Dharani
కాసాని జ్ఞానేశ్వర్ టీడీపీకి రాజీనామా చేశారు. త్వరలోనే ఆయన బీఆర్‌ఎస్‌లో చేరతారనే ప్రచారం సాగుతోంది. ఇదలా ఉంచితే.. రాజా సింగ్‌ని ఢీ కొట్టేందుకు కేసీఆర్.. కాసానిని బరిలో నిలపబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. ఆ వివరాలు..
కాసాని జ్ఞానేశ్వర్ టీడీపీకి రాజీనామా చేశారు. త్వరలోనే ఆయన బీఆర్‌ఎస్‌లో చేరతారనే ప్రచారం సాగుతోంది. ఇదలా ఉంచితే.. రాజా సింగ్‌ని ఢీ కొట్టేందుకు కేసీఆర్.. కాసానిని బరిలో నిలపబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. ఆ వివరాలు..
Dharani
తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతుండటంతో.. పార్టీలన్ని ప్రచార కార్యక్రమాలతో దూసుకుపోతున్నాయి. ఎన్నికల నగరా మోగిన నాటి నుంచి తెలంగాణలో రాజకీయ వాతావరణం హీట్ ఎక్కింది. టికెట్ దక్కని అసంతృప్తులు.. పార్టీలకు గుడ్ బై చెప్తున్నారు. ఇదిలా ఉండగా.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పోటీ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. దాంతో టీటీడీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన కాసాని జ్ఞానేశ్వర్.. పార్టీకి రాజీనామా చేశారు. ఇక త్వరలోనే ఆయన బీఆర్‌ఎస్ పార్టీలో చేరతారని.. ఇప్పటికే కారు పార్టీ ముఖ్య నేత ఒకరు.. కాసానితో చర్చలు జరిపారని.. మరో ఒకటి, రెండు రోజుల్లోనే ఆయన గులాబీ పార్టీలో చేరతారని జోరుగా ప్రచారం సాగుతోంది. ఇదిలా ఉండగా కాసాని పోటీ చేయబోయే స్థానం గురించి ఆసక్తికర వార్త ఒకటి వెలుగు చూసింది.
శుక్రవారం కాసాని కేసీఆర్‌తో భేటీ కానున్నారని సమాచారం. ఈ సందర్భంగా వారి మధ్య గోషామహల్ నుంచి పోటీపై చర్చించే అవకాశం ఉంది అంటున్నారు రాజకీయ పండితులు. ప్రస్తుతం గోషామహ్‌ల్‌లో బీజేపీ నుంచి రాజా సింగ్ బలమైన అభ్యర్థిగా ఉన్నారు. 2014, 18 ఎన్నికల్లో రాజా సింగ్ ఇక్కడ విజయం సాధించారు. గోషామహల్ నియోజకవర్గం బీజేపీకి కంచుకోట అని చెప్పవచ్చు. 2023 ఎన్నికల్లో భాగంగా గోషామహల్ సీటును రాజా సింగ్‌కే కేటాయించనుంది బీజేపీ.
ఈ క్రమంలో గోషామహల్‌లో రాజా సింగ్‌ను ఓడించడం కోసం కేసీఆర్ మాస్టర్ ప్లాన్‌ను అమలు చేయబోతున్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా కాసానిని బీఆర్‌ఎస్ పార్టీలో చేర్చుకుని.. ఆయనను గోషా మహల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయిస్తే బాగుటుందని కేసీఆర్ భావిస్తున్నారట. ఇక గోషామహల్‌లో బీసీ ఓట్లే అధికంగా ఉన్నాయి. కాసాని కూడా ముదిరాజ్ సామాజిక వర్గానికి చేందిన నేత కావడంతో తమకు కలసి వస్తుందని బీఆర్‌ఎస్ భావిస్తోందట. అంతేకాక.. ఇక్కడ ఎంఐఎం సహకారంతో ఈ స్థానంలో బీఆర్‌ఎస్ గెలవవచ్చని నమ్మకంగా ఉన్నారట కారు పార్టీ అధ్యక్షుడు. అదే జరిగితే.. ఈ సారి గోషామహల్‌లో హోరాహోరి పోటీ ఉండనుంది. మరి కాసాని ఎక్కడ నుంచి పోటీ చేస్తారో తెలియాలంటే.. మరి కొన్ని రోజులు ఆగాలి.