Raj Mohan Reddy
Pindam Movie Review & Rating in Telugu: హారర్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు కోసం మరో థ్రిల్లర్ సినిమా పిండం నేడు విడుదలయ్యింది. మరి ప్రమోషన్స్‌లో చెప్పినట్లుగా సినిమా కొత్తగా ఉందా.. అంటే
Pindam Movie Review & Rating in Telugu: హారర్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు కోసం మరో థ్రిల్లర్ సినిమా పిండం నేడు విడుదలయ్యింది. మరి ప్రమోషన్స్‌లో చెప్పినట్లుగా సినిమా కొత్తగా ఉందా.. అంటే
Raj Mohan Reddy
ఈ మధ్య కాలంలో హారర్ మూవీస్ కి మంచి ఆదరణ దక్కుతుంది. ఈ నేపథ్యంలోనే కొన్ని అంచనాలతో “పిండం” మూవీ ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ట్రైలర్ తో అంచనాలు పెంచిన ఈ మూవీ ఎలా ఉంది? శ్రీరామ్ కి సరైన సక్సెస్ అందించిందా? లేదా? ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం.
ముందుగా కథ విషయానికి వస్తే..క్రిస్టియన్ మతానికి చెందిన ఆంథోని( శ్రీరామ్) తన దగ్గర ఉన్న డబ్బు అంతా ఖర్చు చేసి ఓ పురాతన ఇంటిని కొంటాడు. అతనికి భార్య, ఇద్దరు కూతుళ్లు. ఆ ఇల్లు బాగుంది అని సంబర పడే లోపు ఆ కుటుంబ సభ్యులకి వింత పరిస్థితులు ఎదురవుతాయి. ముఖ్యంగా ఆంథోనికి ఆత్మలు కనిపిస్తూ ఉంటాయి. ఇక ఆంథోని చిన్న కూతురు తారలో కూడా చాలా మార్పులు వస్తాయి. ఆంథోని భార్య ( ఖుషి రవి) మినహా.. అందరిపై అటాక్స్ జరుగుతాయి. తాము కష్టాల్లో ఉన్నాము.. ఆ ఇంట్లో ఏవో శక్తులు ఉన్నాయని తెలుసుకున్న శ్రీరామ్.. తాంత్రిక విద్యలు తెలిసిన అన్నమ్మ (ఈశ్వరీరావు) సాయం కోరతాడు. అక్కడ నుండి పిండం కథ ఎలాంటి మలుపులు తిరిగింది అన్నదే అసలు కథ.
హారర్ చిత్రాలు అనగానే.. ఆబ్జెక్ట్స్ మూమెంట్ టెక్నిక్, బీజీఎం, లైటింగ్ వంటి అంశాలు కీలక పాత్ర పోషిస్తాయి. కథ రివీల్ కానంత వరకు ఆడియన్స్ ను ఈ ఎలిమెంట్స్ తోనే ఎంగేజ్ చేయాల్సి ఉంటుంది. పిండం మూవీ కూడ ఈ అంశాలతోనే కాసేపు ప్రేక్షకులని భయపెడుతుంది. కానీ.. కథలోకి వెళ్ళాకే పిండం తేలిపోయింది. కథలో ఎలాంటి కొత్తదనం లేకపోవడం, పైగా.. సిద్ధార్ద్ నటించిన గృహం మూవీకి ఈ చిత్రం ఆల్మోస్ట్ దగ్గరగా ఉండటం ప్రేక్షకుడిని నిరుత్సాహ పరుస్తుంది. అలా అని పిండం మూవీ టోటల్ గా బాగాలేదా అంటే అదీ కాదు. ఒక కేస్ స్టడీతో మూవీని ఓపెన్ చేయడం, కథలో కీలకమైన అన్నమ్మ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ చేసిన విధానం, ఆంథోని ఫ్యామిలీని కొంత మేర డ్రైవ్ చేసిన విధానం ప్రేక్షకులని ఆకట్టుకుంటాయి. కానీ.., ప్రధానంగా కథలో దమ్ము లేకపోవడంతో ఇంటర్వెల్ బ్యాంగ్ సాధారణంగా ముగుస్తుంది. పిండం సెకండ్ ఆఫ్ మొదలైన విధానం బాగుంటుంది. అన్నమ్మ క్యారెక్టర్ కాన్ఫ్లిక్ట్ పాయింట్ కి దగ్గరగా రావడంతో కథ పరుగులు పెడుతుంది. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో ప్రీ క్లైమ్యాక్స్ వరకు తీసుకెళ్లిన దర్శకుడు.. అక్కడ నుండి కథపై పట్టుకోల్పోయాడు. దీంతో.. క్లైమ్యాక్స్ చాలా ప్లైన్ గా మారిపోయింది.
పిండం సినిమాకి మేజర్ అసెట్ అన్నమ్మ పాత్రలో నటించిన ఈశ్వరీరావు. చాలా రోజుల తర్వాత ఆమెకు మంచి పాత్ర దొరికింది. దీంతో.. ఆమె అన్నమ్మ పాత్రలో చెలరేగిపోయింది. ఇక హీరో శ్రీరామ్ కూడా కథకి ఏమి కావాలో అంత వరకే నటించి మెప్పించాడు. అవసరాల శ్రీనివాస్ క్యారెక్టర్ కి అంతగా స్కోప్ లేకుండా పోయింది. ఇక తార క్యారెక్టర్ లో నటించిన చిన్న పాప మూవీకి ప్రాణం పోసింది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మిగతా నటీనటులు తమ పాత్ర పరిధి మేరకు నటించి మెప్పించారు.
పిండం సినిమాని మరో లెవల్ కి తీసుకెళ్లిన అంశాల్లో సినిమాటోగ్రాఫర్ ది ప్రధాన పాత్ర. సతీశ్ మనోహర్ ఈ విషయంలో 100కి 100 శాతం న్యాయం చేశారు. ఇక మ్యూజిక్ అందించిన కృష్ణ సౌరబ్ ను మెచ్చుకోకుండా ఉండలేము. వీరిద్దరి ప్రతిభ కారణంగానే పిండం చాలా వరకు పాస్ మార్కులు దక్కించేసుకుంది. ఇక ఎడిటర్ శిరీష్ ప్రసాద్ వర్క్ పెద్దగా ఆకట్టుకోదు. చివరగా సాయికిరణ్ దైదా కథకుడిగా తేలిపోయాడు. కానీ.., దర్శకుడిగా మాత్రం మంచి స్పార్క్ కనిపిస్తోంది. హారర్ మూవీ తీయాలనుకున్న సాయికిరణ్ కథపై ఇంకాస్త శ్రద్ద పెట్టుంటే బాగుండేది.
చివరి మాట: పిండం.. కొంపముంచిన పాత కథ.
రేటింగ్: 2.5/5