/A
  • నటినటులు:రవితేజ, అనుపమ్ ఖేర్, నాసర్, రేణు దేశాయ్
  • దర్శకత్వం:వంశీ
  • నిర్మాత:అభిషేక్ అగర్వాల్
  • సంగీతం:G. V. ప్రకాష్ కుమార్
  • సినిమాటోగ్రఫీ:R. మధి

Rating

2.75

మాస్ మహారాజ రవితేజ సినిమా అంటే థియేటర్లలో మాస్ రచ్చ మొదలవుతుంది. పైగా వరుస విజయాలతో జోరు మీదున్న రవితేజ.. ఇప్పుడు భారతదేశ అతిపెద్ద దొంగ అయిన టైగర్ నాగేశ్వరరావు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇది స్టువర్టుపురం నాగేశ్వరరావు అనే గజదొంగ బయోపిక్ కావడంతో ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో స్టువర్టుపురం పేరిట ఎన్నో కథలు ఉన్నాయి. ఆ కథల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఎలా ఉంటుందో అంటూ ఆడియన్స్ లో ఆసక్తి మొదలైంది. మరి.. ఆ అంచనాలను టైగర్ నాగేశ్వరరావు అందుకున్నాడా? తెలియాలంటే ఈ రివ్యూ పూర్తిగా చదివేయండి.

కథ:

ఈ కథ ఢిల్లీ ఐబీ ఆఫీస్ లో మొదలవుతుంది. ఏకంగా ప్రధానమంత్రి సెక్యూరిటీకి నాగేశ్వరరావు వల్ల థ్రెట్ ఉందని తెలిసి.. అతని గురించి తెలుసుకోవాలి అనుకుంటారు. అందుకే విశ్వనాథ శర్మ(మురళీ శర్మ) అనే గుంటూరు సీఐని ఢిల్లీ పిలిపించి నాగేశ్వరరావు అంటే ఎవరో తెలుసుకుంటారు. బాపట్ల, చీరాల, స్టువర్టుపురం మొత్తాన్ని టైగర్ రేంజ్ అంటారు. అక్కడ పులులు ఉంటాయని కాదు.. టైగర్ నాగేశ్వరరావు ఉంటాడని దానికి ఆ పేరు వచ్చింది. చెప్పి దొంగతనం చేయడం నాగేశ్వరరావు స్టైల్. అతని పేరు వినగానే పోలీసులు, ప్రభుత్వానికి వెన్నులో వణుకుపుడుతుంది. అతను ఒక బిగ్గెస్ట్ క్రిమినల్ అనే విషయం ఢిల్లీ వరకు వెళ్తుంది. కానీ, స్టువర్టుపురం ప్రజలకు మాత్రం నాగేశ్వరరావు దేవుడి కంటే ఎక్కువ. అయితే ఒక్కడు పోలీసులు, ప్రభుత్వాన్ని ఎలా భయపెడుతున్నాడు? చెప్పి కూడా దొంగతనం ఎలా చేస్తున్నాడు? ఎందుకు స్టువర్టుపురం వాళ్లు సామాన్య ప్రజల్లా జీవిచడం లేదు? అసలు ప్రధాని సెక్యూరిటీకి నాగేశ్వరరావు థ్రెట్ ఎలా అయ్యాడు? అనే ప్రశ్నలకు సమాధానాం కావాలి అంటే మీరు థియేటర్లలో టైగర్ నాగేశ్వరరావు సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:

సాధారణంగా క్రిమినల్ ని హీరోగా చేసి సినిమాలు తీయడం సినిమా ఇండస్ట్రీలో కామన్ అయిపోయింది. అయితే అతను క్రిమినల్ కాదు.. హీరో అనే భావన కలిగేలా సినిమా తీస్తున్నారా? లేదా? అనేది ఇక్కడ ప్రశ్న. ఆ విషయంలో డైరెక్టర్ వంశీ సక్సెస్ అయ్యాడు అనే చెప్పాలి. ఎందుకంటే సినిమా అంతా అయ్యాక ప్రేక్షకులు కూడా నాగేశ్వరరావును ఇండియన్ రాబిన్ హుడ్ అని ఒప్పుకుంటారు. అలాంటి నాగేశ్వరరావును అర్థం చేసుకోవడం అంత తేలిక కాదు. ఎందుకంటే నాగేశ్వరరావు 8 ఏళ్ల వయసులో తండ్రితో కలిసి దొంగతనానికి వెళ్తాడు. అక్కడ తన తండ్రి దొరికిపోతాడు. అలా దొరికిపోయాడని కన్న తండ్రి తల నరికి తీసుకెళ్తాడు. పిలిస్తే.. నెలసరి అని రాను అంటే.. ఒక వేశ్యను కడుపులో తన్ని అసభ్యంగా ప్రవర్తిస్తాడు. అంతటి క్రూరమైన వ్యక్తిని ఒక ఊరు ప్రజలు దేవుడు అని ఎలా అనుకుంటారు? అనే ప్రశ్న సినిమా చూస్తున్నప్పుడు ఆడియన్ మదిలో మెదులుతూ ఉంటుంది. అయితే ఒక క్రిమినల్ ని కూడా దేవుడు అని భావించేలా ఆడియన్స్ ని ఎంగేజ్ చేసిన విధానం బాగా నచ్చుతుంది.

ఒక సామాన్యమైన దొంగ.. ఏకంగా దేశ ప్రధాన మంత్రికి బెదిరింపు లేఖ రాయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. భారతదేశ ప్రధాన మంత్రి ఒక దొంగను పొగుడుతూ ఉండటం కాస్త కృతకంగా ఉంటుంది. కానీ, సినిమాలో మాత్రం ఆ సీన్లను చాలా కన్విన్సింగ్ చూపించడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. ఫస్ట్ ఆ సీన్లు చూసినప్పుడు సార్.. ది ఈజ్ టూ మచ్ అనే భావన కలుగుతుంది. ఇదంతా మీరు ఫస్ట్ హాఫ్ చూస్తున్నంత సేపు కలిగే భావన అది. సెకండాఫ్ మొదలయ్యాక హీరోపై, అతని క్యారెక్టర్ పై అభిప్రాయాలు మారుతూ ఉంటాయి. హీరో చేసిందాంట్లో తప్పేముంది సార్ అని డైరెక్టర్ మీతోనే చెప్పిస్తాడు. కథ కూడా చాలా రొటీన్ కథను చూస్తున్న అభిప్రాయమే కలుగుతుంది. కానీ, కథనం పరంగా మాత్రం టైగర్ నాగేశ్వరరావు సినిమా చాలా బాగా నచ్చుతుంది. ప్రెజెంట్, ఫ్లాష్ బ్యాక్ గురించి మార్చి మార్చి చెప్పిన నావల్ నరేషన్ ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది. ముఖ్యంగా ప్రతినాయకుడు, హీరో తిరగబడేలా అక్కడ ఏర్పడిన సంఘటనలు మిమ్మల్ని ఆవేశ పడేలా చేస్తాయి. ఒక్కొక్క సీన్ లో సీటులో కూర్చున్న ఆడియన్స్ రక్తం కూడా మరిగిపోతుంది. కన్నీళ్లు తెప్పించే సీన్లు కూడా చాలానే ఉంటాయి.

నాగేశ్వరరావు.. అంత పెద్ద దొంగగా మారే సందర్భం, అందుకు ఉన్న కారణం అందరినీ ఉద్వేగానికి గురి చేస్తుంది. అయితే టేకింగ్ పరంగా మాత్రం టైగర్ నాగేశ్వరరావుకు కొంచం మార్కులు తక్కువ పడే అవకాశం ఉంటుంది. నాగేశ్వరరావు క్యారెక్టర్ ను ఎలివేట్ చేసే ఒక ట్రైన్ దొంగతనం సీన్.. చూడటానికి చాలా దారుణంగా అనిపిస్తుంది. అక్కడ గ్రాఫిక్స్ మరీ తేలిపోతాయి. హీరో.. హీరోయిజాన్ని ఎలివేట్ చేసే ఒక సీన్ ని ఇంత దారుణంగా తీశారు ఏంటి అనే భావన కలుగుతుంది. 1970నాటి పరిస్థితులను చూపించే విషయంలో డైరెక్టర్ కొద్దిగా తడపడినట్లు అనిపిస్తుంది. ముఖ్యంగా క్యారెక్టర్స్ వేషధారణ అంత కన్విన్సింగ్ గా ఉండదు. కానీ, స్ట్రాంగ్ స్ర్కీన్ ప్లేతో ఈ తప్పులు హైలెట్ కాకుండా డైరెక్టర్ జాగ్రత్త పడ్డాడు.

