iDreamPost
android-app
ios-app

బ్రేకింగ్‌: MLC కవితకు అస్వస్థత.. స్పృహతప్పి పడిపోవడంతో

  • Published Nov 18, 2023 | 12:42 PMUpdated Nov 18, 2023 | 12:54 PM

ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత అస్వస్థతకు గురయ్యారు. ప్రచారం వాహనంలో స్పృహ తప్పి పడిపోయారు. ఆ వివరాలు..

ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత అస్వస్థతకు గురయ్యారు. ప్రచారం వాహనంలో స్పృహ తప్పి పడిపోయారు. ఆ వివరాలు..

  • Published Nov 18, 2023 | 12:42 PMUpdated Nov 18, 2023 | 12:54 PM
బ్రేకింగ్‌: MLC కవితకు అస్వస్థత.. స్పృహతప్పి పడిపోవడంతో

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రచార వాహనంలోనే స్పృహతప్పి పడిపోయారు. తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో కవిత.. బీఆర్‌ఎస్‌ పార్టీ తరఫున ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటూ ఫుల్‌ బిజీగా ఉన్నారు. అభ్యర్థుల తరఫున నియోజకవర్గాల్లో పర్యటిస్తూ.. విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలోనే శనివారం నాడు.. కవిత రాయికల్‌ మండలం, ఇటిక్యాలలో పర్యటించారు కవిత. ప్రచార వాహనం మీద నిలబడి ఉన్న సమయంలో ఆమె అస్వస్థతకు గురయ్యారు. కళ్లు తిరిగి ప్రచార వాహనం మీద పడిపోయారు

కవిత కింద పడటం గమనించిన వారు.. వెంటనే ఆమె దగ్గరకు వచ్చి సపర్యలు చేశారు. గాలి ఆడేలా చేసి.. ఆమె విశ్రాంతి తీసుకునే ఏర్పాట్లు చేశారు. ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉంటూ.. నిత్యం ప్రయాణాలు చేస్తుండటం వల్ల ఇలా అస్వస్థతకు గురయినట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. కాసేపు ప్రచార వాహనంలోనే విశ్రాంతి తీసుకున్నారు కవిత. అనంతరం ఆమె ఆరోగ్యం కుదుటపడటంతో.. తిరిగి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ప్రసుత్తం ఆమె ఆరోగ్యం బాగానే ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక కొన్ని రోజుల క్రితం కేటీఆర్‌కు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైన సంగతి తెలిసిందే. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో ఎన్నికల ర్యాలీ సందర్భంగా కేటీఆర్‌ ప్రచార రథం నుంచి కింద పడిపోయారు. ఆయనతో పాటు వాహనంలో ఉన్న ఇతర నేతలు కూడా కింద పడ్డారు. అయితే ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. ఇక తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ విజయం కోసం ఆ పార్టీ కీలక నేతలైన కేసీఆర్‌, కేటీఆర్‌, కవిత, హరీశ్‌ రావులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. అన్నీ తామే అయ్యి రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారు. ఇక ప్రచారంలో భాగంగా కేటీఆర్‌, కవిత.. గులాబీల జెండ పాటకు డ్యాన్స్‌ కూడా చేశారు. ఆ వీడియోలు నెట్టింట తెగ వైరలయ్యాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి