Tirupathi Rao
Ayalaan Movie Review & Rating In Teluguశివకార్తికేయ నటించిన సైన్స్ ఫిక్షన్ స్టోరీ అయలాన్ తెలుగులో రిలీజ్ అయిపోయింది. మరి.. ఆ మూవీ ఎలా ఉందో తెలియాలంటే ఈ రివ్యూ చదవాల్సిందే.
Ayalaan Movie Review & Rating In Teluguశివకార్తికేయ నటించిన సైన్స్ ఫిక్షన్ స్టోరీ అయలాన్ తెలుగులో రిలీజ్ అయిపోయింది. మరి.. ఆ మూవీ ఎలా ఉందో తెలియాలంటే ఈ రివ్యూ చదవాల్సిందే.
Tirupathi Rao
శివకార్తికేయన్ సినిమా వస్తోందంటే తెలుగు ప్రేక్షుకుల్లో కూడా ఆసక్తి మొదలవుతుంది. రెమో, డాక్టర్, డాన్, ప్రిన్స్, మహావీరుడు వంటి సినిమాలతో టాలీవుడ్ లో కూడా మంచి ఫ్యాన్ బేస్ ని క్రియేట్ చేసుకున్నాడు. శివకార్తికేయన్ కథల విషయంలో కాస్త ప్రయోగాలు చేస్తూనే ఉంటాడు. అలాంటి ఒక ప్రయోగం నుంచి వచ్చిందే సైన్స్ ఫిక్షన్ అయలాన్ సినిమా. ఈ మూవీలో ఏకంగా ఒక ఏలియన్ ని తీసుకొచ్చేశారు. నిజానికి తమిళనాట ఈ చిత్రం జనవరి 12నే విడుదలైంది. కానీ, సంక్రాంతి బరిలో థియేటర్లకు ఇబ్బంది అయ్యి తెలుగులో రిలీజ్ ని వాయిదా వేసుకున్నారు. ఇక రిపబ్లిక్ డే సందర్భంగా తెలుగు వెర్షన్ రిలీజ్ కావాల్సి ఉన్నా.. లీగల్ రీజన్స్ తో మరోసారి రిలీజ్ ఆగిపోయింది. అయితే.., అయలాన్ ఎలా ఉందో తెలుసుకోవాలి అనుకునే ప్రేక్షకుల కోసం ఆ సినిమా తమిళ్ వెర్షన్ రివ్యూని ఇప్పుడు తెలుగులో మీకు అందిస్తున్నాము.
ఇది చాలా సింపుల్ స్టోరీ. ఒక ఏలియన్ భూమి మీదకు వస్తుంది. అది తమీజ్(శివకార్తికేయన్) అనే యువకుడిని కలుస్తుంది. తమీజ్ అతని మిత్రులు టైసన్(యోగి బాబు), సుగిర్తరాజా(కరుణాకరన్) కలిసి ఏలియన్ కు టట్టూ అని పేరు పెడతారు. టట్టూతో యోగిబాబు, కరుణాకరన్ చాలానే తిప్పలు పడతారు. ఆ తర్వాత టట్టూ కొందరి చెడు వ్యక్తుల చెరలో చిక్కుతుంది. అక్కడి నుంచి హీరో అతని మిత్రులు టట్టూని ఎలా కాపాడారు? అసలు టట్టూ భూమి మీదకు ఎందుకు వచ్చాడు? భూమిని ఏ ప్రమాదం నుంచి కాపాడేందుకు టట్టూ ప్రయత్నిస్తాడు? టట్టూ తిరిగి తన ప్లానెట్ కి క్షేమంగా వెళ్లాడా? అనే ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ కావాలంటే మీరు థియేటర్లలో అయలాన్ సినిమా చూడాల్సిం
సాధారణంగా సైన్స్ ఫిక్షన్ స్టోరీస్ అంటే భాషతో సంబంధం లేకుండా అందరి ప్రేక్షకులకు నచ్చేస్తూ ఉంటాయి. కానీ, అలాంటి చిత్రాలను తెరకెక్కించాలి అంటే కత్తిమీద సాములాంటిదనే చెప్పాలి. అలాంటి ఒక సహసాన్ని చేసేందుకు డైరెక్టర్ రవికుమార్ ఎక్కడా సంకోచించలేదు. అదికూడా అతని కెరీర్లో తీసిన రెండో చిత్రానికే అంతటి బాధ్యతను తలకెత్తుకున్నందుకు రవికుమార్ ని మెచ్చు కోవాల్సిందే. ఇప్పటి