Raj Mohan Reddy
Devil Movie (2023) Review & Rating in Telugu: నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన ‘డెవిల్’ సినిమా డిసెంబర్ 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి, ఈ మూవీ ఎలా ఉంది? ప్రేక్షకుల్ని మెప్పించిందా? లేదా?
Devil Movie (2023) Review & Rating in Telugu: నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన ‘డెవిల్’ సినిమా డిసెంబర్ 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి, ఈ మూవీ ఎలా ఉంది? ప్రేక్షకుల్ని మెప్పించిందా? లేదా?
Raj Mohan Reddy
బింబిసార వంటి సూపర్ సక్సెస్ తరువాత నందమూరి కళ్యాణ్ రామ్ కి అమిగోస్ రూపంలో మరో ఫెయిల్యూర్ ఎదురైంది. ఈ నేపథ్యంలోనే మరో సాలిడ్ సక్సెస్ కోసం.. డెవిల్ చిత్రంలో నటించాడు కళ్యాణ్ రామ్. అభిషేక్ నామా స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రంలో సంయుక్తా మీనన్ హీరోయిన్ గా నటించగా, మాళవికా నాయర్ కీలక పాత్రలో నటించింది. మరి.. ఇన్ని అంచనాల మధ్య విడుదలైన డెవిల్ మూవీ ఎలాంటి ఫలితాన్ని అందుకుందో ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం.
రసపాడు గ్రామంలోని జమీందారు కూతురు హత్య చేయబడుతుంది. ఈ హత్య కేసులో ముద్దాయిగా జమీందారుని పోలీసులు అదుపులోకి తీసుకుంటారు. తరువాత ఈ కేసు బ్రిటీష్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ అయిన డెవిల్ ( కళ్యాణ్ రామ్) చేతికి వస్తుంది. ఇక్కడే డెవిల్ కి నైషద ( సంయుక్త మీనన్) పరిచయం అవుతుంది. ఇక డెవిల్ రసపాడు గ్రామంలో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాక.. ఈ కేసులో ఒక్కో చిక్కుముడి వీడుతూ చివరికి నేతాజీ సుభాష్ చంద్రబోస్ నుండి వచ్చిన ఒక సీక్రెట్ కోడ్ వరకు కథ వెళ్తుంది. ఒక చిన్న గ్రామంలో జరిగే హత్యకి.. NIA చీఫ్ అయిన బోస్ రక్షణకి ఉన్న లింక్ ఏమిటి? కథలో కీలకమైన త్రివర్ణ ఎవరు? చివరికి డెవిల్ చేధించిన నిజాలు ఏమిటి? అతని పోరాటం ఎవరి కోసం అన్నదే మిగిలిన కథ.
మనలో చాలా మందికి చందమామ కథలు తెలిసే ఉంటాయి. ఆ కథలు అంత పెద్ద హిట్ ఎందుకు అయ్యాయో తెలుసా? ఆ కథలన్నీ చాలా సింపుల్ గా ఉంటాయి. ఎక్కడా కన్ఫ్యూజన్ ఉండదు. ఈ సక్సెస్ ఫార్ములా సినిమా కథలకి వర్తిస్తుంది. కానీ.., డెవిల్ మూవీ ట్రాక్ తప్పింది ఇక్కడే. రెండు సినిమాలకి సరిపడే కథని ఒకటిగా చేసి.., సినిమా ఆసాంతం స్టోరీ టెల్లింగ్ లా చెప్పుకుంటూ పోవడంతో డెవిల్ సగటు ఆడియన్ కి భారంగా మారిపోయింది. డెవిల్ మూవీ 1940 నేపథ్యంలో సాగే డ్రామాగా మొదలవుతుంది. తరువాత ఇది ఓ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ గా మారుతుంది. అక్కడ నుండి ఒక్కసారిగా స్వాతంత్రం, సుభాష్ చంద్రబోస్, ఆజాద్ హింద్ ఫౌజ్ అంటూ ఎన్నో టర్న్స్ తీసుకుంటుంది. ఇవన్నీ దాటుకుని క్లైమ్యాక్స్ వచ్చే సరికి ప్రేక్షకుడు సినిమా నుండి ఎప్పుడో డిస్ కనెక్ట్ అయిపోయి ఉంటాడు.
