Dharani
ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ బీజేపీ అభ్యర్థి బాబు మోహన్‌కు భారీ షాక్ తగిలింది. ఆయన కుమారుడు బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఆ వివరాలు..
ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ బీజేపీ అభ్యర్థి బాబు మోహన్‌కు భారీ షాక్ తగిలింది. ఆయన కుమారుడు బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఆ వివరాలు..
Dharani
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుంది. పార్టీలన్ని ప్రచార కార్యక్రమాలతో బిజీగా ఉన్నాయి. ఇక అసంతృప్తులను బుజ్జగించే కార్యక్రమాలు కూడా ముగింపు దశకు వచ్చాయి. అక్కడక్కడ కొందరు మాత్రం.. ఇంకా అసంతృప్తితోనే ఉండి.. పక్క పార్టీల వైపు చూస్తున్నారు. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న తరుణంలో కూడా ఇతర పార్టీల్లోకి జంప్ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఆందోల్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి బాబు మోహన్‌కి భారీ షాక్ తగిలింది. ఎన్నికలకు సరిగ్గా పది రోజుల సమయం మాత్రమే ఉండగా.. ఆయన కుమారుడు.. ఉదయ్ బీఆర్‌ఎస్‌లో చేరారు. ఆవివరాలు..
బాబు మోహన్ కుమారుడు ఉదయ్ బాబు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మంత్రి హరీష్ రావు సమక్షంలో ఆయన కారు పార్టీలో చేరి.. గులాబీ కండువా కప్పుకున్నారు. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ ఉదయ్ బాబు ఇచ్చిన షాక్ చూసి బీజేపీ నేతలు ఫ్రీజ్ అయ్యారు. ఎన్నికల ముందు ఇదేం ట్విస్ట్.. తండ్రి బీజేపీలో ఉంటే.. కొడుకు బీఆర్‌ఎస్‌లో చేరడం ఏంటని చర్చించుకుంటున్నారు. ఉదయ్ బాబు నిర్ణయం తెలంగాణ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. పార్టీ మార్పు గురించి ఉదయ్ బాబు స్పందిస్తూ.. తాను బీఆర్‌ఎస్‌లో చేరే విషయం తన తండ్రి బాబు మోహన్‌కి తెలుసని అన్నాడు. అంతేకాక ఆందోల్ బీజేపీ కేడర్ మెుత్తం తన వెంటే ఉందని చెప్పుకొచ్చాడు.
ఉదయ్ బాబు మోహన్ ఈ నిర్ణయం తీసుకోవడం వెనక బలమైన కారణం ఉంది. ఉదయ్ బాబు.. ఆందోల్ నుండి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగాలని ఆశించారు. అంతేకాక బీజేపీ తనకే టికెట్ కేటాయిస్తుందని ప్రచారం కూడా చేసుకున్నారు. కానీ బీజేపీ అధిష్టానం మాత్రం ఉదయ్ బాబుకి టికెట్ నిరాకరించింది. అంతేకాక ఆయన తండ్రి, మాజీ మంత్రి బాబు మోహన్‌కే మరోసారి బీజేపీ అవకాశం ఇచ్చింది. తండ్రితో ఉన్న విభేదాలకు తోడు బీజేపీ టికెట్ కేటాయించకపోవటంతో ఉదయ్ బాబు తీవ్ర అసంతృప్తికి గురైనట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పార్టీ మారేందుకు నిర్ణయం తీసుకున్నారు. కారు పార్టీలో చేరారు.
ఆదివారం ఉదయం కారు పార్టీలో చేరారు ఉదయ్ బాబు. ఈ క్రమంలో మంత్రి హరీష్ రావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆందోల్ బీఆర్ఎస్ అభ్యర్థి క్రాంతి గెలుపునకు కృషి చేస్తానని ఆయన వెల్లడించారు. ఆందోల్‌లో బీజేపీ కేడర్ మొత్తం తన వెనకే ఉందని తెలిపారు. ఉదయ్ బాబు నిర్ణయంతో బాబు మోహన్ పరిస్థితి దారుణంగా తయారయ్యిందంటున్నారు పార్టీ నేతలు. ప్రస్తుతం బాబు మోహన్‌కి ఆందోల్‌లో కేడర్ సపోర్ట్ అంతంత మాత్రంగానే ఉండగా.. ఇటు కొడుకు ఉదయ్ బాబు పార్టీ వీడటం మూలిగే నక్క మీద తాటిపండు పడ్డ చందంగా మారింది అంటున్నారు. అతడు బీజేపీని వీడటం పార్టీకి కూడా తీవ్ర దెబ్బనే చెప్పవచ్చు అంటున్నారు స్థానికులు.
ఇక ఇప్పటికే పలువురు సీనియర్లు.. బీజేపీని వీడిన సంగతి తెలిసిందే. ఇప్పటికే కోమటిరెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి, వివేక్, విజయశాంతి వంటి కీలక నేతలు బీజేపీని వీడారు. ఇక తాజాగా వారి బాటలో ఉదయ్ బాబు కూడా చేరారు. తండ్రి పోటీ చేస్తున్న స్థానంలో సపోర్ట్ చేయకుండా కొడుకు మరో పార్టీలో చేరటం ఆ పార్టీపై ప్రజల్లోకి ప్రతికూల అభిప్రాయాన్ని తీసుకెళ్తుందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరి ఉదయ్ బాబు పార్టీ మారడం వల్ల బాబు మోహన్‌కి నష్టం చేస్తుందో.. లేక బీఆర్‌ఎస్‌కి లాభం కలిగిస్తుందో తెలియాలంటే.. డిసెంబర్ 3వరకు ఆగాల్సిందే అంటున్నారు.
ఆందోల్ బీజేపీ అభ్యర్థి, మాజీ మంత్రి బాబు మోహన్ కి షాక్ ఇచ్చిన తనయుడు
సిదిస్పేటలో మంత్రి హరీశ్ రావు సమక్షంలో BRS పార్టీలో చేరిన బాబుమోహన్ కొడుకు ఉదయ్ బాబు మోహన్
ఉదయ్ బాబు మోహన్ తో పాటు, ఆందోల్, జోగిపేట మున్సిపల్ ప్రెసిడెంట్ సాయి కృష్ణ, అందోల్ మండల ప్రెసిడెంట్ నవీన్ ముదిరాజ్,… pic.twitter.com/SaBQjkrbHz
— Telugu Scribe (@TeluguScribe) November 19, 2023