వరకు మీరు చూసిన ఏలియన్స్ చిత్రాలతో పోలిస్తే.. అయలాన్ చిత్రం చాలా బాగా నచ్చుతుంది. ఎందుకంటే ఈ చిత్రంలో గ్రాఫిక్స్ విషయంలో డైరెక్టర్, మేకర్స్ ప్రత్యేక దృష్టి సారించినట్లు కనిపిస్తుంది. అలాగే ఏలియన్ క్యారెక్టర్ మాటలు, ఆలోచనలు కూడా దాదాపుగా మనుషులకు దగ్గరగా ఉండటంతో ఆడియన్స్ ఇంకా బాగా ఎంగేజ్ అవుతున్నారు. ఈ సినిమాలో గ్రాఫిక్స్ కీలక పాత్ర పోషిస్తాయి. ఏలియన్ క్యారెక్టర్ కు ఆడియన్స్ అంత బాగా కనెక్ట్ అవ్వడానికి గ్రాఫిక్సే ప్రధానంగా వ్యవహరించాయి. ఆ తర్వాత ఒక మంచి కమర్షియల్ సినిమాకి కావాల్సిన కథ, పాటలు, కామెడీ, రొమాన్స్, విలనిజం, ఎలివేషన్స్ అన్నింటినీ పుష్కలంగా పొందు పరిచారు. ఒక సీరియస్ విషయాన్ని ప్రేక్షకులను మెప్పించే విధంగా, హాస్యాస్పదంగా చెప్పడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు.
ఈ సినిమాలో హీరోగా శివకార్తికేయన్ ముందుండి సినిమాని నడిపించాడు. ఎమోషన్ ఏదైనా తన స్టైల్ లో శివకార్తికేయ ఆడియన్స్ ని మెప్పిస్తూ ఉంటాడు. ఈ మూవీలో కూడా అన్ని ఎమోషన్స్ ని పండించే ఛాన్స్ హీరోకి దక్కింది. ఆ తర్వాత క్రెడిట్స్ దక్కేది మాత్రం టట్టూకనే చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమాలో టట్టూనే సెకండ్ హీరో. ఆ క్యారెక్టర్ కు అంతటి ప్రాధాన్యం ఉంటుంది. అలాగే కొన్ని సీన్స్ లో శివకార్తికేయన్ మించి టట్టూకి ప్రయారిటీ ఉంటుంది. ఇంక హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, యోగిబాబు, కరుణాకరణ్ కూడా వారి పాత్రలకు న్యాయం చేశారు. నెగిటివ్ పాత్రల్లో ఇషా కొప్పికర్, శరద్ కేల్కర్ అద్భుతంగా నటించారు. తమీజ్, టట్టూ క్యారెక్టర్స్ ఎంత ఎలివేట్ అవుతాయో.. వీళ్ల పాత్రలు కూడా అలాగే ఎలివేట్ అవుతాయి.
ఈ సినిమాకి సంబంధించి స్క్రీన్ మీద శివకార్తికేయన్, టట్టూ హీరోలు అయినప్పటికీ ఆఫ్ ది కెమెరా మాత్రం డైరెక్టర్ రవికుమార్ నే హీరో అని చెప్పాలి. ఒక ఛాలెంజింగ్ స్టోరీని ఎంతో ఎంగేజింగ్ గా తెరకెక్కించారు. ఒక సైన్స్ విక్షన్ స్టోరీని తెరకెక్కించడమే కష్టమనుకుంటే.. ఆడియన్స్ కి నచ్చే రీతిలో తీయడం అనేది పెద్ద టాస్కనే చెప్పాలి. ఆ టాస్కులో రవికుమార్ సక్సెస్ అయ్యారు. ఈ సినిమాలో గ్రాఫిక్స్ వర్క్ అందరినీ మెప్పిస్తుంది. నిజానికి సినిమా మీద ఆసక్తి కలగడం వెనుకున్న బిగ్ పిల్లర్ కూడా అదే. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ ఈ చిత్రానికి యాడెడ్ అసెట్ అనే చెప్పాలి. నీరవ్ షా సినిమాటోగ్రఫీ మెప్పిస్తుంది. చివరిగా నిర్మాణ విలువలు ఆకట్టుకుంటాయి.
చివరిగా: అయలాన్ అలరించడంలో రాజీ పడలేదు..