iDreamPost
android-app
ios-app

ఆ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన రేవంత్ సర్కార్.. త్వరలోనే..

  • Published Aug 09, 2024 | 8:04 AM Updated Updated Aug 09, 2024 | 8:04 AM

Good News for Employees: ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఆ ఉద్యోగులకు రేవంత్ సర్కార్ పండగలాంటి వార్త అందించింది.. త్వరలోనే వారి కల సాకారం చేయనుంది.

Good News for Employees: ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఆ ఉద్యోగులకు రేవంత్ సర్కార్ పండగలాంటి వార్త అందించింది.. త్వరలోనే వారి కల సాకారం చేయనుంది.

ఆ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన రేవంత్ సర్కార్.. త్వరలోనే..

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా వ్యవసాయ రంగం, ఉద్యోగులు, మహిళా, నిరుద్యోగులకు ఉపాది కల్పన ఇలా ఎన్నో విషయాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెడుతుంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత పదేళ్ల పాటు ప్రతిపక్ష హోదాలో ఉంటూ వచ్చిన కాంగ్రెస్ పార్టీ గత ఏడాది జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ని ఓడించి అధికారంలోకి వచ్చింది. ఎన్నికల వేళ తెలంగాణ ప్రజలకు ఆరు గ్యారెంటీ పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చింది. ఇప్పటికే పలు పథకాలు అమలు చేసింది. తాజాగా ఆ ఉద్యోగులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కల నెరవేరే సమయం వచ్చింది.. విద్యుత్ శాఖలో ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న ప్రమోషన్లు, బదిలీలకు మోక్షం కలిగించనుంది రేవంత్ సర్కార్. త్వరలోనే విద్యుత్ శాఖ ఉద్యోగులకు ప్రమోషన్లు, బదిలీలపై నిర్ణయం తీసుకుంటామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులకు చెప్పారు. విద్యుత్ శాఖలో 7,8 సంవత్సరాలుగా ప్రమోషన్లు లేవని, దీని వల్ల ఎంతోమంది ఉద్యోగులు మానసికంగా ఒత్తిడికి గురి అవుతున్నారని ఈ సందర్భంగా భట్టి అన్నారు. గత ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులలోని లోపాలను కాంగ్రెస్ పార్టీపైకి నెట్టే యత్న్ం బీఆర్ఎస్ నేతలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని విమర్శలు వచ్చినా ప్రజలు గమనిస్తున్నారని.. ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా స్నేహపూర్వకంగా ఉండే ప్రభుత్వం అని అన్నారు.

హైదరాబాద్‌లోని టీజీఎస్సీ‌డీసీఎల్ పై విద్యుత్ శాఖ ప్రధాన కార్యాలయంలో గురువారం అధికారులతో ఆయన ప్రత్యేక సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యుత్ శాఖ అధికారులు ఎన్నో ఏళ్లుగా తమకు ప్రమోషన్లు, బదిలీలు లేకండా పోయాయని.. పనికి సరైన గుర్తింపు రావడం లేదని దీంతో పాటు పలు సమస్యల  గురించి ప్రస్తావించగా, దీనిపై స్పందించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క త్వరలో విద్యుత్ శాఖలో ఉద్యోగులకు పదోన్నతులు, బదిలీలపై చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులను ఆదేశించినట్లు చెప్పారు.