Raj Mohan Reddy
Maa Nanna Superhero Telugu Movie Review Rating: చాలా రోజులుగా సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న హీరో సుధీర్ బాబు. ఇందుకోసం అభిలాష్ కంకర దర్శకత్వంలో "మా నాన్న సూపర్ హీరో" అనే మూవీలో నటించాడు. ప్రమోషనల్ కంటెంట్ తో ఈ మూవీ మంచి బజ్ క్రియేట్ చేసుకుంది.
Maa Nanna Superhero Telugu Movie Review Rating: చాలా రోజులుగా సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న హీరో సుధీర్ బాబు. ఇందుకోసం అభిలాష్ కంకర దర్శకత్వంలో "మా నాన్న సూపర్ హీరో" అనే మూవీలో నటించాడు. ప్రమోషనల్ కంటెంట్ తో ఈ మూవీ మంచి బజ్ క్రియేట్ చేసుకుంది.
Raj Mohan Reddy
చాలా రోజులుగా సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న హీరో సుధీర్ బాబు. ఇందుకోసం అభిలాష్ కంకర దర్శకత్వంలో “మా నాన్న సూపర్ హీరో” అనే మూవీలో నటించాడు. ప్రమోషనల్ కంటెంట్ తో ఈ మూవీ మంచి బజ్ క్రియేట్ చేసుకుంది. మరి.. ట్రైలర్ లో కనిపించిన ఎమోషన్స్ ఈ మూవీలో ఉన్నాయా? సినిమా ఫలితం ఎలా ఉంది? ఇలాంటి అన్నీ అంశాలను ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం.
జానీ ( సుధీర్ బాబు) కొన్ని పరిస్థితుల వల్ల.. అనాధగా ఆశ్రమంలో పెరగాల్సి వస్తుంది. కొంత వయసు వచ్చాక శ్రీనివాసరావు ( షియాజీ షిండే) జానీని దత్తత తీసుకుంటాడు. కానీ.. జానీ ఇంటికి వెళ్ళాక శ్రీనివాసరావు జీవితం తలకిందులు అవుతుంది. వ్యాపారంలో నష్టాలు వస్తాయి. అంతా.. జానీ నష్ట జాతకుడు, అతని వల్లే ఇన్ని కష్టాలు అని తిట్టిపోస్తారు. కానీ.., శ్రీనివాసరావు మాత్రం అవేవి పట్టించుకోడు. తర్వాత కాలంలో కష్టాలు, నష్టాలు మరింత పెరగడంతో.. తండ్రి శ్రీనివాసరావు కూడా జానీని ద్వేషించడం మొదలు పెడతాడు. కాకపోతే.. ఈ క్రమంలోనే జానీకి.. తనని పెంచిన నాన్న మీద విపరీతమైన ప్రేమ ఏర్పడుతుంది. తండ్రి చేసిన అప్పులు అన్నీ కడుతూ.. ఆయనపై ఈగ వాలకుండా చూసుకుంటూ ఉంటాడు. కాకపోతే.. ఇంతలో శ్రీనివాసరావు ఓ పెద్ద ఆపదలో చిక్కుకుంటాడు. ఆ కష్టం నుండి తండ్రిని తప్పించడానికి జానీకి కోటి రూపాయలు అవసరం అవుతాయి. ఈ ప్రయాణంలో జానీ.. తన సొంత తండ్రి సాయి చంద్ ని కలుసుకుంటాడు. ఇక్కడ నుండి జరిగే వీరిద్దరి ఎమోషనల్ జర్నీనే “మా నాన్న సూపర్ హీరో” కథ.
సున్నితమైన భావోద్వేగాలను కథా వస్తువుగా చేసుకున్నప్పుడు.. ఆ కథని చెప్పే విధానం గొప్పగా ఉండాలి. ఇందులో ఒక్కో దర్శకుడికి ఒక్కో శైలి ఉంటుంది. మా నాన్న సూపర్ హీరో కథని చెప్పడానికి.. దర్శకుడు అభిలాష్ కంకర నిజాయతీతో కూడుకున్న మార్గాన్ని ఎంచుకున్నాడు. కథనాన్ని పరుగులు పెట్టించడం కన్నా, ఓ ఫీల్ గుడ్ నేరేషన్ తో.. హృదయాల్ని పట్టి ఉంచడానికి ప్రాధాన్యం ఇస్తూ తాను నమ్మిన మార్గంలో సినిమాని నడిపించాడు. ఇందులో చాలా వరకు సక్సెస్ అయ్యాడు కూడా. కాకపోతే.. ఇంత స్లో స్క్రీన్ ప్లేని ఆడియన్స్ ఎంత వరకు రిసీవ్ చేసుకుంటారు అన్నదే మిలియన్ డాలర్స్ ప్రశ్న.
మూవీ మొదలైన దగ్గర నుండే దర్శకుడు.. ఒక గిరి గీసుకుని, కథని మాత్రమే చెప్పే ప్రయత్నం చేశాడు. నాన్నపై కొడుకుకి ఉన్న ప్రేమని ఎస్టాబ్లిష్ చేయడానికి చాలా సమయం తీసుకున్నాడు. ఆ ఎమోషన్ ఎస్టాబ్లిష్ అయ్యాకనే.. మెయిన్ కాంఫ్లిక్ట్ పాయింట్ టచ్ చేశాడు. కాకపోతే.. ఇదే సమయంలో ప్యారెలెల్ గా సాయి చంద్ క్యారెక్టర్ ని నడిపి.. ఓ మంచి ఎమోషనల్ జర్నీకి కావాల్సిన ట్రాక్ అంతా సెట్ చేసేసుకున్నాడు. ఇక హీరో పాత్రని ఓ సంఘర్షణలోకి నెట్టి.. తరువాత ఏమి చేయబోతున్నాడా అనే సస్పెన్స్ వద్ద ఇంటర్వెల్ బ్లాక్ సెట్ చేసుకోవడం కూడా బాగుంది. కాకపోతే.. కమర్షియల్ సినిమాలని ఇష్టపడే వారికి ఈ ట్రీట్మెంట్ అంతగా రుచించకపోవచ్చు.
ఇక సెకండ్ ఆఫ్ అంతా సుదీర్ బాబు, సాయి చంద్ చుట్టూ తిరుగుతుంది. సింపుల్ అండ్ ఎఫెక్టీవ్ సీన్స్ తో సెకండ్ ఆఫ్ ఎమోషనల్ జర్నీలా సాగిపోతుంది. కాకపోతే.. ఇక్కడ కథ, కథనాల కన్నా.. సుధీర్ బాబు, సాయి చంద్ యాక్టింగ్ హైలెట్ గా నిలిచాయి. ఇక.. నమ్మిన స్నేహితుడిని మోసం చేయలేక, అలా అని.. పెంచిన తండ్రిని ఆపదలో వదిలేయలేక హీరో క్యారెక్టర్ మధనపడిపోయిన విధానం చాలా బాగుంది. నిజానికి.. ఇక్క హీరో క్యారెక్టర్ బిహేవియరే క్లైమ్యాక్స్ మొత్తాన్ని నడిపించింది. దీంతో.. ప్రీ క్లైమ్యాక్స్ నుండి ఎండ్ టైటిల్స్ వరకు ఎమోషనల్ సీన్స్ అన్నీ బాగా వర్క్ అవుట్ అయ్యాయి. ఇదే సినిమాకి పెద్ద బలం అయ్యింది.
“మా నాన్న సూపర్ హీరో” మూవీ విషయంలో ముందుగా మెచ్చుకోవాల్సింది హీరో సుధీర్ బాబుని. నమ్మిన కథ కోసం.. అతను తగ్గిన విధానం ఆశ్చర్యం కలిగించింది. పాత్రలో అతను ఒదిగిన తీరు హైలెట్. ఆఖరికి ఓ చిన్న ఆర్టిస్ట్ చేత కూడా.. కాళ్లతో తన్నించుకున్నాడు. హీరోలలో ఇంత మార్పు రావడం.. సినిమాకే కాదు, ఇండస్ట్రీకి కూడా శుభ సూచికం. ఇక సుధీర్ బాబు తర్వాత అంతే స్థాయిలో సినిమాకి ప్రాణం పోసింది సాయి చంద్. ఇలాంటి ఓ మంచి నటుడిని ఇండస్ట్రీ ఎందుకు సరిగ్గా వాడుకోవడం లేదో అర్ధం కావడం లేదు. ఇక షియాజీ షిండే కూడా సినిమాకి పెద్ద ప్లస్ అయ్యారు. హీరోయిన్ గాని, మిగతా నటులకి గాని.. సినిమాలో పెద్దగా స్కోప్ లేకుండా పోయింది. రాజు సుందరం కాసేపు కనిపించినా.. కథనంలో ఊపు తీసుకొచ్చారు. ఇక టెక్నీకల్ గా జయ్ క్రిష్ బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకి పెద్ద ప్లస్. సినిమాటోగ్రఫీ కూడా ఓకే. మిగతా విభాగాల్లో.. ఒక్క ఎడిటింగ్ తప్ప అంతా ఓకే. నిర్మాణ విలువలు బాగున్నాయి. అభిలాష్ కంకర కథకుడిగా, దర్శకుడిగా మెప్పించాడు.