Thangalaan Movie Review And Rating In Telugu: తంగలాన్ సినిమా రివ్యూ

Thangalaan Review: తంగలాన్ సినిమా రివ్యూ

Thangalaan Movie Review And Rating In Telugu: చియాన్ విక్రమ్ ఒక కొత్త ప్రపంచాన్ని పరిచేస్తూ తీసుకొచ్చిన చిత్రమే తంగలాన్. మరి.. ప్రేక్షకులు పెట్టుకున్న అంచనాలను తంగలాన్ రీచ్ అయ్యాడా? ఈ రివ్యూ చూసి తెలుసుకోండి.

Thangalaan Movie Review And Rating In Telugu: చియాన్ విక్రమ్ ఒక కొత్త ప్రపంచాన్ని పరిచేస్తూ తీసుకొచ్చిన చిత్రమే తంగలాన్. మరి.. ప్రేక్షకులు పెట్టుకున్న అంచనాలను తంగలాన్ రీచ్ అయ్యాడా? ఈ రివ్యూ చూసి తెలుసుకోండి.

తంగలాన్

15/08/2024, హిస్టారికల్ అడ్వంచర్, 2h36m U/A
U/A
  • నటినటులు:విక్రమ్, పార్వతీ తిరువత్తు, మాళవికా మోహనన్, తదితరులు
  • దర్శకత్వం:పా రంజిత్
  • నిర్మాత:కేఈ జ్ఞానవేల్ రాజా
  • సంగీతం:జీవీ ప్రకాశ్ కుమార్
  • సినిమాటోగ్రఫీ:కిశోర్ కుమార్

Rating

2.5

చియాన్ విక్రమ్ కు తెలుగులో కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉంది. అతని చిత్రాలకు మంచి ఆదరణ కూడా ఉంది. అపరిచితుడు, ఐ వంటి చిత్రాల ద్వారా టాలీవుడ్ ప్రేక్షకులకు చాలా దగ్గరయ్యాడు. అందుకే విక్రమ్ సినిమా వస్తోంది అంటే తెలుగు ప్రేక్షకులు కూడా ఎగ్జైట్ అవుతూ ఉంటారు. అలాంటి విలక్షణ హీరో నుంచి వచ్చిన సరికొత్త ప్రయోగమే తంగలాన్ చిత్రం. టీజర్, ట్రైలర్లతో ఈ మూవీపై భారీగానే అంచనాలను పెంచేశారు. అంతటి అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన తంగలాన్ మెప్పించిందా? తెలియాలంటే ఈ రివ్యూ చూసేయండి.

కథ:

ఈ కథ 1850లో జరుగుతూ ఉంటుంది. మన దేశాన్ని పాలిస్తున్న బ్రిటీష్ వాళ్లు బంగారం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు. అందుకు వారికి కొందరు కూలీలు కావాలి. క్లెయింట్ అనే ఇంగ్లీష్ దొరకు తంగలాన్(విక్రమ్) గురించి తెలుస్తుంది. వెప్పూర్ అనే ఊరిలో తంగలాన్ తన కుటుంబంతో కలిసి వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉంటాడు. అనుకోని పరిస్థితుల్లోనే క్లెయింట్ వెంట బంగారం కోసం తంగలాన్ వెళ్లాల్సి వస్తుంది. బంగారం కోసం వీళ్లు మొదలు పెట్టిన ప్రయాణం అంత తేలిగ్గా సాగదు. వారికి ఊహించని అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి. ఆ సవాళ్ల మధ్య తంగలాన్ బంగారాన్ని కనిపెట్టాడా? అసలు ఆరతి ఎవరు? ఆమెతో తంగలాన్ కు ఉన్న సంబంధం ఏంటి? ఇలాంటి ప్రశ్నలకు సమాధానంగా సాగాదే అసలు కథ.

విశ్లేషణ:

ఎప్పుడైనా ఒకటి ఎక్కువగా కోరుకుంటే అది వినాశనానికే దారి తీస్తుంది అంటారు. అంటే దురాశకు పోతే దుఃఖానికి దారితీస్తుంది అనే పాయింట్ ని ఈ సినిమాలో బాగా ఎస్టాబ్లిష్ చేశారు. టన్నుల టన్నుల బంగారం ఒక దగ్గర ఉంటుంది. దానిని ఎలాగైనా చేజిక్కించుకోవాలి అని బ్రిటీష్ వాళ్లు అనుకుంటారు. అయితే ఆ బంగారం జోలికి ఎవరూ వెళ్లరు. అందుకే తంగలాన్ ని తీసుకుని వెళ్తారు. నిజ జీవిత కథల స్ఫూర్తితో తెరకెక్కించిన చిత్రం కాబట్టే మొదటి నుంచి అంచనాలను రేకెత్తించింది. తంగలాన్ గురించి, అతని కుటుంబం గురించి వివరిస్తూ సినిమాని ఓపెన్ చేయడంతో ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ పెరుగుతుంది. కానీ, ఆ ఎగ్జైట్మెంట్ ని అలాగే డ్రైవ్ చేయడంలో మాత్రం విఫలమయ్యారు. పైగా 1800ల కాలంలో జరిగిన కథ కాబట్టి ఇంకా ఎంగేజింగ్ గా ఉంటుంది అని అనుకున్నారు. కానీ, ఎందుకో ప్రేక్షకులు ఈ మూవీ కనెక్ట్ కాలేకపోయారు. సినిమాలో కావాల్సినంత వైవిధ్యం ఉంది. ఎక్కడా కూడా కనెక్ట్ చేసే అంశాలు కనిపించలేదు. ముఖ్యంగా దర్శకుడు అసలు ఏం చెప్పాలి అనుకుంటున్నాడు అనే విషయాన్ని ప్రేక్షకుడు అంచనా వేయలేకపోవడం ప్రధాన అడ్డంకి.

