iDreamPost
android-app
ios-app

Sarpanch Navya: సర్పంచ్ నవ్యకు ఫోన్ వేధింపులు.. లక్ష ఇస్తాను పడు*కుంటావా అంటూ..!

Sarpanch Navya: సర్పంచ్ నవ్యకు ఫోన్ వేధింపులు.. లక్ష ఇస్తాను పడు*కుంటావా అంటూ..!

ఎంఎల్ఏ తాటికొండ రాజయ్య- జానకీపురం సర్పంచ్ నవ్య మధ్య జరుగుతున్న వివాదాల గురించే అందరికీ తెలిసిందే. తాటికొండ రాజయ్య తనను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారంటూ ఆరోపించారు. తర్వాత అందరు ఆడవాళ్లకు ఎంఎల్ఏ బహిరంగంగా క్షమాపణ కూడా చెప్పారు. జానకీపురం గ్రామానికి రూ.25 లక్షలు మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు. ఆ తర్వాత నిధుల విషయంలో రాజయ్య మాటమార్చారంటటూ నవ్య ఆరోపించారు. ఇలా వారి మధ్య ఆరోపణలు, వివాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో సర్పంచ్ నవ్యకు కొత్త వేధింపులు ప్రారంభమయ్యాయి. గుర్తుతెలియని వ్యక్తి ఆమెకు ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడాడు.

సర్పంచ్ నవ్య పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో వైరల్ గా మారిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యే వేధిస్తున్నారంటూ మీడియా ముందు తన గోడును వెల్లబోసుకున్నారు. తర్వాత ఎమ్మెల్యే రాజయ్య క్షమాపణలు చెప్పడంతో కాస్త వివాదం సద్దుమణిగినట్లు అయింది. తాజాగా సర్పంచ్ నవ్యకు కొత్త వేధింపులు మొదలైనట్లు కనిపిస్తోంది. ఒక గుర్తుతెలియని వ్యక్తి సర్పంచ్ నవ్యకు ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడాడు. అందుకు సంబంధించిన ఫోన్ కాల్ ఆడియో రికార్డింగ్ నెట్టింట వైరల్ గా మారింది. ఎలా ఉన్నావ్.. ఏం చేస్తున్నావ్ అంటూ మాటలు ప్రారంభించి ఆ తర్వాత ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం ప్రారంభించాడు.

ఎవరు నువ్వు అంటే చెప్పకుండా నోటికొచ్చినట్లు మాట్లాడాడు. రోజుకు లక్ష ఇస్తాను.. పడు*కుంటావా అంటూ వాగాడు. అతని మాటలు విన్న సర్పంచ్ నవ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. అతనికి గట్టిగా బుద్ధి చెప్పారు. మీ ఇంట్లో ఆడవాళ్లని కూడా అలాగే పంపిస్తున్నావా? రోజుకి రెండు లక్షల కోసం మీ అమ్మ, అక్క, పెళ్లాం, చెల్లిని కూడా అలాగే పంపిస్తున్నావా? చెప్పరా? అంటూ చెప్పుతో కొట్టినట్లుగా సమాధానం చెప్పారు. ఆ ఆడియో రికార్డింగ్ విన్న నెటిజన్స్ సర్పంచ్ నవ్యను ప్రశంసిస్తున్నారు. అలాంటి పోకిరికి గట్టిగా బుద్ధి చెప్పారు. మీ ధైర్యం, మీ సమయస్ఫూర్తిని కచ్చితంగా మెచ్చుకోవాల్సిందే అంటూ కామెంట్ చేస్తున్నారు.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetcasibomJojobetcasibomjojobetjojobetcratosroyalbetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabet