వీడియో: MLC కవిత మాస్‌ డ్యాన్స్‌.. గులాబీల జెండలే రామక్క అంటూ

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పార్టీలు, అభ్యర్థులు దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో ఎలక్షన్‌ ప్రచారంలో పాల్గొన్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. డ్యాన్స్‌ చేసిన వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. ఆ వివరాలు..

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పార్టీలు, అభ్యర్థులు దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో ఎలక్షన్‌ ప్రచారంలో పాల్గొన్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. డ్యాన్స్‌ చేసిన వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. ఆ వివరాలు..

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం తీవ్ర స్థాయికి చేరుకుంది. నవంబర్‌ 30న పోలింగ్‌ జరగనుంది. అంటే.. నేతల భవితవ్యాన్ని నిర్ణయించేందుకు మరో 14 రోజుల సమయం మాత్రమే ఉంది. ఇక ఎన్నికల సమరానికి గడువు దగ్గర పడుతుండటంతో.. పార్టీలు, అభ్యర్థులు జోరు పెంచారు. పోలింగ్‌కు మరో రెండు వారాల సమయం మాత్రమే ఉండటంతో.. అన్ని పార్టీలు ప్రచారాన్ని ఉధ్రుతం చేస్తున్నాయి. ఇక ఎన్నికల ప్రచార వేళ.. అన్ని పార్టీలు, కొందరు అభ్యర్థులు ప్రత్యేకంగా పాటలు రాయించుకుంటారు. ఇక ప్రచార కార్యక్రమాల్లో ఈ పాటలు మోత మోగి పోతుంటాయి.

అయితే అన్ని పాటలు క్లిక్కవ్వవు.. కొన్ని పాటలు మాత్రమే ప్రజల నోళ్లలో నానుతుంటాయి. ఈసారి ఎన్నికల వేళ ఎక్కడ చూసినా గులాబీల జెండలే రామక్క పాట మారుమోగిపోతుంది. నియోజకవర్గాల్లో ఎక్కడ విన్నా.. ఈ పాటే వినిపిస్తోంది. గులాబీల జెండలే అని వినబడితే చాలు.. బీఆర్ఎస్ పార్టీ క్షేత్రస్థాయి కార్యకర్త మొదలు.. టాప్ లీడర్ల వరకు ఉత్సాహంతో కాలు కదుపుతున్నారు. తాజాగా ఈ పాటకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా డ్యాన్స్‌ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో వైరలవుతోంది.

ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు ఎమ్మెల్సీ కవిత. నియోజకవర్గాల్లో పర్యటిస్తూ.. బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తున్నారు. విపక్షాల మీద విమర్శలు చేయడమే కాక తొలిసారి పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపడం కోసం కాలు కదిపి డ్యాన్స్‌ కూడా చేశారు కవిత. అది కూడా ప్రస్తుతం టాప్‌ ట్రెండింగ్‌లో ఉన్న గులాబీల జెండలే రామక్క పాటకు కావడం విశేషం. ఈ సాంగ్‌కు కార్యకర్తలతో కలిసి స్టెప్పులు వేశారు కవిత.

ఎన్నికల ప్రచారంలో భాగంగా కవిత బుధవారం రాత్రి బాల్కొండ నియోజకవర్గంలో పర్యటించారు. మంత్రి నిరంజన్ రెడ్డికి మద్ధతుగా ఆమె ప్రచారం చేశారు. ఎప్పుడూ బతుకుమ్మ పాటలకు కాలు కదిపే కవిత.. ఇప్పుడు  గులాబీ జెండలమ్మ పాటకు  మాస్ డ్యాన్స్ చేయటం చూసి కార్యకర్తలు అబ్బురపడిపోయారు.

మోర్తాడ్ గ్రామంలో ఓ కూడలి వద్ద జనాలనుద్దేశించి ప్రసంగించిన కవిత.. ఆ తర్వాత గులాబీ జెండలే పాటకు డ్యాన్స్ చేశారు. కార్యకర్తలతో కలిసి స్టెప్పులేశారు. ఇందుకు సంబంధించిన వీడియోనూ ఆమె ట్విట్టర్ ఎక్స్‌లో పోస్టు చేశారు. ప్రస్తుతం ఇది సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది. కవిత డ్యాన్స్‌ వీడియోను చూసిన బీఆర్ఎస్ శ్రేణులు తగ్గేదేలే అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

అంతేకాక ఇన్నాళ్లు బతుకమ్మ పాటకు కవితమ్మ ఆటను మాత్రమే చూశాము.. ఇప్పుడు ఈ గులాబీ జెండలమ్మ పాటకు కవిత మాస్ డ్యాన్స్ చూసి అవకాశం దక్కింది అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. ఇక పాటకు తగ్గట్లుగా అడుగులు వేస్తూ.. అందరిని ఉత్సాహపరుస్తూ డ్యాన్స్‌ చేశారు కవిత. ఇటీవల మంత్రి కేటీఆర్ కూడా స్టేజీపై డ్యాన్స్ చేసిన సంగతి తెలిసిందే.

కాగా, బాల్కొండ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత.. కాంగ్రెస్, బీజేపీలపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ రెండు పార్టీలు కేవలం ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నిస్తున్నాయని.. కానీ బీఆర్ఎస్ మాత్రం తెలంగాణ ప్రజలు గెలవాలని, వారి బతుకులు బాగుపడాలని కోరుతోందన్నారు. బాల్కొండను బంగారుకొండలా అభివృద్ధి చేసిన మంత్రి ప్రశాంత్ రెడ్డిని మళ్లీ గెలిపించాలని ప్రజలను కోరారు ఎమ్మెల్సీ కవిత.

Show comments