iDreamPost
android-app
ios-app

Seethakka: హస్తం హవా.. ములుగులో సీతక్కకు భారీ ఆధిక్యం!

  • Published Dec 03, 2023 | 11:34 AM Updated Updated Dec 03, 2023 | 3:27 PM

Seethakka, Mulugu-TS Election Result 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ములుగు నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్థి సీతక్క ముందంజలో ఉన్నారు.

Seethakka, Mulugu-TS Election Result 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ములుగు నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్థి సీతక్క ముందంజలో ఉన్నారు.

  • Published Dec 03, 2023 | 11:34 AMUpdated Dec 03, 2023 | 3:27 PM
Seethakka: హస్తం హవా.. ములుగులో సీతక్కకు భారీ ఆధిక్యం!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ రోజు ఓట్ల లెక్కింపు జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం వెలువడుతున్న ఫలితాల ఆధారంగా.. కాంగ్రెస్‌ పార్టీ ఆధిక్యం ప్రదర్శిస్తోంది. అధికార బీఆర్‌ఎస్‌ పార్టీ పోటీ ఇస్తున్నా.. మెజార్టీ స్థానాల్లో హస్తం పార్టీ ఆధిక్యంలో ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా సుపరిచితురాలైన కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి సీతక్క భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి బడే నాగజ్యోతి, బీజేపీ అభ్యర్థి అజ్మీరా ప్రహ్లాద్‌ నాయక్‌ వెనుకంజలో ఉన్నారు.

ములుగు నియోజకవర్గంలో ఏడోవ రౌండ్ ముగిసే సరికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సీతక్క 10,080 ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఈ ఫలితాల నేపథ్యంలో ఆమె గెలుపుపై కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు ధీమాగా ఉన్నాయి. ఇక్కడ సీతక్క గెలుపు ఖాయంగానే కనిపిస్తోంది. అయితే.. పార్టీలకు అతీకంగా సీతక్కకు ఓట్లు పడినట్లు సమాచారం. కరోనా సమయంలో ఆయన చేసిన సేవలు, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండటం ఆమె విజయానికి దోహదం చేస్తున్నాయని కాంగ్రెస్‌ కార్యకర్తలు అంటున్నారు. ఇప్పటి వరకు మొత్తం రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్‌ 67, బీఆర్‌ఎస్‌ 39, బీజేపీ 10, ఎంఐఎం 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. మరి సీతక్కకు ఇంత భారీ ఆధిక్యం రావడానికి కారణం ఏంటని మీరు భావిస్తున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

The liveblog has ended.
No liveblog updates yet.

LIVE NEWS & UPDATES