ఎవరెలా చేశారు?:

మాస్ మహారాజ రవితేజ యాక్టింగ్ కు పేరు పెట్టాల్సిన అవసరం లేదు. ప్రతి సీన్ లో ప్రేక్షకులను అలరిస్తారు. ముఖ్యంగా యాక్షన్, ఎమోషనల్ సీన్స్ లో రవితేజ బాగా నచ్చేస్తాడు. ఎప్పటికప్పుడు ఫ్రెష్ యాక్టింగ్ తో ప్రేక్షకులను అలరించడంలో రవితేజ ముందుంటాడు. రవితేజ తర్వాత.. ఈ సినిమాలో ప్రతినాయకుడు హరీష్ పెరాడి, సీఐగా చేసిన జిష్షు సేన్ గుప్తా పాత్రలు గుర్తుండిపోతాయి. వీళ్లను స్క్రీన్ మీద చూసిన ప్రతిసారి ఆడియన్స్ లో కోపం కట్టలు తెంచుకుంటుంది. నెగిటివ్ పాత్రలను వీళ్లిద్దరు ఎంతో చక్కగా చేశారు. వీళ్ల తర్వాత హీరోయిన్లుగా చేసిన నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ క్యారెక్టర్లు ఆకట్టుకుంటాయి. ప్రేక్షకులను ఎంగేజ్ చేయడంలో వీళ్లు బాగా సక్సెస్ అయ్యారు. ఎమోషనల్ సీన్స్ లో వీళ్ల యాక్టింగ్ మెప్పిస్తుంది. అనుపమ్ ఖేర్, రేణు దేశాయ్, నాజర్, మురళి శర్మ, ప్రదీప్ రావత్ వంటి సపోర్టింగ్ పాత్రలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. వీళ్ల పాత్ర పరిధి మేరకు చాలా బాగా యాక్ట్ చేశారు. రేణుదేశాయ్ కూడా చాలా గ్యాప్ తర్వాత మంచి పాత్రలో నటించి మెప్పించారు. హీరో గ్యాంగ్ ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది.

టెక్నికల్ వర్క్:

కథను చెప్పడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. కానీ, స్క్రీన్ మీద అక్కడక్కడ కొన్ని సన్నివేశాలు తేలిపోతాయి. ముఖ్యంగా సీజీ వర్క్ విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకుని ఉంటే బాగుండేది. జీవీ ప్రకాశ్ సంగీతం ఆకట్టుకుంటుంది. పోరాటసన్నివేశాల్లో బ్యాగ్రౌండ్ మ్యూజిక్ మంచి అసెట్ లా అనిపిస్తుంది. శ్రీకాంత్ విస్సా రాసిన డైలాగులు ప్రేక్షకుల హృదయాల్లో గుచ్చుకుంటాయి. భావోద్వేగ సన్నివేశాల్లో డైలాగులు మెప్పిస్తాయి. నిర్మాణ విలువలు కూడా బాగానే ఉన్నాయి. ఫస్టాఫ్ లో మాత్రం ఇంకాస్త కోత పడితే బాగుండు అనిపిస్తుంది.

ప్లస్ లు:

  • రవితేజ
  • కథనం
  • ఎమోషన్
  • స్టువర్టుపురం బ్యాగ్ డ్రాప్

మైనస్:

  • గ్రాఫిక్స్
  • అక్కడక్కడ సాగదీత
  • నిడివి

చివరిగా: టైగర్ నాగేశ్వరరావు.. చెప్పి మరీ ఆడియన్స్ దిల్ చోరీ చేశాడు!

రేటింగ్: 2.75/5

(ఈ రివ్యూ సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)

Show comments