iDreamPost
android-app
ios-app

Mallareddy: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.. మేడ్చల్ లో మల్లారెడ్డి ముందంజ

  • Published Dec 03, 2023 | 11:08 AM Updated Updated Dec 03, 2023 | 11:08 AM

Mallareddy, Medchal-TS Election Result 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మేడ్చల్ నియోజకవర్గం మల్లారెడ్డి ముందంజలో ఉన్నారు.

Mallareddy, Medchal-TS Election Result 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మేడ్చల్ నియోజకవర్గం మల్లారెడ్డి ముందంజలో ఉన్నారు.

  • Published Dec 03, 2023 | 11:08 AMUpdated Dec 03, 2023 | 11:08 AM
Mallareddy: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.. మేడ్చల్ లో మల్లారెడ్డి ముందంజ

తెలంగాణ అసెంబ్లీ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో కాంగ్రెస్ అధిక్యంలో దూసుకుపోయింది. ఈవీఎం ఓట్ల కౌంటిగ్ ప్రారంభం అయ్యింది. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య హోరాహోరీ పోటీ కొనసాగుతుంది. రౌండ్, రౌండ్‌కు కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య అధిక్యం మారుతోంది. ఇప్పటివరకు వెలువడిన రెండు, మూడు రౌండ్ల కౌంటింగ్ పూర్తయ్యే సరికి కాంగ్రెస్ పూర్తి మెజార్టీతో దూసుకెళ్తుంది. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో హస్తం పార్టీ మ్యాజిక్ ఫిగర్ టచ్ చేసింది. కాంగ్రెస్ 64 స్థానాల్లో, బీఆర్ఎస్ 39 స్థానాల్లో, బీజేపీ 10 స్థానాల్లో, ఎంఐఎం 3 స్థానాల్లో, సీపీఐ 1 స్థానంలో ఆధిక్యంలో ఉన్నాయి.

ఇక మేడ్చల్ లో బీఆర్ఎస్ అభ్యర్థి మల్లారెడ్డి ముందంజలో ఉన్నారు. 5600 ఓట్ల మెజార్టీతో దూసుకుపోతున్నాడు.  ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో హైదరాబాద్‌లో ఎక్కువ చోట్ల బీఆర్ఎస్.. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో అధిక స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉన్నాయి.  కామారెడ్డిలో కేసీఆర్ వెనకంజలో ఉండగా.. రేవంత్ దూసుకుపోతున్నాడు. గజ్వేల్‌లో కేసీఆర్ ఆధిక్యంలో దూసుకెళ్తుండగా.. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ వెనుకంజలో ఉన్నారు. హుజూరాబాద్‌లో మాత్రం ఈటల ముందంజలో ఉన్నారు.