డిటెక్టివ్ సస్పెన్స్ థ్రిల్లర్ జానర్లో తెరకెక్కిన భూతద్దం భాస్కర్ నారాయణ సినిమా టీజర్, ట్రైలర్లతో ఆసక్తి పెంచింది. ఇక మార్చి 1న ఈ సినిమా విడుదలయ్యింది. ఇంతకు ఈ చిత్రం ఎలా ఉందంటే..
డిటెక్టివ్ సస్పెన్స్ థ్రిల్లర్ జానర్లో తెరకెక్కిన భూతద్దం భాస్కర్ నారాయణ సినిమా టీజర్, ట్రైలర్లతో ఆసక్తి పెంచింది. ఇక మార్చి 1న ఈ సినిమా విడుదలయ్యింది. ఇంతకు ఈ చిత్రం ఎలా ఉందంటే..
Dharani
ఈమధ్య కాలంలో చిన్న సినిమాలు అందునా పురాణాల ప్రస్తావన ఉన్న సినిమాలు అనూహ్య రీతిలో విజయం సాధిస్తున్నాయి. అలానే డిటెక్టివ్ థ్రిలర్స్కు మంచి ఆదరణ ఉంటుంది. గతంలో వచ్చిన ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ దీనికి మంచి ఉదాహరణ. ఈమధ్య కాలంలో తెలుగులో మంచి డిటెక్టివ్ థ్రిల్లర్ సినిమా రాలేదు. ఈక్రమంలో శివ కందుకూరి నటించిన భూతద్ధం భాస్కర్ నారాయణ ఈ తరహా కథతోనే తెరకెక్కి ప్రేక్షకుల ఆసక్తి తనవైపు తిప్పుకుంది. డిటెక్టివ్ కథను పురాణాలతో ముడిపెట్టి మరింత ఆసక్తి పెంచారు మేకర్స్. మరి నేడు థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా లేదా అంటే..
ఆంధ్రప్రదేశ్, కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో వరుస హత్యలు జరుగుతుంటాయి. ఎవరో సైకో కిల్లర్ మహిళల్ని హత్య చేసి వారి తలలను తీసేసి.. ఆ స్థానంలో దిష్టిబొమ్మలు పెడుతుంటాడు. ఈ కేసుని దిష్టిబొమ్మ హత్యలు పిలుస్తారు పోలీసులు. రెండు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోన్న ఈ హత్యల వెనక ఉన్న వ్యక్తిని పట్టుకోవడం పోలీసులకు సవాల్‌గా మారుతుంది. ఈ కమ్రంలోనే డిటెక్టివ్ భాస్కర్ నారాయణ రంగంలోకి దిగుతాడు(శివ కందుకూరి). అతడు ఎంత ప్రయత్నం చేసినా.. హత్యలకు సంబంధించి ఒక్క క్లూ కూడా సంపాదించలేకపోతాడు. ఈ క్రమంలోనే ఇవి హత్యలు కాదు బలులు అని తెలుసుకుని.. పురాణాల్లో వీటి ప్రస్తావన ఉందనే అంచనాకు వస్తాడు. ఆ తర్వాత ఈ హత్యలు ఎవరు చేస్తున్నారు.. ఎందుకు చేస్తున్నారు.. ఈ కేసుతో పురాణాలకి ఉన్న లింకేంటి.. తలలు నరికి ఆ స్థానంలో దిష్టి బొమ్మలు పెట్టడం ఏంటి.. ఈ కేసులో ఎలాంటి నిజాలు వెలుగు చూశాయి.. అనేది తెలియాలంటే భూతద్ధం భాస్కర్ నారాయణ చూడాల్సిందే.