సుధీర్ఘంగా సాగే సన్నివేశాలు ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తాయి. కాన్సెప్ట్ పరంగా తంగలాన్ ఒక బ్రిలియంట్ మూవీ అనడంలో సందేహం లేదు. కానీ, దానిని ప్రేక్షకులకు కనెక్ట్ చేయడంలోనే ఫెయిల్ అయ్యారు. సాగదీత సన్నివేశాల వల్ల ఎన్నో గంటల కొద్దీ సినిమా చూస్తున్నాం అనే భావనకు వచ్చేస్తారు. ఇందులో హీరోకి కలలు కాస్త ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. అందుకు బలమైన కారణమే ఉంది. కానీ, దానిని క్లైమ్యాక్స్ లో రివీల్ చేస్తారు. అప్పటికే ఆడియన్స్ లో ఆసక్తి పోతుంది. డైరెక్టర్ 18వ శతాబ్దంలో స్టార్ట్ చేసిన కథను 5వ శతాబ్దానికి తీసుకెళ్లి ఆపుతాడు. అంతేకాకుండా పొలం పనులు చేసుకునే తంగలాన్ చాలా తేలిగ్గా.. త్వరగా ఇంగ్లీష్ అర్థం చేసుకోవడం అంత లాజికల్ గా అనిపించదు. సినిమాలో దాదాపుగా విక్రమ్ సగం సగం దుస్తులు, మేకప్ లేకుండానే కనిపిస్తాడు. సినిమా కోసం ప్రాణం పెట్టేశారు అని అర్థమవుతుంది. కానీ, ఎంగేజింగ్ గా లేకపోవడం చాలా ఇబ్బంది పెడుతుంది.

నటీనటులు- టెక్నికల్ విభాగం పనితీరు:

ఈ సినిమాకి బిగ్గెస్ట్ అసెట్ చియాన్ విక్రమ్. తంగలాన్ పాత్రలో మీరు పాన్ ఇండియా లెవల్లో ఇంకో యాక్టర్ ని ఊహించుకోలేరు. సినిమా కోసం విక్రమ్ ఎంత కష్టపడ్డాడు అనే విషయం స్క్రీన్ మీద స్పష్టంగా కనిపిస్తుంది. విక్రమ్ తర్వాత ఎక్కువ మార్కులు మాళవికా మోహనన్ కే పడతాయి. ఆరతిగా మాళవిక మెప్పిస్తుంది. ఆమె వచ్చిన ప్రతిసారి ప్రేక్షకులు నిజంగానే భయపడతారు. అలాగే విక్రమ్ భార్యగా చేసిన పార్వతి తిరువోతు.. తన పాత్ర మేరకు ఆకట్టుకుంటుంది. స్క్రీన్ మీద కనిపించే ప్రతి క్యారెక్టర్ వారి పరిధి మేరకు మెప్పించారు. టెక్నికల్ గా తంగలాన్ సినిమా అద్భుతం అనే చెప్పాలి. ముఖ్యంగా 1800 కాలంనాటి పరిస్థితులు చూపించడంలో ఆర్ట్ డిపార్ట్మెంట్, అప్పటి వస్త్రధారణను రిప్రజెంట్ చేయడంలో కాస్ట్యూమ్ డిజైనర్స్ నూటికి నూటయాభై శాతం ఎఫర్ట్స్ పెట్టారు. తంగలాన్ లో సినిమాటోగ్రఫీ మెప్పిస్తుంది. అలాగే జీవీ ప్రకాశ్ అందించిన మ్యూజిక్ కు ఫిదా అయిపోతారు. డైరెక్షన్ పరంగా వాళ్లు పెట్టిన కష్టం మీకు కనిపిస్తుంది. కానీ, కథకు ఎంగేజ్ చేయలేకపోవడంతోనే భారంగా అనిపిస్తుంది. నిర్మాణ విలువలు కూడా టాప్ నాచ్ గా ఉంటాయి.

బలాలు:

  • విక్రమ్
  • కాన్సెప్ట్

బలహీనతలు:

  • సాగదీత
  • కనెక్ట్ చేయలేకపోవడం
  • ఎక్కువ కన్ఫ్యూజ్ చేయడం

చివరిగా: తంగలాన్ మీ సహనాన్ని పరీక్షిస్తాడు..

రేటింగ్: 25/5

(*ఈ రివ్యూ సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)

Show comments