డెవిల్ మూవీలో ఇన్వెస్టిగేషన్ సీక్వెన్స్ అంతా చాలా గొప్పగా హ్యాండిల్ చేశారు. దీంతో ఫస్ట్ ఆఫ్ మనకి పరుగులు పెట్టినట్టే అనిపిస్తుంది. కానీ.., ట్విస్ట్ లు రివీల్ అవుతున్నా కథ ముందుకి పోకపోవడం, అనవసరంగా వచ్చి పడే పాటలతో ఫ్లో దెబ్బ తిన్నట్టు అనిపిస్తుంది. ట్విస్ట్ కోసం హీరో క్యారెక్టర్ కి జస్టిఫికేషన్ లేకుండా చేశారు. దీంతో.. హై వోల్టేజ్ యాక్షన్స్ సీక్వెన్స్ లతో తెరకెక్కించిన ఇంటర్వెల్ ఫైట్ లో పూర్తిగా ఎమోషన్ మిస్ అయిపోయింది. అయితే.., మంచి డైలాగ్స్, ట్విస్ట్ లతో కూడిన ఇన్వెస్టిగేషన్ సీన్స్, సత్య కామెడీ, సంయుక్త మీనన్ గ్లామర్ డెవిల్ ఫస్ట్ హాఫ్ పాస్ చేసేశాయి.
డెవిల్ సెకండ్ ఆఫ్ లో స్టోరీ స్పాన్ చాలా ఎక్కువ అయిపోయింది. హీరో ఒక్కో నిజాన్ని రివీల్ చేస్తూ ముందుకి పోతుండటం కాస్త ఎంగేజింగ్ గా అనిపించినా.. ఓ కోడ్ చుట్టూ సగం సినిమాని, అదీ హెవీ నేరేషన్ లో రన్ చేయడం మైనస్ గా మారింది. పైగా.., ఈ మొత్తం సీక్వెన్స్ సగటు ప్రేక్షకుడికి అర్ధం అవుతుందా? లేదా? అన్నది అనుమానమే. ప్రీ క్లైమ్యాక్స్ హీరో క్యారెక్టర్ ట్విస్ట్ రివీల్ అవ్వడంతో డెవిల్ మూవీ కీలక మలుపు తీసుకుంటుంది. అయితే.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కాకుంటే.. సుభాష్ చంద్రబోస్ క్యారెక్టర్ చుట్టూ.. ఇంతటి ఫిక్షన్ కథని అల్లిన రైటర్ తెలివిని ఒక్కసారైనా మెచ్చుకుని తీరాల్సిందే.
కథ ఎంత బలంగా ఉంటే కళ్యాణ్ రామ్ లోని నటుడు అంత గట్టిగా బయటకి వస్తుంటాడు. బింబిసారతో ఈ విషయం స్పష్టంగా అర్థం అయ్యింది. ఇప్పుడు డెవిల్ లో కూడా ఈ నందమూరి హీరో అంతే బెస్ట్ ఇచ్చేశాడు. ముఖ్యంగా కొన్ని సన్నివేశాల్లో కళ్యాణ్ రామ్ చాలా సెటిల్డ్ గా నటించిన తీరు ఆకట్టుకుంటుంది. ఇక హీరోయిన్ సంయుక్త మీనన్ ఎప్పటిలానే అందంతో పాటు నటనలోనూ అదరగొట్టింది. వీరి తరువాత ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది సత్య క్యారెక్టర్ గురించి. తనకి ఇచ్చిన తక్కువ స్క్రీన్ స్పేస్ ని సత్య బాగా వాడుకున్నాడు. మిగతా నటులు అంతా తమ పాత్ర పరిధి మేర మెప్పించారు.
డెవిల్ మూవీ ఎవరికైనా ప్రత్యేక అభినందనలు అందాలి అంటే ఆర్ట్ డిపార్ట్మెంట్ కి. సెట్స్ నుండి చిన్న చిన్న ప్రాపర్టీస్ వరకు అన్నిట్లోనూ కష్టం కనిపించింది. ఇలా 1940 బ్యాక్ డ్రాప్ ఫీల్ తీసుకుని రావడానికి గాంధీ నడికుడికార్ ప్రాణం పెట్టి పని చేశాడు. కేవలం ఈ ఆర్ట్ వరకు వల్లే సుందరాజన్ కెమెరా వర్క్ ఈజీ అయిపోయింది. ఇక హర్ష వర్ధన్ రామేశ్వర్ అందించిన పాటలు అంతగా రిజిస్టర్ కాకపోయినా.. బీజీఎమ్ మాత్రం సాలిడ్ గానే ఉంది. కాకుంటే.. చాలా సీన్స్ లో బ్యాగ్రౌండ్ స్కోర్ అవసరం లేకపోయినా వినిపిస్తూనే వచ్చింది. ఇక ఎడిటింగ్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచింది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నిర్మాతగా ఎక్కడా కాంప్రమైజ్ కాని అభిషేక్ నామా.. దర్శకుడిగా మాత్రం నిరాశ పరిచాడు. ఓ పెద్ద కథని అభిషేక్ నామాసరిగ్గా డీల్ చేయలేకపోయారన్న విషయం స్పష్టంగా అర్ధం అవుతోంది.
చివరి మాట: డెవిల్.. ఆపరేషన్ ఫెయిల్యూర్
రేటింగ్: 2.25/5