డిటెక్టివ్ థ్రిల్లర్స్‌కి ఎప్పటికి మంచి ఆదరణ ఉంటుంది. మంచి కంటెంట్.. ఆసక్తికరమైన గ్రిప్పింగ్‌తో కథను ముందుకు నడిపిస్తే.. ప్రేక్షకులు కచ్చితంగా అలాంటి సినిమాలను ఆదరిస్తారు. ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సినిమాయే అందుకు మంచి ఉదాహరణ. ఇక తాజాగా విడుదలైన భూతద్దం భాస్కర్ నారాయణ కూడా ఇదే కాన్సెప్ట్‌తో వచ్చింది. ఒక క్రైమ్ థ్రిల్లర్‌ని పురాణాలతో లింక్ పెట్టడం.. దానిని దిష్టి బొమ్మ హత్యలకు లింక్ చేయడం ఈ సినిమాలోని ప్రత్యేకత.
దర్శకుడు భూతద్దం భాస్కర్ నారాయణ సినిమాను చాలా కొత్తగా తీశాడు. డిటెక్టివ్ కథని పురాణాలతో ముడిపెట్టిన విధానం ప్రేక్షకులను థ్రిల్లింగ్‌కు గురి చేస్తుంది. సినిమాలో ఇన్వెస్టిగేషన్ చాలా ఆసక్తికరంగా సాగుతుంది. హీరో బాల్యంతో సినిమా మొదలవుతుంది. ఫస్టాఫ్ అంతా కామెడీ, లవ్, ఎమోషన్స్‌తో సాగుతుంది. అయితే ఎప్పుడైతే సీరియల్ కిల్లర్ తెరపైకి వస్తాడు.. అప్పటి నుంచి కథ పరుగులు పెడుతుంది. సీరియల్ కిల్లర్ ఎవరనే సస్పెన్స్‌ని దర్శకుడు చివరి వరకు కొనసాగిస్తాడు. సెకండాఫ్‌లో వచ్చే ట్విస్టులు ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేస్తాయి.
దిష్టిబొమ్మ గురించి తెలియని విషయాలు ఈ సినిమాలో చూపించారు. దర్శకుడు రాసుకున్న పురాణాల కోణం ఈ సినిమాకు బాగా కలిసి వచ్చింది బాగా వర్క్ అవుట్ అయ్యింది. అయితే ఫస్టాప్‌లో వచ్చే కొన్ని సీన్స్ రొటీన్‌గా ఉండడం.. ద్వితియార్థంలో కొన్ని చోట్ల సాగదీతగా అనిపించడం కాస్త మైనస్. ఇన్వెస్టిగేషన్ కూడా కొన్ని చోట్ల సినిమాటిక్‌గా అనిపిస్తుంది. క్లైమాక్స్ వరకు సస్పెన్స్‌ను మెయిన్‌టెన్ చేసి.. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచడంలో డైరెక్టర్ విజయం సాధించాడు. థ్రిల్లర్స్ సినిమాలని ఇష్టపడే వారికి భూతద్ధం భాస్కర్ నారాయణ బాగా నచ్చుతుంది.
భాస్కర్ నారాయణ పాత్రకు శివ కందుకూరి న్యాయం చేశాడు. తెరపై కొత్తగా కనిపించాడు. డిటెక్టివ్ అంటే బ్లాక్ అండ్ బ్లాక్ లో చూపిస్తుంటారు. కానీ ఈ సినిమాలో మాత్రం శివ పాత్రకు లోకల్ టచ్ ఇచ్చి పక్కింటి కుర్రాడు అనే భావన తీసుకువచ్చారు. శివ కూడా తన పాత్రలో ఒరిగిపోయి.. చాలా సహజంగా నటించాడు. రిపోర్టర్ లక్ష్మీగా రాశీ సింగ్ పర్వాలేదనిపిస్తుంది. ఇక మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాకేతికంగా పరంగా సినిమా పర్వాలేదు.
శ్రీచరణ్ పాకాల అందించిన మ్యూజిక్ సినిమాకు ప్రాణం పోసింది అని చెప్పవచ్చు. ఇలాంటి సినిమాలకు బీజీఎం ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ విషయంలో శ్రీచరణ్ సక్పెస్ అయ్యాడు.. తన సంగీతంలో కూడా ఒక రూరల్ టచ్ కనిపించింది. కెమరాపనితనం చాలా బాగుంది. నిర్మాతలు చేసిన ఖర్చు తెరపై కనిపించింది. విఎఫ్ఎక్స్ అవుట్ పుట్ బాగానే వుంది.