iDreamPost
android-app
ios-app

మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడికి హైకోర్టులో భారీ ఊరట! హైడ్రాకు ఆదేశాలు..

Marri Educational Society Notices: బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి చెందిన మర్రి ఎడ్యుకేషనల్‌ సొసైటీ, మారుతి ఎడ్యుకేషనల్‌ సొసైటీలకు హైడ్రా నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో  ఆయన కోర్టులో పిటిషన్లు దాఖలు చేయగా భారీ ఊరట లభించింది.

Marri Educational Society Notices: బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి చెందిన మర్రి ఎడ్యుకేషనల్‌ సొసైటీ, మారుతి ఎడ్యుకేషనల్‌ సొసైటీలకు హైడ్రా నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో  ఆయన కోర్టులో పిటిషన్లు దాఖలు చేయగా భారీ ఊరట లభించింది.

మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడికి హైకోర్టులో భారీ ఊరట! హైడ్రాకు ఆదేశాలు..

హైదరాబాద్ నగరంలోని  చెరువులును, ఎఫ్టీఎల్, బఫర్ జోన్ ప్రాంతాల్లో అక్రమంగా నిర్మించిన కట్టడాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. ఇప్పటికే హైడ్రా అనేక అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది. ఈ నేపథ్యంలో హైడ్రా పేరు వింటేనే అక్రమార్కులు గుండెల్లో రైళ్లు పరిగెడ్తున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డికి చెందిన విద్యాసంస్థలకు హైడ్రా నోటీసులు జారీ చేసింది. దీంతో తన విద్యాసంస్థలకు హైడ్రా నోటీసులు ఇవ్వడంపై ఆయన కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో హైకోర్టులో మర్రి రాజశేఖర్ రెడ్డికి భారీ ఊరట లభించింది.

తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి చెందిన మర్రి ఎడ్యుకేషనల్‌ సొసైటీ, మారుతి ఎడ్యుకేషనల్‌ సొసైటీలకు హైడ్రా నోటీసులు జారీ చేయడంతో  ఆయన కోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. ఈ పిటిషన్ బుధవారం తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ క్రమంలోనే మర్రి, మారుతి విద్యాసంస్థలకు చెందిన భవనాల కూల్చివేత విషయంలో రూల్స్ ప్రకారమే ముందుకెళ్లాలని హైడ్రా, రెవెన్యూ అధికారులకు హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. అంతేకాక మర్రి రాజశేఖర్ రెడ్డికి సంబంధించిన విద్యాసంస్థల భవనాలను అక్రమ నిర్మాణాలుగా పేర్కొంటూ ఇచ్చిన నోటీసులనే షోకాజ్‌ నోటీసులుగా పరిగణించి, వాటికి సంబంధించిన ఆధారాలను సమర్పించాలని పిటిషనర్లను కోర్టు ఆదేశించింది.

మేడ్చల్‌- మల్కాజిగిరి జిల్లాలోని దుండిగల్‌ ప్రాంతం పరిధిలోని  చిన్నదామెర చెరువులో మర్రి రాజశేఖర్ రెడ్డికి చెందిన విద్యా సంస్థల భవనాలను చెరువులను ఆక్రమించి నిర్మించారని, వాటిని తొలగించాలంటూ ఎమ్మార్వో ఆగస్టు 22న నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులను సవాల్‌ చేస్తూ రెండు విద్యా సంస్థలు వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు వేశాయి. ఈ రెండు పిటిషన్లపై విచారణ చేపట్టిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె.లక్ష్మణ్‌ విచారణ చేపట్టి..పై విధంగా కీలక ఆదేశాలను జారీ చేశారు. విచారణ సందర్భంగా పిటిషనర్‌ తరపు న్యాయవాది ఎస్‌.నిరంజన్‌రెడ్డి ముందు కీలక విషయాలను ప్రస్తావించారు. చిన్నదామెర చెరువులో 8.24 ఎకరాల్లో ఆక్రమణలున్నాయని, వాటిని తొలగించాలని నోటీసులు జారీచేసినట్లు తెలిపారు.

అలాగే మర్రి విద్యా సంస్థల్లో 5 వేల మందికిపైగా విద్యార్థులున్నారని, ఆ నిర్మాణాల కూల్చివేతలు చేపట్టకుండా ఆదేశాలివ్వాలని హైకోర్టును ఆయన కోరారు. ఈ నిర్మాణాలకు సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, ఎగ్జిక్యూటివ్‌ అధికారుల నుంచి 2007లో అనుమతులు తీసుకున్నట్లు న్యాయవాది తెలిపారు. వీటికి ప్రభుత్వ తరపున అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ తేరా రజనీకాంత్‌రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఇరువైపు  వాదనలను విన్న జస్టిస్ లక్ష్మణ్.. కూల్చివేతల విషయంలో చట్టప్రకారం ముందుకెళ్లాలంటూ విచారణను ముగించారు. అప్పటి వరకు మర్రి విద్యా సంస్థలపై ఎలాంటి చర్యలు చేపట్టవద్దని హైడ్రాతో పాటు రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీచేశారు.